Home తెలుగు News సినిమా పవన్ కళ్యాణ్- మంచు విష్ణు అలా! ప్రూఫ్‌తో సహా బయటపెట్టిన 'మా' ప్రెసిడెంట్

పవన్ కళ్యాణ్- మంచు విష్ణు అలా! ప్రూఫ్‌తో సహా బయటపెట్టిన 'మా' ప్రెసిడెంట్

0
పవన్ కళ్యాణ్- మంచు విష్ణు అలా! ప్రూఫ్‌తో సహా బయటపెట్టిన 'మా' ప్రెసిడెంట్

[ad_1]

రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో విజయం సాధించి ‘మా’ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ Vs మంచు విష్ణు అన్నట్లుగా నాటకీయ పరిణామాల నడుమ నడిచిన ఈ ఎన్నికల్లో మెగా వర్గం ప్రకాష్ రాజ్ వైపు ఉందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయమై నాగ బాబు ఓపెన్ కాగా.. చిరంజీవి, మాత్రం పెదవి విప్పలేదు. ఈ నేపథ్యంలో చివరకు మంచు విష్ణు గెలుపొందాక మొదటిసారి పవన్ కళ్యాణ్- మంచు విష్ణు ఎదురుపడటంతో ఈ ఇష్యూ చర్చల్లో నిలిచింది.

రీసెంట్‌గా జరిగిన ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, మంచు విష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైన పక్క పక్కనే కూర్చొన్న పవన్‌-విష్ణులు మాట్లాడుకోకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఆ విజువల్స్ వైరల్ అయ్యాయి. విష్ణు పలకరించడానికి ప్రయత్నిస్తే పవన్‌ ముఖం తిప్పుకొని వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ విషయమై ఇప్పటికే మంచు లక్ష్మి క్లారిటీ ఇవ్వగా తాజాగా మంచు విష్ణు ప్రూఫ్‌తో సహా ఓ వీడియో పోస్ట్ చేశారు. తామిద్దరం మాట్లాడుకొన్నామని, ఇదిగో సాక్షం అంటూ విష్ణు స్వయంగా పేర్కొంటూ సదరు వీడియో క్లిప్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో పవన్‌-విష్ణు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం చూడొచ్చు. ఆ తర్వాత ఇద్దరూ సరదాగా కొద్ది సేపు మాట్లాడుకోవటం కనిపించింది. ‘మా’లో విభేదాలున్నాయని, మెగా- మంచు ఫ్యామిలీ నడుమ వైరం నడుస్తుందనే వార్తలకు ఇలా ఫుల్‌స్టాప్ పెట్టేశారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here