Homeతెలుగు Newsఆరోగ్యంalcohol increases hypertension: alcohol increases BP: హైబీపీ పేషెంట్స్‌ మందు తాగితే.. చాలా ప్రమాదం...

alcohol increases hypertension: alcohol increases BP: హైబీపీ పేషెంట్స్‌ మందు తాగితే.. చాలా ప్రమాదం – alcohol consumption increases hypertension risk


ఉద్యోగం వస్తే పార్టీ…పెళ్లి కుదిరితే పార్టీ… ప్రమోషన్‌ వస్తే పార్టీ… నలుగురు స్నేహితులు కలిసినప్పుడల్లా పార్టీ పార్టీలో మందు తప్పనిసరి.. వీకెండ్స్‌ల్లోనే కాదు, మామూలు రోజుల్లోనూ కిటకిటలాడే పబ్బులూ బార్లే అందుకు నిదర్శనం. చిన్నా పెద్దా లేదు. చేతిలో డబ్బుంటే చాలు. తాగడాన్ని ఎవరూ తప్పనుకోవడం లేదు సరికదా సోషల్‌ స్టేటస్‌గా భావిస్తున్నారు. మద్యపానం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.. ఆరోగ్యాన్ని దెబ్బతీసుంది. అల్కహాల్‌ తాగితే.. హైపర్‌టెన్షన్‌ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. హైబీపీ కారణంగా.. గుండె లయ తప్పడం, స్ట్రోక్‌, హార్ట్‌ ఎటాక్‌, గుండె సమస్యలు సంభవించవచ్చు. మధ్య వయసులో ఎక్కువగా తాగేవారికి స్ట్రోక్‌ రిస్క్‌ ఎక్కువ. మృత్యువుకు దారితీసే కారణాల్లో ప్రధానమైనదీ మద్యపానం..

alcohol

అలవాటైతే..ప్రమాదం..
ఒకే సిట్టింగ్‌లో.. మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల అల్కహాల్‌ తాగినప్పుడు రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, పదే పదే మందు తాగితే.. రక్తపోటులో దీర్ఘకాలిక పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉందని ఓ క్లినికల్‌ పరిశోధనలో తేలింది. మద్యపానం శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, ఇది రక్తపోటును పెంచుతుంది. హైపర్‌ టెన్షన్‌ను సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. హైబీపీ కారణంగా గుండెపోటు, బ్రైయిన్ స్ట్రోక్. కిడ్నీ సమస్యలు ఇతర ప్రాణాంతక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. లో బీపీ ఉన్నవారు కూడా ఆల్కహాల్ తాగితే.. హైపర్‌టెన్షన్‌ బారినపడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. హైపర్‌టెన్షన్‌ను నియంత్రించాలంటే.. అల్కహాల్‌ తాగడం మానేయాలని సూచిస్తున్నారు.

Hypertension

“ఆల్కహాల్ తాగితే.. మెదడు, సింపతటిక్‌ నాడీ వ్యవస్థ యాక్టివేట్‌ అవుతుంది. సింపతటిక్‌ నాడీ వ్యవస్థ యాక్టివ్‌ అయితే.. కొన్ని హార్మెన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మెన్లు బీపీ పెరగడానికి కారణమవుతాయి. ఆల్కహాల్ రక్త నాళాలు సన్నబడటానికి కారణమవుతుంది, దీని వలన హైపర్‌టెన్షన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ పేషెంట్స్‌కు మద్యం తాగే అలవాటు ఉంటే.. బీపీ కంట్రోల్‌ అవ్వడానికి మందులు వాడినా ఏమి ప్రయోజనం ఉండదు. అల్కహాల్‌ను మానేసి క్రమం తప్పకుండా మందులు వేసుకుంటే.. రిజల్ట్‌ ఉంటుంది.”- డా.నితిన్ అన్నారపు, కార్డియాలజిస్ట్‌, మెడికవర్‌ హాస్పటల్స్‌
వీటితొ పాటు.. మద్యపానం.. రక్తపోటును పరోక్షంగా ప్రభావితం చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి.
నాడీ వ్యవస్థ మార్పులు:
అల్కహాల్‌ నాడీవ్యవస్థను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. తద్వారా బీపీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రక్తపోటును నియంత్రించడంలో నాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రెజర్‌ రిసెప్టార్‌లో మార్పులు..
శరీరంలో ఉండే బారోసెప్టర్స్.. రక్తపోటు స్థాయిలను గ్రహించి.. కంట్రోల్‌ చేస్తాయి. అల్కహాల్‌ బారోసెప్టర్లను ప్రభావితం చేస్తుంది. తద్వారా రక్తపోటు పెరుగుతుంది.
కార్టిసాల్ పెరుగుతుంది:
కార్టిసాల్ బీపీని పెంచే స్ట్రెస్‌ హార్మోన్. ఆల్కహాల్ తాగితే కార్టిసాల్ మోతాదు మొత్తాన్ని పెంచుతుంది. తద్వారా రక్తపోటు పెంచుతుంది.
కాల్షియం స్థాయిలు పెరుగుతాయి:

ఆల్కహాల్.. ధమనులను (arteries) లైన్ చేసే కండరాలలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. ఇది ధమనులను మరింత సంకోచించటానికి కారణమవుతుంది. తద్వారా రక్తపోటు పెరుగుతుంది.
బరువు పెరుగుతారు:
అల్కహాల్‌లో ఉండే కేలరీల కారణంగా త్వరగా బరువు పెరుగుతారు.. అధిక బరువు ఉన్నవారికి హెపర్‌టెన్షన్‌ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

மாருதி அறிமுகம் செய்த புதிய காருக்கு இவ்ளோ புக்கிங்கா? டாடா, ஹூண்டாய் கார்களுக்கு கடும் நெருக்கடி!

<!----> இந்திய சந்தையில் மாருதி சுஸுகி பிரெஸ்ஸா கார் கடந்த 2016ம் ஆண்டு விற்பனைக்கு அறிமுகம் செய்யப்பட்டது. இது சப்-4 மீட்டர் காம்பேக்ட் எஸ்யூவி...