Tuesday, July 27, 2021
Homeతెలుగు Newsసినిమాbigg boss 5 telugu: బిగ్ బాస్ నుంచి నాగ్ అవుట్.. ఈ సారి హోస్టింగ్...

bigg boss 5 telugu: బిగ్ బాస్ నుంచి నాగ్ అవుట్.. ఈ సారి హోస్టింగ్ మామూలుగా ఉండదు.. రంగంలోకి నేషనల్ స్టార్ – rana replace nagarjuna as host for bigg boss 5 telugu


ప్రధానాంశాలు:

  • బిగ్ బాస్ నుంచి నాగ్ అవుట్
  • ఈ సారి హోస్టింగ్ మామూలుగా ఉండదు
  • రంగంలోకి నేషనల్ స్టార్

బిగ్ బాస్ హవా ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఐదో సీజన్ ప్రారంభమయ్యేందుకు ఇంకా ఎంతో సమయం ఉన్నా కూడా లీకులు మాత్రం ఊపందుకున్నాయి. గత నెల నుంచి బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించిన ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది. మామూలుగా అయితే ఈ పాటికే ఐదో సీజన్ ప్రారంభం కావాల్సింది. కానీ సెకండ్ వేవ్ వల్ల పరిస్థితి అంతా తారుమారైంది. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ బిగ్ బాస్ పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ మేరకు లీకులు కూడా జెట్ స్పీడ్‌లో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటి వరకు కంటెస్టెంట్ల పేర్లే లీక్ అవుతూ వచ్చేవి. కానీ ఈ సారి ప్రధానంగా హోస్ట్ చుట్టే కథ తిరుగుతోంది. నాగార్జున హోస్ట్‌గా ఉంటారా? లేదా? అనే టాపిక్ ఎక్కువ రోజులు నడిచింది. గడిచిన సీజన్నే నాగ్ ఎంతో కష్టపడి షెడ్యూల్స్‌ను అడ్జస్ట్ చేసుకుని మరీ హోస్ట్ చేశారు. మధ్యలో సమంతకు కూడా ఆ బాధ్యతను అప్పగించారు. అయితే ఇప్పుడు నాగార్జున తన ప్రాజెక్ట్‌లతో మరింత బిజీ కానున్నారు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఐదో సీజన్‌కు హోస్ట్‌గా ఉండకపోవచ్చనే వార్తలు మొదటి నుంచి వచ్చాయి. ఇప్పుడు అవే నిజం కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు నాగార్జున్ హెస్టింగ్ నుంచి తప్పుకున్నారట. ఆ ప్లేస్‌లో నేషనల్ స్టార్ రానా దగ్గుబాటి వచ్చారని టాక్. ఈ మేరకు లీకువీరులు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. వంద శాతం ఈ సమాచారం నిజమైందేనని ఊదరకొడుతున్నారు.

అయితే ఇదే నిజమైతే మాత్రం ఐదో సీజన్ ఎక్కడికో వెళ్తుంది. ఎందుకంటే రానాకు షోలను హోస్ట్ చేయడం కొత్తేమీ కాదు. టాక్ షోలను సమర్ధవంతంగా నడిపిన రానా.. బిగ్ బాస్ షోను తనదైన శైలిలో నడిపించి ఆకట్టుకుంటారు. ఇక రానా ఏ మేరకు కంటెస్టెంట్లను ఆడుకుంటారన్నది చూడాలి. ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సారి కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారినే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. టీవీ యాంకర్లు, యూట్యూబ్ స్టార్ల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. షణ్ముఖ్, యాంకర్ రవి, యాంకర్ జాను వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సిరి హన్మంతు మాత్రం ఫిక్స్ అయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

உங்களுக்கு இதுல எந்த மாதிரி தொப்பை இருக்குன்னு சொல்லுங்க.. அதை குறைக்கும் வழிய சொல்றோம்… | Types...

<!----> மன அழுத்தத்தால் ஏற்படும் தொப்பை ஆம், ஒருவருக்கு அதிகப்படியான மன அழுத்தம் இருந்தால், அது தொப்பையை வரவைக்கும். எப்படியெனில் மனதளவில் ஒருவர் அதிகளவு அழுத்தத்தை சந்திக்கும் போது, உடலில் கார்டிசோலின் அளவு அதிகரிக்கிறது. இதன் விளைவாக அது அடிவயிற்றுப் பகுதியில் கொழுப்புக்களின் தேக்கத்திற்கு வழிவகுத்து, உடல் பருமனுடன், வேறு பல பாதிப்புக்களையும் ஏற்படுத்துகிறது. <!----> இதைக் குறைப்பது எப்படி? மன அழுத்தத்தால் ஏற்படும் தொப்பையைக் குறைக்க, தியானம், யோகா போன்றவற்றை தினமும் மேற்கொள்ள வேண்டும். இதனால் மன அழுத்தம் மற்றும் மனக் கவலை அளவு குறையும். இது தவிர, போதுமான அளவு தூக்கத்தை மேற்கொண்டால், நாள் முழுவதும் புத்துணர்ச்சியுடன் செயல்பட முடியும். <!----> ஹார்மோன் தொப்பை ஹார்மோன் தொப்பை என்பது ஹார்மோன்களின் ஏற்றத்தாழ்வுகளால் ஏற்படுவதாகும். ஹைப்பர் தைராய்டிசம் முதல் பி.சி.ஓஎஸ் வரை, பல ஹார்மோன் மாற்றங்கள் எடை அதிகரிப்பிற்கு வழிவகுப்பதோடு, உடலில் கொழுப்புக்களின் தேக்கத்தை அதிகரித்து தொப்பையை உண்டாக்கும். <!----> ...

Today's news

Latest offer's