సాయి కుమార్ షష్టిపూర్తి వేడుకలు.. హాజరైన వెంకీ, చిరు

0
15
సాయి కుమార్ షష్టిపూర్తి వేడుకలు.. హాజరైన వెంకీ, చిరుphoto 84735519

టాలీవుడ్ విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ 60వ పుట్టిన రోజు (జూలై 27) జరుపుకోబోతోన్నారు. ఈ క్రమంలో నిన్న(జూన్ 24) సాయి కుమార్ షష్టి పూర్తి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోలు, ప్రముఖ సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి కుమార్‌కు దాదాపు ఇండస్ట్రీలో అందరితోనూ సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. డబ్బింగ్‌తో కెరీర్ మొదలుపెట్టినా కూడా బాల్యనటుడిగా, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోగా ఎదిగారు.

అలాంటి సాయి కుమార్ ఫ్యామిలీ మెన్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం వీలైనంత సమయాన్ని కేటాయించేవారు. సాయి కుమార్ తండ్రి పీజే శర్మ గురించి టాలీవుడ్‌లో అందరికీ తెలిసిందే. ఆయను కుమారులుగా సాయి కుమార్, రవి శంకర్, అయ్యప్ప శర్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ నటుడిగా సాయి కుమార్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక బుల్లితెరపైనా సాయి కుమార్ హోస్ట్‌గా రాణిస్తున్నారు.

అలాంటి సాయి కుమార్ షష్టిపూర్తి వేడుకలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ వేడుకకు మెగాస్టార్‌ , విక్టరీ వెంకటేశ్‌‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఇది కాకుండా బుల్లితెరపై వావ్ షోలో అసలు సందడి చూడబోతోన్నారు. మంగళవారం ప్రసారం కానున్న ఈ షోలో సాయి కుమార్ ఫ్యామిలీ మొత్తం రాబోతోంది. సోదరులు, వారి ఫ్యామిలీలు, సాయి కుమార్ భార్య సురేఖా ఇలా కుటుంబం మొత్తం వచ్చి ఆయన 60వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలెబ్రేట్ చేయనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here