Homeతెలుగు Newsఆరోగ్యంఅక్కడ ఇన్ఫెక్షన్ సోకి దురదగా ఉంటే ఇలా చేయండి.. - fungal infections systems types...

అక్కడ ఇన్ఫెక్షన్ సోకి దురదగా ఉంటే ఇలా చేయండి.. – fungal infections systems types and treatment details in telugu


ప్రధానాంశాలు:

  • ఇన్ఫెక్షన్స్ అనేక రకాలు
  • కొన్ని టిప్స్‌తో ఇన్ఫెక్షన్స్ దూరం

ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే ఏ సమస్య లేకుండా ఉండడానికి అవుతుంది. పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇలా ఎవరికీ అయినా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అయితే ఇవి చాలా న్యాచురల్ గా సర్వ సాధారణంగా వస్తాయి. ఫంగి అనేది ఒక మైక్రో ఆర్గానిజం వల్ల ఒంట్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫంగస్ సోకిన మట్టిని తాకడం లేదు అంటే ఏ జంతువుని అయినా కానీ ప్రదేశాన్ని కానీ ముట్టుకోవడం లాంటివి చేసినప్పుడు ఇది వస్తుంది.
గుండెనొప్పి వచ్చేముందు ఈ లక్షణాలు కనపడతాయట.. జాగ్రత్త..
అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌లో వివిధ రకాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ ఇలా పలు రకాలు వున్నాయి. కానీ చాలా మందికి దీని పై అంత అవగాహన లేదు. అయితే ఈ రోజు మనం అసలు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమిటి..?, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో రకాలు ఏవి..? అనే దాని గురించి తెలుసుకుందాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. దీనితో మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి క్లియర్ గా తెలుసుకోవచ్చు. అలానే వాటి వలన ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది చూడచ్చు.

ఈస్ట్ ఇన్ఫెక్షన్స్:

ఈ ఇన్ఫెక్షన్ అనేది శరీరంలో వివిధ రకాల భాగాలకి సోకుతుంది. ఈస్ట్ అనే ఫంగస్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. ముఖ్యంగా అయితే నోరు, గొంతు, గట్ మరియు వాజినా ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కాంప్లికేషన్స్ ఏమి రావు. నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ మరియు వాజినాలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించొచ్చు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే లోపల బుగ్గల్లో తెల్లటి ప్యాచెస్ వస్తాయి.

అలానే నాలుక మీద, నోటి మీద, గొంతులో ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. రుచి లేక పోవడం నొప్పి కలగడం లాంటివి కూడా మనం ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ లో గమనించవచ్చు. వజినల్ ఇన్ఫెక్షన్ల లో అయితే దురద రావడం, నొప్పి కలగడం ఇలాంటివి మనం గమనించవచ్చు. యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ఉపయోగించి వీటిని తగ్గించుకోవచ్చు. అలానే డాక్టర్ ని కన్సల్ట్ చేసి పరిష్కారం పొందవచ్చు. కాబట్టి ఈస్ట్ ఇన్ఫెక్షన్ వస్తే వాటికి తగిన చికిత్స చేయించుకోండి. దీనితో ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

అథ్లెట్ ఫుట్ :

ఇది కూడా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. డెర్మటోఫైట్స్ వలన ఇది వ్యాపిస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ జబ్బులు వస్తాయి. పాదం పై ఉండే చర్మం పైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలానే చేతిలో, గోళ్ళ మీద కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం కూడా ఉంటుంది. దురద కలగడం, మండడం లాంటివి దీని యొక్క లక్షణాలు. ఈ వ్యాధి నుంచి మీరు బయట పడాలంటే యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ఉపయోగించ వచ్చు లేదా మీరు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేసి డాక్టర్ రికమెండ్ చేసిన యాంటీ ఫంగల్ మెడిసిన్ ని ఉపయోగిస్తే మరీ మంచిది. ఇలా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

రింగ్వార్మ్ :

రింగ్వార్మ్ అనేది కూడా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. అయితే ఈ సమస్య వలన ఏమవుతుంది..?, అసలు ఇది ఏ భాగాలలో వస్తుంది..? అనేది చూస్తే.. ఈ రింగ్ వార్మ్ అనే ఫంగల్ డెడ్ టిష్యూ ద్వారా వ్యాపిస్తుంది. గోళ్ళు, చేతులు ఇలా వివిధ భాగాల్లో ఉండే డెడ్ స్కిన్ వలన ఇది వస్తుంది. రింగ్ లాంటి ప్యాచ్లు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కనబడతాయి.

