Tuesday, September 27, 2022

எண்ணம் போல் வாழ்க்கை..!

breast cancer: Breast Cancer : మందులతో బ్రెస్ట్ కాన్సర్‌ని తగ్గించొచ్చా.. – what are the most common signs and treatment details of breast cancer


బ్రెస్ట్ కాన్సర్స్ రకాలు..

బ్రెస్ట్ కాన్సర్స్ రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఉన్నాయి. అవి సాధారణంగా అందరికీ వచ్చే కాన్సర్స్ ఒకటి అయితే, వంశపారం పర్యంగా వచ్చే రెండో రకం, సరైన లైఫ్ స్టైల్ లేకపోవడంతో కాన్సర్ వస్తుంది. అందుకే స్త్రీలు రెగ్యులర్‌గా చెక్ చేయించుకోవడం మంచిది.

-Dr Sarath Chandra Reddy, Consultant Radiation Oncologist, CARE Hospitals.

కారణాలివే..

పాతకాలంతో పోల్చితే నేడు బ్రెస్ట్ కాన్సర్స్ బారిన పడుతున్నవారు ఎక్కువయ్యారు. ఇందుకు మారిన జీవనశైలే కారణంగా తెలుస్తోంది. శారీరక శ్రమ లేకపోవడం దీంతో బరువు పెరగడం, ప్రెగ్నెంట్ కాకపోవడం, పీరియడ్స్ ముందుగానే రావడం, మెనోపాజ్ లేట్‌గా వచ్చేయడం వీటిన్నింటి వల్ల బాడీలో హార్మోన్స్ పెరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో చిన్న వయసులోనే లింఫోమాకి ట్రీట్‌మెంట్ తీసుకోవడం, ఆ రేడియేషన్ కూడా బ్రెస్ట్ కాన్సర్ రావడానికి ముఖ్య కారణాలని డా. శరత్ చంద్ర చెబుతున్నారు. కాబట్టి మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
telugu samayamGrapes Benefits : ఈ ద్రాక్ష గుండెకి చాలా మంచిదట..
లక్షణాలు..

బ్రెస్ట్ కాన్సర్స్‌ని మనం కొన్ని లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. అవి బ్రెస్ట్, చంకల్లో గడ్డలు ఉండడం, బ్రెస్ట్ సైజ్‌లో మార్పులు, అవి పెరగడం జరుగుతుంది. అదే విధంగా బ్రెస్ట్‌ పై చర్మం రంగు మారడంతో పాటు డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఉంటాయి. అదే విధంగా కొందరికీ చనుమొలలు లోపలకి వెళ్ళిపోతాయి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ముందుగానే చెప్పుకున్నట్లు మారిన లైఫ్‌స్టైల్ కారణంగానే బ్రెస్ట్ కాన్సర్ వస్తోంది. దీని కారణంగానే బరువు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే మంచి లైప్ స్టైల్ పాటించాలని డా. శరత్ సూచిస్తున్నారు. రెగ్యులర్‌‌గా వర్కౌట్ చేయడం, ధ్యానం చేయడం, యోగా అలవర్చుకోవడం చేస్తూ మంచి ఆహారం తీసుకోవాలి. బ్రౌన్ రైస్, ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవడం, రెడ్ మీట్‌తో పాటు కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్ తగ్గించడం చేయాలి.

ఇన్‌‌ఫెర్టిలిటీ వస్తుంది..

కొంతమందికి యంగ్ ఏజ్‌లోనే బ్రెస్ట్ కాన్సర్ వస్తుంది. అలాంటి వారు ముందుగానే డాక్టర్‌ని సంప్రదించడం వల్ల ఇన్‌ఫెర్టిలిటీ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం రెగ్యులర్‌గా డాక్టర్ చెకప్స్‌కి వెళ్ళడం మంచిదని చెబుతున్నారు.

అన్ని గడ్డలు కాన్సర్స్ కాదు..

అయితే, కొంత మందికి అనేక కారణాల వల్ల రొమ్ములు, చంకల్లో గడ్డలు ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రెస్ట్ కాన్సర్స్ అనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది. అందుకే వీటిని పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. వీటిని పరీక్షించిన డాక్టర్స్ మామోగ్రామ్ చేసి సమస్య ఏమనేది తెలియజేస్తారు.

ట్రీట్‌మెంట్..

బ్రెస్ట్ కాన్సర్‌కి 4 రకాల ట్రీట్‌మెంట్ ఉంటుంది. అవి ఏంటంటే..

1. సర్జరీ
2. కీమోథెరపీ
3. రేడియేషన్
4. హార్మోన్ థెరపీ

పేషెంట్స్‌ని పరీక్షించిన డాక్టర్స్.. వారి స్టేజ్‌ని ట్రీట్‌మెంట్‌ని మొదలుపెడతారు.
telugu samayamWeight Loss Dinner : రాత్రి వీటిని తింటే త్వరగా బరువు తగ్గుతారట..

బ్రెస్ట్ కాన్సర్‌పై అవగాహన తప్పనిసరి

మెడిసిన్‌తో బ్రెస్ట్ కాన్సర్‌ని తగ్గించలేమా..

బ్రెస్ట్ కాన్సర్ అని నిర్ధారించాక దీనిని మెడిసిన్‌తో తగ్గించలేం. దీనికి కచ్చితంగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే, ముందుగానే అంటే ఎర్లీ స్టేజ్‌లోనే దీనిని గనుక గుర్తిస్తే హార్మోన్ థెరపీతో దీనిని కంట్రోల్ చేయొచ్చు. దీని వల్ల పెద్ద రిస్క్ ఉండదని చెబుతున్నారు డా. శరత్.

సైడ్ ఎఫెక్ట్స్..

ఇది వరకటి రోజుల్లో ఆపరేషన్ కాస్తా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్జరీ చేయొచ్చొని చెబుతున్నారు డా. శరత్. అయితే ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేయడం వల్ల మరింత వేగంగా కోలుకుంటారని ఆయన సూచిస్తున్నారు.
telugu samayamఈ రాశివారికి ఆటిట్యూడ్ ఎక్కువ.. వీరికి దూరముంటేనే మంచిదట..
బ్రెస్ట్ కాన్సర్ అనేది నేడు సాధారణమే అయిపోయింది. అయితే, దీనిని నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే గుర్తించి వైద్య సాయం తీసుకోవడం వల్ల సమస్య చాలా వరకూ లేకుండా పోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Today's Feeds

lung cancer causes, Lung Cancer : లంగ్ క్యాన్సర్ రాకుండా ఏం చేయాలంటే.. – how to regularly monitor the condition of lungs know here all details

lung cancer causes, Lung Cancer : లంగ్ క్యాన్సర్ రాకుండా ఏం చేయాలంటే.....

0
2020 లో ప్రపంచ వ్యాప్తంగా మరణానికి క్యాన్సర్ ప్రధాన కారణం. ఇతర ప్రాణాంతకతల మాదిరిగానే, ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధి...

Want to submit Guest Post ?

Submit your guest / Sponsored Post on below form 👇🏻👇🏻

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Continue reading