‘భీమ్లా నాయక్’ ఆగయా.. పోలీస్ గెటప్‌లో పవర్‌స్టార్‌.. మెగా ఫ్యాన్స్‌కి పూనకాలే!

0
29
‘భీమ్లా నాయక్’ ఆగయా.. పోలీస్ గెటప్‌లో పవర్‌స్టార్‌.. మెగా ఫ్యాన్స్‌కి పూనకాలే!photo 84789834

ఆయన పేరు వింటేనే అభిమానులు ఉర్రూతలూగిపోతారు. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. ఈలలు వేస్తూ గోలలు చేస్తారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే.. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలతో పాటు నానా హంగామా చేస్తుంటారు. ఆయనే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. కొన్ని రోజుల క్రితం వరకూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఒక్కసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజకీయాలపై పూర్తిగా దృష్టి కేటాయించాలనే ఉద్దేశ్యంతో ఆయన సినిమాలకు దూరం అయ్యారు.

అయితే మళ్లీ వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఆయన రీసెంట్‌గా టాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్’ సినిమాతో ఆయన ఇచ్చిన రీ ఎంట్రీ బ్లాక్‌బాస్టర్ హిట్ సాధించింది. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’ రీమేక్‌గా ఇది రూపొందినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేస్తూ.. పవర్‌స్టార్‌ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో.. అలాగే చూపించారు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరో పవర్‌ఫుల్ రీమేక్‌లో నటిస్తున్నారు. మలయాళం సూపర్‌హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా షూటింగ్‌లో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు.

కాగా, సోమవారం ఈ సినిమా నుంచి పవన్‌ ఫస్ట్‌లుక్‌ని వదిలారు. ఇందులో ఆయన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. ఆ పాత్ర పేరు ‘’ అంటూ చిత్ర యూనిట్ వెల్లడించింది. పవన్ ఫేస్ కనిపించకపోయానా.. ఈ లుక్‌ మాత్రం వైరల్ అయింది. తాజాగా సినిమా యూనిట్.. షూటింగ్‌కి సంబంధించి మేకింగ్‌ వీడియోని విడుదల చేసింది. ఇందులో పోలీస్ డ్రెస్‌లో పవన్‌ని చూస్తే అభిమానులకు పూనకాలు రావాల్సిందే. అంత పవర్‌ఫుల్‌గా ఆయన కనిపిస్తున్నారు. ఇక సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రస్తుతానికి ‘ప్రొడక్షన్ నెం.12’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here