Thursday, December 2, 2021
Homeతెలుగు Newsసినిమాashu reddy: అషు రెడ్డితో మాట్లాడింది సె** గురించే.. ఎట్టకేలకు ఆర్జీవీ ఓపెన్! మరో హాట్...

ashu reddy: అషు రెడ్డితో మాట్లాడింది సె** గురించే.. ఎట్టకేలకు ఆర్జీవీ ఓపెన్! మరో హాట్ యాంగిల్‌తో రచ్చ – ram gopal varma open comments on interview with ashu reddy


మనసులో ఎలాంటి దాపరికం అనేది లేకుండా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం రామ్ గోపాల్ వర్మది. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వర్మ రూటే సపరేటు. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ అలజడి రేపే ఆయన రీసెంట్‌గా ఇయన సుల్తానా, జ్యోతిలతో చేసిన రచ్చ అంతాఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు తెగ హల్చల్ చేస్తుండగానే.. మరోవైపు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ.

కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవ్వరికీ అర్థం కాకుండా మాట్లాడే ఆర్జీవీ.. రీసెంట్‌గా అషు రెడ్డి హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ బుకాయించారు. ఈ ఫొటోలో ఉంది అషు రెడ్డి కాదని అంటూనే వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఎలా వెళ్ళామన్నది కాదు ముఖ్యం ఎంతమంది అట్రాక్ట్ అయ్యారు అన్నదే ముఖ్యం అన్నట్లుగా వర్మ దూసుకెళ్తున్నట్లు ఆయన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు చూస్తుంటే అర్థమవుతోంది.

ఎలాగైతేనేం కావాల్సినంత ప్రమోషన్ అయితే దక్కిందని అనుకున్నారో ఏమో రీసెంట్‌గా పోస్ట్ చేసిన అషు రెడ్డి హాట్ యాంగిల్స్ విషయంలో ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు వర్మ. అరియానాలాగా అషుతో ఇంటర్వ్యూ చేయడం లేదని, అసలు ఈ వీడియో ఏమిటో తనకు అర్థం కావడం లేదు అన్నట్లుగా మాట్లాడిన ఆయన.. తాజాగా అసలు మ్యాటర్ చెప్పేస్తూ మరో హాట్ యాంగిల్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఉన్నది తామే అని చెప్పేస్తూ మరోసారి వార్తల్లోకెక్కారు.
telugu samayam40 ఏళ్ల క్రింద ఈ అమ్మాయి దొరికితే! ఖచ్చితంగా అదే చేసేవాడిని.. పబ్లిక్‌గా హీరోయిన్‌పై ఆర్జీవీ కామెంట్స్
అషు రెడ్డితో ఐస్ క్రీమ్ తింటూ సెక్స్ గురించి మాట్లాడుతున్నా అని పేర్కొంటూ ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 30వ తేదీ 6 గంటల 9 నిమిషాలకు విడుదల చేస్తున్నామని తెలిపారు. తప్పనిసరిగా ఆ పోస్టర్ చూడాలని అన్నారు. ఇదంతా చూస్తుంటే ఆయన తీరు మరో రచ్చకు తెరలేపేలా కనిపిస్తోంది. సో.. చూడాలి మరి ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది!.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

“இஸ்லாமியர்கள் குறித்த தவறான பிம்பத்தைத் தகர்த்தெரியும் படம் `மாநாடு' " – சீமான் பாராட்டு!

பல தடைகளை கடந்து ஒரு வழியாக திரையரங்குகளில் கடந்த வாரம் வெளியானது 'மாநாடு'. ரசிகர்களை பெருமளவில் கவர்ந்திருக்கும் இந்த படத்தை திரைபிரபலங்களும் கூட கொண்டாடி வருகின்றனர்!அந்த வரிசையில், தற்போது ‘மாநாடு’ படத்தைப்...