నేను కలిసిన అత్యంత మర్యాదస్తుల్లో వీళ్లు ముందుంటారు.. బచ్చన్ ఫ్యామిలీపై వరలక్ష్మి పోస్ట్

0
18
నేను కలిసిన అత్యంత మర్యాదస్తుల్లో వీళ్లు ముందుంటారు.. బచ్చన్ ఫ్యామిలీపై వరలక్ష్మి పోస్ట్photo 84728340

తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’ రవితేజా కామ్‌బ్యాక్ చిత్రం ‘క్రాక్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆమె.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమిళం, తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమె నటిస్తున్నారు.

తాజాగా తన తండ్రి శరత్ కుమార్‌తో కలిసి ఆమె బచ్చన్ కుటుంబాన్ని కలుసుకున్నారు. భారత సినీ ప్రపంచంలో బచ్చన్ కుటుంబానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దాయిన అమితాబ్‌తో మొదలుపెడితే ఆయన మనవరాలు వరకూ ఎంతో గౌరవప్రదంగా ఉంటారు. తాజాగా , , ఆరాధ్యలను కలుసుకున్న వరలక్ష్మి తన ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఎంతో మర్యాదస్తులైన వ్యక్తులను కలిశాను అంటూ వరలక్ష్మి పేర్కొన్నారు. ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్యలతో కలిసి దిగిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ‘తమ కుటుంబం విషయం పక్కన పెడితే.. వాళ్లలో ఉన్న సంస్కారం.. మర్యాద భావం చాలా అద్భుతం. వాళ్ల ప్రేమకి నేను ఎంతో పొంగిపోయాను. ఇలాంట వ్యక్తులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది సాధ్యమయ్యేలా చేసిన మా నాన్న శరత్‌కుమార్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అంటూ వరలక్ష్మి పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here