Homeతెలుగు Newsఆరోగ్యంfoods for lungs, Foods For Lungs : వీటిని తింటే ఊపిరితిత్తులకి చాలా మంచిదట.....

foods for lungs, Foods For Lungs : వీటిని తింటే ఊపిరితిత్తులకి చాలా మంచిదట.. – best foods for lung health know here list


నీరు..

నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అన్ని శరీర భాగాల కంటే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరీ మంచిది. దీని వల్ల ఊపిరితిత్తులు హైడ్రేటెడ్‌గా ఉంటాయి. ఈ కారణంగా వాటి పనితీరు కూడా బాగుంటుంది. అందుకే ఊపిరితిత్తులు బాగుండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే దానిమ్మ

దానిమ్మ..

చూడ్డానికి ఎర్రగా నోరూరించే దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ప్రత్యేక గుణాలు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, శ్వాసకోశ పరిస్థితులను దూరం చేస్తుంది. కాబట్టి.. ఇది ఊపిరితిత్తులకి మంచిదని చెబుతారు.
Miss India 2022 : ఫెమినా మిస్ ఇండియాగా సిని శెట్టి.. తెలంగాణ అమ్మాయికి నాలుగో స్థానం..
ఆపిల్స్..

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదంటారు. ఇందులోని గుణాలు అంత మంచివి మరి. అవే కాకుండా వీటిని రోజూ తినడం వల్ల ఊపిరితిత్తులకి వచ్చే క్రోనిక్ ఆబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే వ్యాధి రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

అల్లంలోని గుణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది

అల్లం..

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది ఆస్తమా ఉన్నవారికి చాలా మంచిది. అల్లం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకి హాని చేసే శ్లేష్మం బయటికి వెళ్ళిపోతుంది. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం బాగుంటుంది.

పసుపు..

కర్క్యూమిన్ అనే కాంపౌండ్‌ని కలిగి ఉండే పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగానే ఉంటాయి. దీనిని రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తులకి వచ్చే సమస్యలు తగ్గుముఖం పడతాయి.
Romance Fantasy : వామ్మో శృంగారం ఇలా కూడా చేస్తారా..
గుమ్మడి..

బీటా కెరాటిన్, లుటిన్, జెయాక్సంతిన్ ఎక్కువగా ఉండే గుమ్మడిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది.

వెల్లుల్లి..

వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. వీటిని డైట్‌లో చేర్చుకోవడంలో ఊపిరితిత్తుల్లో సమస్యలు దూరమై ఊపిరి తీసుకోవడం సులభం అవుతుంది. ఇది ఆస్తమా రాకుండా పనిచేసే మెడిసిన్‌లాంటిది. సో… వీటిని కూడా మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

బెల్‌పెప్పర్స్‌ని ప్రత్యేక గుణాలు ఊపిరితిత్తులకి మంచిది

బెల్ పెప్పర్స్..

బెల్‌ పెప్పర్స్.. క్యాప్సికమ్ అని పిలిచే ఈ కూరగాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తులకి హాని చేసే కారకాలతో పోరాడుతుంది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో దొరికే క్యాప్సికమ్స్‌లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి లంగ్ కాన్సర్ రిస్క్‌ని దూరం చేస్తుంది.
Diabetes : షుగర్ పేషెంట్స్ గుమ్మడికాయ తినొచ్చా..
జాగ్రత్తలు..

అదే విధంగా, ఊపిరితిత్తులు శరీరానికి ఊపిరిని అందిస్తాయి. వీటిని కాపాడుకోవడం మన బాధ్యత. అందుకే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిందే.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read This story In English : click Here



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read