Homeతెలుగు NewsసినిమాAryan Khan: డబ్బుంటే క్రిమినల్స్ ఇలా అనుభవించొచ్చు.. ఆర్యన్ ఖాన్ విడుదలపై సమంత ఫ్రెండ్ కామెంట్స్...

Aryan Khan: డబ్బుంటే క్రిమినల్స్ ఇలా అనుభవించొచ్చు.. ఆర్యన్ ఖాన్ విడుదలపై సమంత ఫ్రెండ్ కామెంట్స్ – samantha friend sadhna singh on aryan khan bail


ప్రధానాంశాలు:

  • బెయిల్‌పై ఆర్యన్ ఖాన్ విడుదల
  • అట్టహాసంగా స్వాగత కార్యక్రమాలు
  • సమంత ఫ్రెండ్ సాధన సెటైర్లు

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మొత్తానికి బెయిల్ మీద విడుదలయ్యాడు. శుక్రవారం నాడే బయటకు రావాల్సిన ఆర్యన్.. లాయర్లు బెయిల్ పత్రాలు సమర్పించడంలో అశ్రద్ద వహించారు. దీంతో అది శనివారం నాటికి వాయిదా పడింది. మొత్తానికి ఆర్యన్ ఖాన్ బయటకు వచ్చాడు. ఆర్యన్ రాక కోసం జన్నత్ మొత్తానికి జిగేల్ మనిపించేలా అరేంజ్ చేశారు. ఇక ఆర్యన్ రాక కోసం అదిరిపోయే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆర్దర్ రోడ్డు జైలు నుంచి మన్నత్ వరకు ఆర్యన్ కోసం ప్రత్యేకంగా రహదారిలో ఏర్పాట్లు చేసినట్టు కనిపిస్తోంది.

ఆర్యన్ లగ్జరీ కారులో వస్తుంటే.. దారి పొడవున జనాలు.. కారు ముందు సెక్యూరిటీ గార్డులు.. అబ్బో ఆ హంగామా మామూలుగా లేదు. ఏదో ఒలింపిక్ ఆటల్లో బంగారు పతాకాన్ని తీసుకొచ్చినంత ఘనంగా తీసుకొచ్చేస్తున్నారు. మొత్తానికి ఆర్యన్ ఖాన్ బెయిల్ మీద బయటకు రావడం, ఏదో ఘన కార్యం చేసి బయటకు వచ్చినట్టు ఇలా తీసుకెళ్లడంపై నెట్టింట్లో చర్చకు దారి తీస్తోంది.

Sadhna Singh

ఆర్యన్ ఖాన్ బెయిల్ మీద బయటకు రావడం, ఆ హంగామాకు సంబంధించిన వీడియో మీద సమంత మేకప్ ఆర్టిస్ట్, ఫ్రెండ్ సాధన సింగ్ కౌంటర్లు వేసింది. క్రైమ్ చేసినా కూడా ఒక వేళ మన దగ్గర డబ్బు, పవర్ ఉంటే ఇలా అనుభవించొచ్చు.. ఇలా దేవుడిలా స్వాగతం పలుకుతారు అని ఈ విజువల్స్ నిరూపిస్తున్నాయి.. దేవుడా.. ఆర్యన్ ఖాన్ బెయిల్ మీద బయటకు వచ్చేశాడు అంటూ సాధన సింగ్ కౌంటర్లు వేసింది.

ప్రస్తుతం సాధన సింగ్, సమంత, ప్రీతమ్ జుకల్కర్ దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రేపు ఆదివారం జరుగబోతోన్న మ్యాచ్ కోసమే దుబాయ్‌కి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే సమంత మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తుందో చూడాలి.



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read