కళ్యాణ్ రామ్ 'డెవిల్'.. పాన్ ఇండియా ప్రాజెక్టులో నందమూరి హీరో! హైలైట్ పాయింట్ ఇదే..

0
17
కళ్యాణ్ రామ్ 'డెవిల్'.. పాన్ ఇండియా ప్రాజెక్టులో నందమూరి హీరో! హైలైట్ పాయింట్ ఇదే..photo 84163356

ఓ వైపు నిర్మాతగా, మరోవైపు హీరోగా దూసుకుపోతున్నారు నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్. జయాపజయాలను లెక్కచేయకుండా విలక్షణ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఆయన.. ఇక వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సరైన సక్సెస్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సారి మాత్రం వరుసగా ఐదు సినిమాలను లైన్‌లో పెట్టేశారు. అందులో ఒకటే ”.

అభిషేక్ నామా నిర్మాతగా నవీన్ మేడారం దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ‘ద బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌తో పాటు మోషన్‌ టీజర్‌ విడుదల చేశారు. పాన్‌ ఇండియా మూవీగా రూపొందిస్తున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనుండటం విశేషం.

తాజాగా విడుదల చేసిన ‘డెవిల్’ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ లుక్ సినిమాపై హైప్ పెంచేసింది. 1945 బ్రిటిష్ కాలంలో జరిగిన రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఈ కథను రెడీ చేశారట మేకర్స్. ఇందులో బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారని, ఆయన చేసే సాహసాలు అబ్బురపరుస్తాయని తెలుస్తోంది. ఇదే సినిమాలో హైలైట్ పాయింట్ అని అంటున్నారు. తాజా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కోటు, పంచె ధరించి చేతిలో రివాల్వర్ పట్టుకొని కనిపించడం ఆసక్తి రేకెత్తించింది.

ఇకపోతే ఇప్పటికే పీరియాడికల్ మూవీ ‘బింబిసార’ సినిమా కంప్లీట్ చేస్తున్న కళ్యాణ్ రామ్.. మైత్రి మూవీస్‌లో ఓ భారీ సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా అలాగే ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఇంకో సినిమా చేయబోతున్నారు. వీటన్నింటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చేశాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here