‘మై నేమ్ ఈజ్ శృతి’ అంటున్న హన్సిక.. సోషల్‌మీడియాలో షూటింగ్ పిక్స్ వైరల్

0
20
‘మై నేమ్ ఈజ్ శృతి’ అంటున్న హన్సిక.. సోషల్‌మీడియాలో షూటింగ్ పిక్స్ వైరల్photo 84923310

‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ . యుక్తవయస్సులోనే ఈ సినిమా చేసినప్పటికీ.. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఈ భామ బిజీ అయిపోయింది. అయితే ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. హన్సిక చేసిన సినిమాలు వరుసగా వరుసగా ఫ్లాప్లు అయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ ఇస్తూ సినిమాలు చేస్తూ వస్తుంది హన్సిక. కొన్ని రోజుల క్రితం ‘తెనాలి రామకృష్ణ’ అనే సినిమాలో ఈ భామ చివరిసారిగా కనిపించింది.

అయితు తాజాగా హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్‌ థ్ల్రిలర్‌ని ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని కలిగించే చిత్రమిది. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం.ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం అన్నారు.

మురళీశర్మ, జయప్రకాష్‌, ఆడుకాలం నరెన్‌, రాజా రవీంద్ర తదితరులు ఈ సినిమాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన సినిమా షూటింగ్ స్టిల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది కథాంశంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ తెలియగానే హన్సిక అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ వాళ్లు ఎదురుచూస్తున్నామని సోషల్‌మీడియాలో కామెంట్ చేస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here