ఆడవాళ్ళు మీకు జోహార్లు: రాధిక, కుష్బూ, ఊర్వశి.. సెట్స్‌పై సీనియర్ లేడీస్ హంగామా!

0
19
ఆడవాళ్ళు మీకు జోహార్లు: రాధిక, కుష్బూ, ఊర్వశి.. సెట్స్‌పై సీనియర్ లేడీస్ హంగామా!photo 85000425

జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు యంగ్ హీరో శర్వానంద్‌. ఇటీవలే ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ఇప్పుడు ” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నారు. సరైన హిట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న శర్వా.. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ లేడీస్‌తో కలిసి హంగామా చేయబోతున్నారు.

ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత రీసెంట్‌గా తిరిగి సెట్స్ మీదకొచ్చింది. ఈ షెడ్యూల్‌లో హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మికల మధ్య చోటుచేసుకునే కీలక సన్నివేశాలతో పాటు కుటుంబ నేపథ్యమున్న సీన్స్ షూట్ చేస్తున్నారట. ఈ షూటింగ్‌లో సీనియర్ నటీమణులు , , ఊర్వశీలు భాగమవుతున్నట్లు తెలుపుతూ తాజాగా ఆ ముగ్గురి పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో చీరకట్టి హోమ్లీ లుక్‌తో ఆకర్షించి సినిమాపై అంచనాలు పెంచింది రష్మిక. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా రాధిక, కుష్బూ, ఊర్వశీలతో షూటింగ్‌లో శర్వానంద్ ఎంతో సరదాగా గడిపిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీనియర్ తారలైన ఆ ముగ్గురికీ తన ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫుడ్‌ను స్వయంగా వడ్డించి వారి పట్ల గౌరవం, సింప్లిసిటీ చాటుకున్నారు శర్వానంద్. మూవీలో ఆ ముగ్గురి రోల్స్ హైలైట్ కానున్నాయని.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనాల్సిందే అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here