Homeతెలుగు Newsఆరోగ్యంbest breakfast: ఉదయాన్నే ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే చాలా మంచిదట.. - the healthiest indian...

best breakfast: ఉదయాన్నే ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే చాలా మంచిదట.. – the healthiest indian breakfast know here calorie count


ప్రధానాంశాలు:

  • ఉదయాన్నే ఆకలి తీర్చే బ్రేక్‌ఫాస్ట్
  • హెల్దీ ఆప్షన్స్ ఎంచుకోవడం మన చేతుల్లోనే

1. ఇడ్లీ

బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్స్ మాట్లాడేప్పుడు లిస్ట్‌లో ఎప్పుడూ ముందుండేది ఇడ్లీనే. ఇళ్ళల్లోనే కాదండీ, రెస్టారెంట్స్ మెనూ కార్డ్‌లో కూడా ముందు ఉండేది ఇడ్లీనే. అంత పాపులర్ ఈ ఇడ్లీ. చాలా మంది సోమవారం పొద్దున్న బ్రేక్ ఫాస్ట్‌గా ఇడ్లీనే ఎంచుకుంటారు. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఆదివారం ఇడ్లీ పిండి తయారు చేసి పెట్టుకోవచ్చు, రెండు సోమవారం హడావిడికి ఇడ్లీ అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇడ్లీ చేయడం ఎంత తేలికో, తింటే అన్ని పోషకాలు కూడా. బియ్యం బదులు రాగులు, ఓట్స్ కూడా వాడుకోవచ్చు. రెండు ఇడ్లీలు ఒక బౌల్ వెజిటబుల్ సాంబార్‌తో కలిపి తీసుకుంటే లంచ్ వరకూ ఆకలి వేసే పనే లేదు. రెండు ఇడ్లీలు అంటే అరవై కేలరీలు వస్తాయి.

2. దోశ

సౌత్ ఇండియా అంటే అందరికీ గుర్తు వచ్చేవి రెండు – ఒకటి ఇడ్లీ, రెండు దోశ. ఇది తేలికగానూ అరుగుతుంది, కడుపు నిండుగానూ అనిపిస్తుంది. పొద్దుపొద్దున్నే ఇది తినొచ్చా అనే అనుమానం లేకుండా తినేయచ్చు ఈ దోశని. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, గట్ హెల్త్‌కి ఎంతో మేలు చేస్తుంది. మీరు సాంప్రదాయ పద్ధతిలో చేసే దోసెకి హెల్దీ టచ్ ఇవ్వాలనుకుంటే బియ్యం బదులు ఓట్స్ కానీ, రాగి కానీ వాడుకోవచ్చు. కూరగాయలు కొద్దిగా మగ్గించి వాటినీ, పన్నీర్‌నీ కూడా కలుపుకోవచ్చు. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీతో కలిపి తింటే హ్యాపీగా ఉంటుంది. ఒక దోసె మనకి 132 క్యాలరీలు ఇస్తుంది.
షుగర్ పేషెంట్స్ ఈ స్వీట్‌ తినొచ్చొట..
3. ఉప్మా

దోశ పిండి అయితే ముందు రోజే రడీ చేసి పెట్టుకోవచ్చు. పొద్దున్న లేవగానే చేసేయాలంటే ఈజీగా అయిపోయేది మాత్రం ఉప్మానే. పైగా ఉప్మాలో పోషక విలువలు కూడా ఎక్కువే. ఉప్మా రవ్వతో అందరికీ నచ్చే విధంగా ఉప్మా చేసేయవచ్చు. ఇంకా హెల్దీగా కావాలనుకుంటే ఓట్స్ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా కూడా ట్రై చేయవచ్చు. ఈ ఉప్మాలో క్యారెట్స్, క్యాప్సికం, ఉల్లిపాయ, టమాటా, గ్రీన్ పీస్ వంటి కూరగాయలు కూడా కలుపుతారు కాబట్టి కడుపు నిండుగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. తేలికగా అరుగుతుంది కూడా. ఉప్మాలో క్యాలరీలూ తక్కువే, ఫ్యాట్ తక్కువే. ఫైబర్ మాత్రం సమృద్ధిగా ఉంటుంది. ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతాం, కాన్స్టిపేషన్‌ని ప్రివెంట్ చేస్తుంది కూడా. ఒక సర్వింగ్ ఉప్మా అంటే 192 క్యాలరీలు వస్తాయి.

