Home తెలుగు News ఆరోగ్యం diabetes controlling tips: ఎక్కువసార్లు మూత్రం వస్తుంటే షుగర్ ఉన్నట్లేనా.. – main cause of diabetes and how to control it know here all

diabetes controlling tips: ఎక్కువసార్లు మూత్రం వస్తుంటే షుగర్ ఉన్నట్లేనా.. – main cause of diabetes and how to control it know here all

0
diabetes controlling tips: ఎక్కువసార్లు మూత్రం వస్తుంటే షుగర్ ఉన్నట్లేనా.. – main cause of diabetes and how to control it know here all

[ad_1]

ప్రధానాంశాలు:

  • పెరుగుతున్న డయాబెటీస్
  • కొన్ని అలవాట్లే సమస్యకి కారణం

20 – 50 వయసు వారిలో డయాబెటీస్ ఉన్న వారు ఎక్కువగా ఉంటున్నారట. ఈ వయసుల వారికి డయాబెటీస్ రావడానికి కల కారణాల్లో సరైన జీవన శైలి పాటించకపోవడం అనేది ముఖ్యం గా చెప్పుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉండడం అనేవి ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఈ రెండింటి వల్ల బరువు పెరుగుతారు.
కరోనా మళ్ళీ వచ్చేసింది.. కొత్త వేరియంట్‌ వైరస్ రాకుండా ఇలా చేయండి..
దానికి తోడు లాక్ డౌన్ రెస్ట్రిక్షన్స్, వర్క్ ఫ్రం హోం కొన్ని కొత్త కొత్త ఛాలెంజెస్‌ని తెచ్చాయి. కొంత మంది వర్కౌట్స్ చేయడం వంటి కొన్ని మంచి అలవాట్లు చేసుకోగలిగితే, కొంత మందికి అలా వీలవ్వదు. ఎక్కువ సేపు వర్క్ చేయవలసి రావడం, సరిగ్గా నిద్ర ఉండకపోవడం, స్ట్రెస్ ఎక్కువయిపోవడం, సమయానికి తినకపోవడం వంటి వాటి వల్ల బరువు పెరిగి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువయ్యింది.

రిస్క్ ఫ్యాక్టర్స్..

డయాబెటీస్ రావడానికి కల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటంటే”
1. కుటుంబ చరిత్ర లో డయాబెటీస్ ఉన్న వారు ఉండడం
2. ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం
3. స్మోకింగ్ అలవాటు ఉండడం
4. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండడం
5. సరైన నిద్ర లేకపోవడం
6. ఒత్తిడి ఎక్కువగా ఉండడం
7. హైబీపీ
8. ఉండవలసిన దాని కన్నా ఎక్కువ బరువు ఉండడం
9. హై కొలెస్ట్రాల్
10. పీసీఓఎస్ కానీ, జెస్టేషనల్ డయాబెటీస్ కానీ ఉండి ఉండడం

లక్షణాలు:

డయాబెటీస్ ఉన్న వారిలో సాధారణంగా ఇక్కడ చెప్పిన లక్షణాలు కనపడతాయి.

1. వీరు తరచూ మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, బాడీ ఎక్సెస్ గా ఉన్న గ్లూకోజ్ ని బయటకి పంపుతూ ఉంటుంది.
2. మాటి మాటికీ బాత్రూం కి వెళ్ళి రావడం వల్ల డీహైడ్రేషన్ పెరిగి బాగా దాహంగా అనిపిస్తుంది.
3. షుగర్ లెవెల్స్ సరిగ్గా లేక శరీరం లో శక్తి తక్కువయ్యి నీరసం గా నిస్త్రాణగా ఉంటుంది.
4. శరీరం లో కణాలు తగినంత గ్లూకోజ్ ని గ్రహించలేవు కాబట్టి బాడీ ఎనర్జీ కోసం ఫ్యాట్ ని వాడుకుంటుంది. ఫలితం గా బరువు తగ్గుతారు.
మా బావ నన్ను అలా చేస్తున్నాడు.. ఏం చేయను..
జాగ్రత్తలు:

డయాబెటీస్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవి:

1. రిఫైండ్ కార్బ్స్, షుగర్ తక్కువగా..

షుగర్ ఎక్కువగా, కార్బ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటే కొంత కాలం తరువాత డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అందుకే, రిఫైండ్ కార్బ్స్ బదులుగా కూరగాయలు, ఓట్మీల్, పూర్తి ధాన్యాలు వంటి కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవడం మంచిది.

2. స్మోకింగ్ ఎవాయిడ్ చేసి..

స్మోకింగ్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ ని కారణం కావచ్చు. స్మోకింగ్ కి దూరంగా ఉండడం వల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గించవచ్చు.

నా భార్య అలా చేయడం నచ్చడం లేదు.. ఏం చేయను..

ఎక్సర్‌సైజ్

3. రెగ్యులర్ గా ఎక్సర్‌సైజ్..
సెడెంటరీ లైఫ్ స్టైల్ ని పూర్తిగా ఎవాయిడ్ చేసి, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా వంటి యాక్టివిటీస్ లో మీకు నచ్చే దాన్ని ఎంచుకుని చేయవచ్చు. రోజూ కనీసం అరగంటైనా ఇలా చేయాలి. అయితే, వీలున్నంత వరకూ ప్రస్తుతం ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఎవాయిడ్ చేసి ఇంట్లోనో, జిమ్ లోనే చేయడం మంచిది, ఎందుకంటే బయట పొల్యూషన్, పొగ మంచు అధికంగా ఉన్నాయి.

4. ఫైబర్ ఎక్కువగా..

వెయిట్ మ్యానేజ్మెంట్ కీ గట్ హెల్త్ కీ ఫైబర్ ఎంతో అవసరం. మీ ఆహారం లో ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఆహారం లో తగినంత ఫైబర్ ఉన్నప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here