టేస్టీ టేస్టీ చికెన్ నూడుల్స్ కట్‌లెట్.. – how to make chicken noodles cutlet at home in telugu

0
20
టేస్టీ టేస్టీ చికెన్ నూడుల్స్ కట్‌లెట్.. – how to make chicken noodles cutlet at home in telugu


How to make: టేస్టీ టేస్టీ చికెన్ నూడుల్స్ కట్‌లెట్..

Step 1:

ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తరువాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకుని వేయించాలి.

చికెన్ క‌ట్లెట్స్-రుచిక‌ర‌మైన స్నాక్స్


Step 2:

ఈ మిశ్రమంలో ఉడకబెట్టిన చికెన్ తురుమును వేసుకుని వేయించాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ వేయాలి. అనంతరం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికం తురుములను వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉల్లికాడలు వేసి బాగా కలబెట్టుకోవాలి.

step 1

Step 3:

ఇప్పుడు బాండీలో ఉన్న ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గుడ్డు పచ్చసొన, ఉడకబెట్టిన నూడిల్స్, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి.

step 3

Step 4:

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కట్‌లెట్ రూపంలో ముద్దలు చేసుకోవాలి. అనంతరం పొయ్యి మీద బాండీలో కొంచెం పెద్ద మొత్తంలో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన అనంతరం కట్‌లెట్ ముద్దలను నూనెలో వేసి వేయించుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేశాం కాబట్టి కట్‌లెట్ దోరగా వేగుతుంది.

step 6

Step 5:

వీటిని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుని టమోట లేదా గ్రీన్ చట్నీతో తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

step 8Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here