పోహ

4. పోహా

ఈ బ్రేక్ ఫాస్ట్ నార్త్ ఇండియాలో బాగా పాపులర్. పైగా ఇది చేయడం ఎంతో తేలిక. కేవలం పావుగంటలో ఈ టిఫిన్ తయారు చేసేయవచ్చు. అటుకులు, వేరు శనగ పప్పు, కూరగాయలతో చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ ప్రొటీన్‌ని పుష్కలంగా అందిస్తుంది. ఇందులో ఇంకా ఐరన్, మెగ్నీషియం, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. మీకు ఇంకా హెల్దీగా కావాలనుకుంటే స్ప్రౌట్స్ పోహా ట్రై చేయవచ్చు. వెరైటీగా కావాలనుకుంటే బ్రెడ్ పోహా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక సర్వింగ్ పోహాలో 179 క్యాలరీలు ఉంటాయి.

5. మూంగ్ దాల్ చిల్లా

పెసర పప్పుతో చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్ ఎంతో హెల్దీ అని చెప్పవచ్చు. ఒక స్పూన్ నెయ్యితో చేసే ఈ డిష్‌లో మీరు క్యాలరీ కౌంట్ గురించి అసలు వర్రీ కానక్కరలేదు. కడుపు నిండుతుంది, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రుచి మాత్రం అమోఘం. ఒక చిల్లాలో 128 క్యాలరీలు ఉంటాయి.
ఇలా సర్దితే ఇల్లు నీట్‌గా ఉంటుందట..
6. ఢోక్లా

గుజరాతీ స్పెషాలిటీ అయిన ఈ ఢోక్లా పొద్దున్న బ్రేక్ ఫాస్ట్‌కే కాదు, ఈవెనింగ్ స్నాక్ గా కూడా పనికొస్తుంది. శనగ పిండితో చేసే ఈ ఢోక్లా తో కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్స్ ఉన్నాయి. ఇది తిన్నాక ఎక్కువ సేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. గట్ బ్యాక్టీరియాని ఇది ప్రమోట్ చేస్తుంది. అయితే, ఇందులో వేసే పంచదార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు. ఒక ఢోక్లా ద్వారా 60 క్యాలరీలు లభిస్తాయి.

7. పరాఠా

గోబీ, ఆలూ, ఆనియన్, పనీర్ వంటి వాటితో స్టఫ్డ్ పరాఠా చేసుకోవచ్చు. మీకు స్టఫ్డ్ పరాఠా చేయడానికి టైం లేకపోతే ప్లెయిన్ పరాఠా చేసి, కొంచెం ఊరగాయ, పెరుగుతో కలిపి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. పరాఠాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, తేలికగా అరుగుతుంది. ఆయిల్, బటర్ కాకుండా నెయ్యి రాసి తినడం మర్చిపోకండి, చాలు. ఒక ఆలూ పరాఠా నుండి 180 క్యాలరీలు వస్తాయి.
నెలలు నిండకుండానే పుట్టే పిల్లలకి ఈ సమస్యలు వస్తాయట..
8. మసాలా ఆమ్లెట్

మీకు ఎగ్స్ బాగా ఇష్టమై పొద్దున్న పూట్ల కొంచెం ఎక్స్ట్రా ప్రొటీన్ కావాలనుకుంటే ఈ మసాలా ఆమ్‌లెట్ చక్కని ఆప్షన్. రెండు మూడు ఎగ్స్ కొట్టేసి, అందులో మీకు నచ్చే కూరగాయలు, మసాలా వేశారంటే నోరూరించే ఆమ్లెట్ తయారయిపోతుంది. ఒక ఆమ్లెట్ ద్వారా 150 క్యాలరీలు లభిస్తాయి.



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read