Home తెలుగు News ఆరోగ్యం diet to increase stamina, Diet to increase stamina: ఇవి తింటే.. ఎంత పని చేసినా నీరసం రాదు..! – include this food in your diet to increase your stamina

diet to increase stamina, Diet to increase stamina: ఇవి తింటే.. ఎంత పని చేసినా నీరసం రాదు..! – include this food in your diet to increase your stamina

0
diet to increase stamina, Diet to increase stamina: ఇవి తింటే.. ఎంత పని చేసినా నీరసం రాదు..! – include this food in your diet to increase your stamina

Authored by Rajiv Saranya | Samayam Telugu | Updated: Sep 24, 2022, 11:53 AM

కానీ చాలా మందికి, కొంతదూరం పరిగెట్టిన వెంటనే ఆయాసం వస్తుంది, పరిగెట్టలేక ఒక చోట కూర్చుండి పోతారు. వాళ్ల స్టామినా కొంతసేపటికే పూర్తైపోతుంది. పరిగెత్తడానికే కాదు, మనం ఏపని పూర్తి చేయడానికైనా స్టామినా అవసరం. మనకు స్టామినా సరిగ్గా లేకపోతే.. అనుకున్న ఏ ఒక్క పని సంతృప్తిగా, సంపూర్తిగా అవ్వదు. మీ డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే మీ స్ఠామినా పెరుగుతుంది. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

 

healthy food
వెయిట్‌ లాస్‌కు ప్రయత్నిస్తున్నవాళ్లకు రన్నింగ్‌ చాలా ముఖ్యమైన వ్యాయామం. చాలా మంది వేరే వర్క్‌అవుట్స్‌‌ కంటే.. రన్నింకే‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే.. దీనికో పెద్ద క్యిలిక్యులేషన్స్, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్‌ అవసరం లేదు. చక్కగా ఏ పార్కులోనే, ఖాళీగా ఉండే రోడ్డు పక్కన హాయిగా రన్నింగ్‌ చేయవచ్చు. కానీ చాలా మందికి, కొంతదూరం పరిగెట్టిన వెంటనే ఆయాసం వస్తుంది, పరిగెట్టలేక ఒక చోట కూర్చుండి పోతారు. వాళ్ల స్టామినా కొంతసేపటికే పూర్తైపోతుంది. పరిగెత్తడానికే కాదు, మనం ఏపని పూర్తి చేయడానికైనా స్టామినా అవసరం. మనకు స్టామినా సరిగ్గా లేకపోతే.. అనుకున్న ఏ ఒక్క పని సంతృప్తిగా, సంపూర్తిగా అవ్వదు. మనకు స్టామినా ఎక్కువగా ఉండాలంటే మన డైట్‌లో పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి.
స్టామినా అంటే ఏమిటి..?
ఎక్కువ సమయంపాటు శారీరక, మానసిక పనులు చేయడానికి మనకు సహకరించే బలం, శక్తిని స్టామినా అంటారు. మీకు పనిలో ఎదురయ్యే ఒత్తిడి, అసౌకర్యాన్ని ఎదుర్కోవడానికి, శక్తిని పెంచుకోవడానికి స్టామినా సహాయపడుతుంది. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. మరి స్టామినా పెరగాలంటే ఏం తినాలో తెలుసుకుందామా?
బీట్‌ రూట్‌

beetroot


NCBIలో ప్రచురించిన నివేదిక ప్రకారం, బీట్‌రూట్ అథ్లెట్‌కు సూపర్‌ ఫుడ్‌లా సహాయపడుతుంది. ఇందులో ఉండే నైట్రేట్లు గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మీరు స్టామినా పెంచుకోవాలంటే.. మీ డైట్‌లో తరచుగా బీట్‌ రూట్‌ చేర్చుకుంటే మంచిది. దీనిలో శరీరానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీరు వేగంగా, ఎక్కువ సేపు పరిగెత్తడానికి, ఏదైనా పని చేయడానికి సహాయపడతాయి. బీట్‌రూట్‌ మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. బీట్‌ రూట్‌‌‌‌‌‌‌ వ్యక్తి పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీరు ప్రతి రోజూ బీట్‌ జ్యాస్‌ చేసుకుని తాగితే మంచిది.
ఓట్స్‌..

​Oats


మీరు ఉదయం పూట లాంగ్‌ రన్‌కు వెళ్తుంటే.. మంచి కార్బ్స్ ఉన్న ఓట్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి. బరువు తగ్గాలనుకునేవారికి కార్బోహైడ్రైట్లు మంచివి కావని అందరూ అనుకుంటారు, కాని ఇది అన్ని సందర్భాల్లోనూ నిజం కాదు. అన్ని పిండి పదార్థాలు చెడ్డవి కాదని మీరు గుర్తుంచుకోవాలి. మీరు బరువు తగ్గడానికి, స్టామినా పెంచుకోవడానికి సరైన కార్బ్స్‌ ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. ఓట్స్‌లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి బెస్ట్‌ ఛాయిస్‌. ఓట్స్‌ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఓట్స్ మిమ్మల్ని చాలా సమయం పాటు ఎనర్జీటిక్‌గా, ఫిల్లింగ్‌గా ఉంచుతాయి. మీరు తరచూ ఓట్స్‌ తీసుకుంటే, మీ స్టామినా పెరుగుతుంది.
అరటిపండు..

​Bananas


NIHలో ప్రచురించినఒక అధ్యయనం ప్రకారం, వ్యాయామానికి ముందు అరటిపండు తీసుకుంటే శక్తి లభిస్తుంది. అరటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు ఏదైనా రేస్‌లో, స్పోర్ట్‌ కాంపిటిషన్‌లో పాల్గొనే ముందు స్పోర్ట్స్ డ్రింక్ తీసుకోవడం కంటే అరటిపండు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటి శక్తిని పెంచడమే కాదు, శరీరానికి ఎన్నో పోషకాలు అందిస్తుంది. దీనిలో కొవ్వులు, కార్బ్స్‌, ఫైబర్‌‌, పొటాషియం, ఫాస్ఫరస్‌, పెప్టిన్‌, సుక్రోజ్‌, ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌, విటమిన్‌-సి, విటమిన్‌-బి6 పుష్కలంగా ఉంటాయి. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, డీహైడ్రేషన్‌, నొప్పుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
బ్రౌన్‌ రైస్‌..

Brown Rice


బ్రౌన్ రైస్‌లో స్టార్చ్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి వైట్ రైస్ కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది మీ కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. బ్రౌన్‌ రైస్‌ తీసుకుంటే.. మన బాడీ స్టామినా కూడా పెరుగుతుంది.
పాలకూర..

spinach


నీరసం, అలసట, నిస్సత్తువకు ప్రాధాన కారణం పోషకాల లోపం. వేగంగా పరిగెత్తడానికి, పనులు చేయడానికి, దూర ప్రయాణాలు చేయడానికి పోషక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ స్టామినా పెంచడానికి పాలకూర అద్భుతంగా సహాయపడుతుంది. పాల కూరలో విటమిన్ ఎ, సి, ఇ, కె, ఐరన్‌ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంలో తోడ్పడతాయి. మీరు తరచుగా పాలకూర తీసుకుంటే మీ స్టామినా పెరుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here