తహశీల్దార్ కార్యాలయంలో ఎన్టీఆర్.. కోట్లు విలువైన భూమి కొనుగోలు కోసమేనట!

0
17
తహశీల్దార్ కార్యాలయంలో ఎన్టీఆర్.. కోట్లు విలువైన భూమి కొనుగోలు కోసమేనట!photo 84919410

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్నారు యంగ్ టైగర్ . తన తొలి సినిమా నుంచి నటనలో విలక్షణత చూపిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆయన. కెరీర్ ఆరంభంలో మంచి సక్సెస్ అందుకున్న తారక్ తర్వాత వరుసగా ఫ్లాప్‌లు చవిచూశారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన వరుస హిట్లలతో మంచి జోష్‌లో ఉన్నారు.

ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో నటిస్తున్నారు తారక్. ఈ సినిమాలో ఆయనకు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఇందులో ఆయన విప్లవ వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయనకు ‘జనత గ్యారేజ్’ సినిమాతో మంచి హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివతో మరో సినిమా చేయనున్నారు తారక్. దీని తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు అయన.

అయితే ఇక అసలు విషయానికొస్తే.. తారక తాజాగా ఓ చోట అభిమానులకు దర్శనం ఇచ్చారు. అయితే అది సినిమా సెట్టో.. లేక థియేటరో కాదు.. ఎమ్మార్వో ఆఫీస్. కోట్లు విలువజైసే ఒక ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలు కోసం ఆయన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్‌లో కనిపించారు. తన భూమి రిజిస్ట్రేషన్ కోరకు సంతకాలు పెట్టిన ఎన్టీఆర్.. ఆ తర్వాత అక్కడి ఉద్యోగులు.. అభిమానులతో కలిసి ఫోటోలకు పోజ్‌‌లు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here