తనకు కరోనా సోకినట్లు స్వయంగా పేర్కొన్నారు హీరో శ్రీకాంత్. తాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనని కరోనా వదిలిపెట్టలేదని.. తాజాగా కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. తనతో గత కొన్నిరోజులుగా
సన్నిహితంగా ఉన్నవారందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు శ్రీకాంత్. ఈ విషయం తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.