ఇక ఈ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఏం చెయ్యాలి అనేది చూస్తే.. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి బయట పడాలి అంటే చాలా ఆప్షన్స్ వున్నాయి. యాంటీ ఫంగల్ క్రీమ్, మందులు, స్ప్రే, ఆయింట్మెంట్ వంటివి ఈ సమస్య నుండి బయట పడేస్తాయి లేదా ఒకవేళ మీకు లక్షణాలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యడం మంచిది. అలా మీరు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించుకుంటూ పూర్తిగా రికవరీ అవ్వచ్చు. ఇలా రింగ్ వార్మ్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి సులువుగా బయట పడచ్చు. అంతే కానీ సమస్య చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయడం ఏ మాత్రం మంచిది కాదు.

జాక్ ఇచ్ :

ఇది కూడా ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. డెర్మటోఫైట్స్ వలన ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇది చర్మాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. తొడలు మరియు ఇతర ప్రాంతాల్లో వుండే చర్మాన్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చర్మం ఎర్రగా మారడం, దురదలు కలగడం, రంగు మారడం రావడం జరుగుతాయి.

అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి ఎలా బయట పడవచ్చు అనేది చూస్తే… జాక్ ఇచ్ అనే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి బయట పడాలంటే మనకి వివిధ రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే యాంటీ ఫంగల్ క్రీమ్, పౌడర్ లాంటివి వున్నాయి. ఇలా మీరు యాంటీ ఫంగల్ క్రీమ్ ని కానీ పౌడర్ ని కానీ వాడి ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి బయట పడవచ్చు. ఒకవేళ కనుక మీకు లక్షణాలు ఎక్కువగా ఉన్నా ఇబ్బంది ఎక్కువగా ఉన్న డాక్టర్ ని వెంటనే కన్సల్ట్ చేయండి. దీనితో డాక్టర్ మీకు మంచి సలహా ఇస్తారు తద్వారా సమస్య నుండి బయట పడవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని త్వరగా తగ్గించుకోండి.
వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలంటే..

ఫంగల్ ఇన్ఫెక్షన్స్

ఫంగల్ ఇన్ఫెక్షన్:

ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కేవలం చర్మానికి మాత్రమే కాదు గోర్లకు కూడా వ్యాపిస్తాయి. గోళ్ల రంగు మారిపోవడం ఇలాంటి లక్షణాలు మనకు కనబడతాయి. అలానే విపరీతంగా గోళ్ళు నొప్పి వస్తాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్పిన దాని ప్రకారం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంటే తగ్గడం చాలా కష్టం. అలానే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ద్వారా సులువుగా అవి తగ్గవని కూడా తెలుస్తోంది. అయితే మరి ఈ సమస్య వస్తే ఏం చేయాలి అని అనుకుంటున్నారా…? మరి అది కూడా చూద్దాం. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చిందంటే యాంటీ ఫంగల్ పిల్స్ ని తీసుకోవాలి.

ఈ పిల్స్ ని తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది. కాబట్టి మీకు గొర్ల లో ఇలాంటి సమస్య ఉంటే కచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. దీనితో సమస్య నుండి దూరంగా ఉండొచ్చు.

స్పోరోట్రిచోసిస్ (Sporotrichosis 🙂

ఇది కూడా ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. మట్టి ద్వారా కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం గులాబీ మొక్కలు వంటి వాటి నుండి కూడా ఇది వస్తుంది. అయితే ఇందులో మూడు రకాలు ఉన్నాయి. ఒకటి చర్మానికి వస్తుంది మరొకటి ఊపిరితిత్తులకు వస్తుంది. అలాంటి మరొక రకం కూడా ఉంది. చర్మానికి వచ్చే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వలన ఏమవుతుందంటే చర్మానికి గాయాలు అవ్వడం, చర్మం పగలడం లాంటివి జరుగుతాయి.
రాత్రి ఇవి తింటే ఉదయానికల్లా మలబద్ధకం దూరం..
అలానే చిన్న చిన్న కురుపులు లాంటివి వస్తాయి. అయితే ఇవి ఒకటి నుండి పన్నెండు వారాల పాటు డెవలప్ అవుతాయని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంటుంది. అలానే ఊపిరితిత్తుల్లోకి కూడా ఇది వస్తుంది. దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు చెస్ట్ పెయిన్ జ్వరం లాంటి లక్షణాలు మీరు గుర్తించ వచ్చు. ఒకవేళ కనుక మీకు ఇలాంటి లక్షణాలు కనుక కనబడ్డాయంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. దీనితో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి బయట పడవచ్చు లేదు అంటే అనవసరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పక తగిన సమయానికి వైద్యం తీసుకుని సమస్య నుండి దూరంగా ఉండండి. ఏ బాధ లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా వుండండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read