నేను బతికే ఉన్నా.. చనిపోలేదు: షకీలా వీడియో సందేశం

0
20
నేను బతికే ఉన్నా.. చనిపోలేదు: షకీలా వీడియో సందేశంphoto 84927544

శృంగార తార చనిపోయిందంటూ వస్తున్న పుకార్లపై స్పందించారామె. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. తాను చనిపోయానని వస్తున్న వార్తల్ని ఖండిస్తూ వీడియో విడుదల చేసింది షకీలా.

‘నేను చనిపోయానని వార్తలు వస్తున్నాయి.. అలాంటిది ఏమీ లేదు.. నేను బాగానే ఉన్నాను. పూర్తి ఆరోగ్యంతో హ్యాపీగా ఉన్నాను. తన మొహంంలో చిరునవ్వు చూడండి.. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు ఏమైపోయిందో అని చాలామంది ఆందోళన చెందారు.. చాలామంది ఫోన్లు చేస్తున్నారు.. మెసేజ్‌లు పెడుతున్నారు. నాపై ప్రేమ చూపించిన వారందరికీ చాలా పెద్ద థాంక్స్. అలాగే నాపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తికి థాంక్స్.. తనని గుర్తు చేసుకునేలా చేశారు’ అంటూ వీడియో విడుదల చేసింది షకీలా.

ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుని కోట్లు సంపాదించిన షకీలా.. ఇప్పుడు కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ లేని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయినవాళ్లతో పాటు ప్రేమించి వాళ్లు ఆమెను అన్ని విధాలా మోసం చేయడంతో ప్రస్తుతం ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తున్నారు. ఆ మధ్య కొబ్బరి మట్ట చిత్రంలో కత్తి మహేష్‌కి వైఫ్‌గా నటించింది షకీలా.

ఇక ‘లేడీస్ నాట్ అలౌడ్’ సినిమాను నటించి నిర్మించగా.. ఆ సినిమా కోసం ఉన్న కాస్త డబ్బును ఖర్చు చేసింది షకీలా. అయితే రిలీజ్‌కి సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆన్‌లైన్‌లో విడుదల చేసి చేతులు కాల్చుకుంది. ఇక రీసెంట్‌గా సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని స్టార్ట్ చేసిన షకీలా.. షార్ట్ ఫిలిమ్స్ చేసి మా ఓటీటీలో రిలీజ్ చేసుకోండి’ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇక సినిమాల పరంగా ‘అట్టర్ ప్లాప్ మూవీ’, ‘రొమాన్స్’ అనే చిత్రాల్లో నటిస్తోంది షకీలా.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here