Home తెలుగు News ఆరోగ్యం drinks to control acidity: GASTRIC PROBLEMS: ఈ డ్రింక్స్‌ తాగితే.. గ్యాస్ట్రిక్‌ సమస్య దూరమవుతుంది..! – list of drinks that control gastric problem

drinks to control acidity: GASTRIC PROBLEMS: ఈ డ్రింక్స్‌ తాగితే.. గ్యాస్ట్రిక్‌ సమస్య దూరమవుతుంది..! – list of drinks that control gastric problem

0
drinks to control acidity: GASTRIC PROBLEMS: ఈ డ్రింక్స్‌ తాగితే.. గ్యాస్ట్రిక్‌ సమస్య దూరమవుతుంది..! – list of drinks that control gastric problem

[ad_1]

మారుతున్న జీవనశైలి,చెడు ఆహారపు అలవాట్ల కారణంగా.. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సమయపాలన పాటించకుండా తీసుకునే ఆహారం, ఆయిల్, మసాల, జంక్‌ ఆహారం వల్ల.. ముఖ్యంగా గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వేసవిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి గ్యాస్‌ ఎక్కువగా ఉంటుంది. అది తినే ఆహారం వల్ల కావొచ్చు.. పొట్టలో ఇన్‌ఫెక్షన్ల వల్ల కావొచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బీన్స్‌, కొన్నిసార్లు క్యారెట్లు, పప్పులు, పాలు, పాల ఉత్పత్తుల వల్ల పొట్టలో గ్యాస్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మీరు కొన్ని డ్రింక్స్‌ తాగితే.. మీ గ్యాస్‌ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ డ్రింక్స్‌ క్రమం తప్పకుండా తీసుకుంటే, మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మీ కడుపులో యాసిడ్‌ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మీ కడుపులో కణాలను నయం చేస్తాయి. మీ అసిడిటీ తగ్గించే డ్రింక్స్‌ ఏమిటో చూసేయండి..
కీరా జ్యూస్‌..

​Cucumber juice


వేసవిలో కాలంలో కీరా మీ ఆరోగ్యానికి మంచి చేస్తుంది. కీరా జ్యూస్‌ తీసుకుంటే.. యాసిడ్‌ రిఫ్లక్స్‌ నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. కీరా మీ శరీరానికి ఫైబర్‌, నీరు పుష్కలంగా అందిస్తుంది. ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీరాలో తక్కువ కేలరీలు ఉంటాయి.. మీరు ఇది తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్‌ వస్తుంది. మీరు జంక్‌ తినకుండా ఉండటానికి ఇది మీకు సహాయపడుతుంది.
నిమ్మరసం..

lemon water


నిమ్మరసం రోజూ తీసుకుంటే మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ.. తెలుసు. నిమ్మరసంలో విటమిన్ సి, బి ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్‌లో పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయ నీళ్లు రోజూ తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. నిమ్మరసం తీసుకుంటే.. ఎసిడిటీ వంటి మీ జీర్ణ సమస్యలూ పరిష్కారమవుతాయి. నిమ్మకాయ నీరు తీసుకుంటే.. ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది, శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడంలోనూ నిమ్మరసం సహాయపడుతుంది. వేసవిలో నిమ్మరసం తాగితే..హైడ్రేట్‌డ్‌గా ఉంటారు.
అల్లం టీ..

​Ginger Tea


అల్లం, ఎసిడిటీ, గ్యాస్‌ సమస్యలను పరిష్కరించడంలో అల్లం సమర్థవంతంగా పని చేస్తుంది. అల్లం టీ తాగితే మీకు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్‌ సమస్య ఇబ్బంది పెడుతుంటే.. అల్లంటీ తాగితే మీకు త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. మీరు అల్లాన్ని సూప్‌లో, కూరల్లో వేసుకుని తింటే మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
కొబ్బరి నీళ్లు..

Coconut water


మీరు గ్యాస్ట్రిక్‌, అజీర్తి, అసిడిటీ లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. కొబ్బరి నీళ్లలో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, స్టార్చ్‌ పుష్కలంగా ఉంటాయి. , కొబ్బరి నీళ్లలో మెగ్నీషియం, కాపర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మీ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
వాము టీ..

​Ajwain water


మీరు అసిడిటీతో బాధపడుతుంటే.. వాము టీ మీకు బెస్ట్‌ ఆప్షన్‌. వాములో ఔషధ గుణాలెక్కువ. వాము జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. విరోచనాలతో బాధపడుతున్నవారు వాము నీళ్లను తాగితే ఉపశమనంగా ఉంటుంది. గ్యాస్‌ ట్రబుల్‌తో బాధపడేవారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో అర చెంచా వాము వేసి కాసేపు మరిగించి వడగట్టి వేడి వేడిగా తాగితే పొట్టలోని గ్యాస్‌ తేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తుంది.
సోంపు నీళ్లు..

చాలామంది భోజనం తర్వాత కాస్తంత సోంపును నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఇందుకు కారణం ఆహారం బాగా జీర్ణమవుతుందనే. సోంపులో యాంటీఆక్సిడెంట్లు, ఏ, సీ, సీ వంటి విటమిన్లు, రాగి, కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం,మెగ్నీషియం వంటి మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. సోంపు నీళ్లు తీసుకుంటే గ్యాస్‌, మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here