Saturday, July 24, 2021
Homeతెలుగు Newsసినిమామిడ్ నైట్ షికార్లు.. భార్యా, పిల్లలతో బన్నీ హల్చల్

మిడ్ నైట్ షికార్లు.. భార్యా, పిల్లలతో బన్నీ హల్చల్photo 84647517

టాలీవుడ్ టాప్ స్టార్లు ఎక్కువగా ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తుంటారు. ఫ్యామిలీ మెన్ కేటగిరీలో మహేష్ బాబు, వంటి వారు ముందుంటారు. వారు ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. భార్యాపిల్లలతో నిత్యం ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా బన్నీ అర్దరాత్రి తన ఫ్యామిలీని తీసుకుని బయటకు వచ్చేశారు. ఈ మేరకు షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బన్నీ ప్రస్తుతం పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హైద్రాబాద్‌లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌లో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాను ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీని మాత్రం అలా షికారుకు తీసుకెళ్లారు. అర్దరాత్రి, అలా జోరున వాన కురుస్తున్న సమయంలో బయటకు వెళ్తే వచ్చే మజాయే వేరు కదా. అందుకే బన్నీ తన ఫ్యామిలీని తీసుకుని అలా రోడ్డు మీదకు వచ్చారు.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు హాట్ ప్లేస్‌గా మారిన సంగతి తెలిసిందే. సెలెబ్రిటీలు, సాధారణ ప్రజలు ఇలా అందరూ కూడా అర్దరాత్రి అలా కేబుల్ బ్రిడ్జ్ అందాలను చూసి తరిస్తున్నారు. బన్నీ తన కారులో స్నేహారెడ్డి, అర్హ, అయాన్‌లను తీసుకుని కెబుల్ బ్రిడ్జ్ వైపు చక్కర్లు కొట్టేశారు. ఇక ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో ఎక్కువగా బన్నీ కనిపించకపోయినా.. అర్హ, అయాన్‌లు మాత్రం కనిపిస్తున్నారు.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Today's news

Latest offer's