Monday, November 29, 2021
Homeతెలుగు NewsసినిమాBandla Ganesh: HBD Nagarjuna : పొలం కొనమని చెబితే అలా అన్నారు.. నాగార్జునపై బండ్ల...

Bandla Ganesh: HBD Nagarjuna : పొలం కొనమని చెబితే అలా అన్నారు.. నాగార్జునపై బండ్ల గణేష్ కామెంట్ – bandla ganesh about nagarjuna on twitter space


ప్రధానాంశాలు:

  • నాగార్జున బర్త్ డే
  • ట్విట్టర్ స్పేస్‌లో సెలెబ్రిటీల హల్చల్
  • బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయింది. నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లో టాలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ మధ్య ట్విట్టర్ స్పేస్ అంటూ స్టార్‌ల బర్త్ డేలకు సెలెబ్రిటీలు ముచ్చట్లు పెడుతున్నారు. తమకు ఆ హీరోతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాజాగా నాగార్జున బర్త్ డే సందర్భంగా కోన వెంకట్, బీవీఎస్ రవి, బండ్ల గణేష్, చందూ మొండేటి, బ్రహ్మాజీ వంటివారు ముచ్చట్లు పెట్టారు. తమకు నాగార్జునతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

తాను నాగార్జునకు వీరాభిమానిని అని, ప్రతీ సినిమా గురించి పూసగుచ్చినట్టు వివరించారు బీవీఎస్ రవి. ఎప్పుడూ కూడా నాగార్జున చుట్టూ నెగెటివిటీ అనేది ఉండనే ఉండదు.. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటూనే ఉంటారు అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఇక బండ్ల గణేష్ లైన్‌లోకి వచ్చారు. నాగార్జునతో ఉన్న అనుబంధం గురించి బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

డాన్ సినిమా సందర్భంలో ఓ సారి నాగార్జున గారిని పొలం కొనమని, షాద్ నగర్‌లో రేట్లు బాగున్నాయని బండ్ల గణేష్ సలహా ఇచ్చారట. అయితే దానికి నాగార్జున ఇచ్చిన సమాధానం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నాకు ఇప్పుడు 40 ఏళ్లు దాటాయ్.. ఇక వాటిని కొనుక్కుని సాగులోకి తెచ్చే సరికి 60 ఏళ్లు వస్తాయ్.. అవి నాకు అవసరమా?.. అని నాగార్జున అన్నారట.

నాగార్జున గారు ఎప్పుడు ఎలా బతకాలో ముందే నిర్ణయించుకున్నారు. 40 ఏళ్లలో ఎలా బతకాలి.. 50 ఏళ్లకు ఎలా బతకాలి.. 60 ఏళ్లకు ఎలా బతకాలి ఇలా ముందే నిర్ణయించుకున్నారు.. ఆయన జీవితాన్ని ముందే డైరీలో రాసుకున్నారు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఇక బండ్ల గణేష్, బ్రహ్మాజీ, కోన వెంకట్, బీవీఎస్ రవి ఇలా అందరూ కూడా ఎన్నో విషయాలను పంచుకున్నారు.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

சர்வைவர் – 78: ஐஸ்வர்யா vs இனிகோ சண்டை கிளப்பிய சர்ச்சையும், அரங்கேறிய அதிர்ஷ்டக் கல் காமெடியும்!...

“இந்தப் பாட்டுப் பஞ்சாயத்து பெரிசா போயிட்டு இருக்கு போலயே. ‘தீமைதான் வெல்லும்’ல துவங்கிச்சு இல்லையா?” என்று அந்த விவகாரத்தை விசாரிக்க ஆரம்பித்தார் அர்ஜுன். “அவங்களுக்கு உடம்பு சரியில்ல. கேரக்டர்ன்ற வார்த்தையை நான்...