అల్లు స్నేహా రెడ్డి నువ్ రెడీనా?.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ వైరల్

0
5
అల్లు స్నేహా రెడ్డి నువ్ రెడీనా?.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ వైరల్photo 86996316

సెలెబ్రిటీ స్టైలిష్ట్, డిజైనర్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. సమంత ఫ్రెండ్‌గా ప్రీతమ్‌కు ఒకప్పుడు ఓ ఇమేజ్ ఉండేది. ఈ ఇద్దరి రిలేషన్ షిప్‌పై రకరకాల కామెంట్లు వచ్చాయి. అయితే వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై క్లారిటీ వచ్చింది. స్వయంగా ప్రీతమ్ సైతం నోరు విప్పేశాడు. తామిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్ వంటి వారమని, తాను సమంతను అక్కా అని పిలుస్తాను అని అందరికీ తెలుసని రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేశాడు. తమ రిలేషన్ గురించి చైతూకి కూడా తెలుసుని అన్నాడు.

అలాంటి రూమర్లు వచ్చినప్పుడు చైతూ స్పందించకపోవడం, ఖండించకపోవడం తనను ఎంతగానో బాధించింది అని ప్రీతమ్ చెప్పుకొచ్చాడు. అయితే తాను సమంతకు ఎలాంటి సమయాల్లోనైనా తోడు ఉంటానని, తన అక్కను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడంతో ఎంతో గర్వపడుతున్నానంటూ ప్రీతమ్ చేసిన కామెంట్లు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.

అయితే ప్రీతమ్‌కు సతీమణి స్నేహారెడ్డితో మంచి స్నేహబంధమే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం స్నేహారెడ్డి బన్నీ, అర్హ, అయాన్‌లు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రీతమ్ తాజాగా హెయిర్ స్టైలీష్ట్ దగ్గరికి వెళ్లినట్టున్నాడు. అతను సెలెబ్రిటీ హెయిర్ స్టైలీష్ట్. అలా జుట్టును కత్తిరిస్తుంటే.. నువ్ కూడా ఇందుకు రెడీగా ఉన్నావా? అంటూ అల్లు స్నేహారెడ్డిని ప్రీతమ్ ట్యాగ్ చేశాడు. అయితే స్నేహారెడ్డి మాత్రం ఇంకా రిప్లై ఇవ్వలేదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here