apps for anxiety: యాప్స్ వాడితే డిప్రెషన్ తగ్గుతుందా.. – is there an app to manage stress and anxiety know here all details

0
27
apps for anxiety: యాప్స్ వాడితే డిప్రెషన్ తగ్గుతుందా.. – is there an app to manage stress and anxiety know here all details


ప్రధానాంశాలు:

  • అనేక కారణాలతో ఒత్తిడి
  • ఒత్తిడిని దూరం చేసే యాప్స్

ఈ సమయంలో నిజంగా మానసిక ప్రశాంతతను ఇచ్చే యాప్స్ బాగా అభివృద్ధి చెందాయి. ఎంతో మంది వీటిని అనుసరించి ఒత్తిడిని, ఏంగ్జైటీని కంట్రోల్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ యాప్స్ ఎలా పని చేస్తాయి..?, వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళకి మరియు రాత్రి పూట నిద్రపట్టని వాళ్ళకి ఎలా ఉపయోగ పడతాయి..? అయితే ఇలా ఇటువంటి యాప్స్ గురించి వాటి వల్ల కలిగే ఉపయోగాలు గురించి మనం తెలుసుకుందాం.
telugu samayamడయాలసిస్ చేయించుకున్నవారు ఈ ఫుడ్ తింటే మంచిదట..
మానసిక ప్రశాంతత కలగాలి అంటే స్మార్ట్ ఫోన్‌లో ఉండే కొన్ని యాప్స్ బాగా ఉపయోగ పడుతున్నాయి. వీటిని ఉపయోగించి ఒత్తిడి, మానసిక సమస్యలని పూర్తిగా తగ్గించుకోవచ్చు అని నిపుణులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి యాప్స్ గురించి గతంలో రీసెర్చర్లు రీసెర్చ్ చేయడం జరిగింది. ఇవి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే దానిపై వాళ్లు పరిశీలించారు.

2019 లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ప్రకారం ఒక యాప్‌ని పరిశీలించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది చూశారు. దీని ద్వారా తేలిన ఫలితం ఏమిటంటే..? యాప్స్ కారణంగా ఒత్తిడి తగ్గుతోందని, మైండ్ ఇంప్రూవ్ అవుతోందని తెలుస్తోంది. దీనిని ఉపయోగించిన వాళ్ళల్లో మార్పు కనపడుతోందని నిపుణులు గుర్తించారు.

మరొక పాపులర్ యాప్ గురించి కూడా రీసెర్చ్ చేసారు. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యాప్‌ని ఉపయోగించిన పది రోజులకి పాజిటివ్ ఎమోషన్స్ కలిగాయని అదే విధంగా డిప్రెషన్ తగ్గిందని తేలింది. నిజంగా ఎంతో పాజిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తున్నాయి కదా..!

అయితే ఇటువంటి వాటి కోసం ఇంకా పూర్తి వివరాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం కూడా ఇప్పుడే పూర్తిగా చూసేయండి. ఇటువంటి యాప్స్‌ని ఉపయోగించడం మంచిదా కాదా..?

జరిగిన రీసెర్చ్ ప్రకారం ఈ యాప్ చాలా బాగా పని చేస్తుందని తేలింది. 12 శాతం ఒత్తిడిని ఇది తొలగించింది. అదే విధంగా 14 శాతం మానసిక ఇబ్బందులని తగ్గించింది. పూర్తి ఒత్తిడి 30 రోజుల్లో తగ్గిపోయిందని తెలుస్తోంది.

అదే విధంగా నెగిటివ్ ఎమోషన్స్ మీద కూడా కొంత రీసర్చ్ చేసింది. పది రోజుల పాటు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేసిన వాళ్లలో 16% ఆనందం పెరిగినట్లు గుర్తించారు. ఒక నిమిషం కంటే ఎక్కువ మెడిటేషన్ చేసిన వాళ్లలో మంచి మార్పులు కనపడ్డాయని.. వాళ్ళ ఫీలింగ్స్, నిద్ర మరియు ఇతర విషయాల్లో కూడా ఇంప్రూమెంట్ కనిపించిందని తేలింది.

నెగెటివ్ ఆలోచనలు నుండి బయట పడి సులువుగా పాజిటివిటీని అలవాటు చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది అని చాలా మంది అన్నారు. ప్రశాంతంగా ఉంచడం, మానసిక సమస్యలు దూరం చేయడం వీటి యొక్క విశిష్టత. మెడిటేషన్‌తో కనుక ఎవరైనా ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే వాళ్లు ఫోన్ కింద పెట్టి కళ్ళు మూసుకుని వినాలి ఇలా చేయడం వల్ల నెమ్మదిగా మనం మానసిక ప్రశాంతత పొందచ్చు.
telugu samayamఇలా చేస్తే ముఖం మెరిసిపోతుందట..
అదే విధంగా సమస్యల నుండి కూడా దూరంగా ఉండొచ్చు. తాజాగా థెరపిస్టులు కూడా మానసికంగా ఆనందంగా ఉండాలని పేషంట్స్‌కి వీటిని ప్రిఫర్ చేస్తున్నారు. నాలుగేళ్ల నుండి ఒక ఆప్ ని వాడుతున్నాను అని.. మా థెరపిస్టు దీనిని రిఫర్ చేసారని ఒక ఆయన చెప్పారు. మా థెరపిస్టు చెప్పిన విధంగా నేను పాటిస్తునా అని ఆయన చెప్పారు ఇది నిజంగా నా మీద బాగా పని చేసిందని నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని చెప్పారు సులువుగా రిలాక్స్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని వెల్లడించారు.

నెగటివిటీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతున్నాయి అని కూడా చెప్పారు. ఇవి రిలేషన్ షిప్స్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. అంతే కాదండి ఆనందాన్ని కూడా పెంచుతాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉపయోగాలు మనం పొందొచ్చు. ఫోకస్ ఉండడానికి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ యాప్ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు.

మహమ్మారి సమయంలో పెరిగిన యూజర్లు :

కరోనా మహమ్మారి సమయంలో చాలా మందిలో అనేక సమస్యలు వచ్చాయి. ఈ మహమ్మారి సమయంలో ఇటువంటి యాప్స్‌ని కూడా చాలా మంది అనుసరించడం జరిగింది. మహమ్మారి సమయంలో వీటి వల్ల చాలా ప్రయోజనాలు చాలా మందిలో కలిగాయి. చాలా యాప్స్‌లో యూజర్లు ఎక్కువైపోయారు.

గత కొన్ని నెలల నుండి చూసుకున్నట్లయితే ఎంతో మంది ఈ యాప్స్‌ని అనుసరిస్తున్నారు. మైండ్ ఫుల్ నెస్ ప్రాక్టీస్ కోసం ఈ యాప్స్ బాగా ఉపయోగపడతాయి. మీరు కావాలంటే ఒకసారి యాప్స్‌ని ఓపెన్ చేసి మీకు నచ్చిన సమయాన్ని తీసుకుని ఐదు నుండి పది నిమిషాల పాటు మెడిటేషన్ చేసుకోవచ్చు.

దీని కోసం మీకు అక్కడ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా మంచి శిక్షకుడు నుండి నేర్చుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విలువైన సమాచారాన్ని ఇతరుల దగ్గర నుండి కాకుండా సులువుగా మీరు ఈ యాప్ ద్వారా పొందొచ్చు. అది కూడా మీకు నచ్చిన సమయంలో మీరు ఈ యాప్‌లో ఫాలో అయిపోవచ్చు.

ప్రతి రోజు మనకు ఏదో ఒక సమయంలో ఖాళీ ఉంటుంది. అటువంటి సమయంలో ఇటువంటి వాటిని పాటించడం వల్ల రిలాక్స్డ్‌గా ఉంటుంది. ఇలా రోజులో కాస్త సమయాన్ని వీటికి వెచ్చించడం వల్ల మీరు ఒత్తిడి లేకుండా ఉండొచ్చు.

పైగా యాప్స్ కూడా చక్కగా గైడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. మంచిగా నేర్చుకోవడానికి బాగా సహకరిస్తాయి అది కూడా మీకు నచ్చిన అంత సమయం మీరు దాని కోసం వెచ్చించవచ్చు.

ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు సెషన్స్ తీసుకోవచ్చు. నిద్ర పోయే సమయానికి కాస్త సమయం ముందు మీరు వీటితో టైం స్పెండ్ చేయొచ్చు. దీని వల్ల మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అదే విధంగా శ్వాస కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి.

అయితే అందరికీ ఒకే లాగ పని చేస్తాయని చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అదే విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎలా పని చేస్తాయి అనేది క్లారిటీగా చెప్పలేము. కానీ మంచిగా ప్రశాంతంగా ఉంచుతుంది కానీ అందరికీ ఎఫెక్టివ్‌గా మాత్రం పని చేస్తుంది.

కావాలంటే ఈ యాప్‌లో మీరు రెగ్యులర్‌గా పాటించే ముందు ఒకసారి ట్రయిల్ టెస్ట్ తీసుకోండి దీనితో మీరు మీకు నచ్చితే పాటించవచ్చు. లేకపోతే లేదు. అయితే మొత్తం అన్ని సమస్యలకి సొల్యూషన్ ఈ యాప్ ద్వారా మనకి లభించవు.

కొన్ని కొన్ని సార్లు మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సమయంలో వీటి ద్వారా మనకి ఉపయోగకరం ఏమీ ఉండదు. కానీ చిన్న చిన్న సమస్యలు, ఒత్తిడి వంటివి దూరం చేసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

కానీ పెద్ద సమస్యలు వస్తే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్‌ని సంప్రదించాలి. మానసిక సమస్యలు ఏమైనా ఎక్కువగా ఉంటే అప్పుడు ఇటువంటి వాటిని అనుసరిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. మంచి సైకాలజిస్ట్‌ని సంప్రదించి మీ సమస్యలకు చెక్ పెట్టండి.

ఏది ఏమైనా ఒత్తిడి లేని జీవనాన్ని అనుసరిస్తే మంచిది. కాబట్టి రెగ్యులర్‌గా ఇటువంటి వాటిని అనుసరించడం వల్ల ఒత్తిడి లేకుండా ఉండొచ్చు. అదే విధంగా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఇది నిజంగా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు మనం వీటి ద్వారా పొందొచ్చు.
telugu samayamఇలా చేస్తే ముఖం మెరిసిపోతుందట..
చిన్న చిన్న సమస్యలకు చెక్ పెట్టడానికి అద్భుతంగా ఇవి పని చేస్తాయి కాబట్టి రెగ్యులర్ గా ఇటువంటి వాటిని అనుసరించి మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండండి. ఒత్తిడి, ఏంగ్జైటీ వంటి చిన్న చిన్న సమస్యలను మీ నుండి దూరం పెట్టేయండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here