Home తెలుగు News ఆరోగ్యం frozen foods disadvantages, Supermarket Foods : సూపర్ మార్కెట్లో దొరికే వీటిని అస్సలు కొనొద్దొట.. – what are the disadvantages of supermarket frozen foods

frozen foods disadvantages, Supermarket Foods : సూపర్ మార్కెట్లో దొరికే వీటిని అస్సలు కొనొద్దొట.. – what are the disadvantages of supermarket frozen foods

0
frozen foods disadvantages, Supermarket Foods : సూపర్ మార్కెట్లో దొరికే వీటిని అస్సలు కొనొద్దొట.. – what are the disadvantages of supermarket frozen foods

బ్రకోలీ..

సాధారణంగా బ్రకోలీని మనం కొంటుంటాం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. కానీ, దీనని ఫ్రోజెన్ చేసినప్పుడు రుచితో పాటు ఆకృతిని కూడా కోల్పోతుంది. దీంతో వాటిని సూపర్ మార్కెట్స్ నుంచి కాకుండా స్థానిక మార్కెట్ నుండి కొనడం ఉత్తమం. బ్రోకలీని కవర్‌లో వేసి గడ్డకట్టేలా ఉంచడం వల్ల స్పటికాల అభివృద్ధికి దారితీస్తుందని, ఇది బ్రోకలీ పోషక విలువలని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

స్ట్రాబెర్రీస్..

స్ట్రాబెర్రీస రుచి కారణంగా చాలా మంది వీటిని ఇష్టపడతారు. ఈ కారణంగా వీటిని ఏడాది పొడవునా అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అయితే, వీటిని సీజన్‌లో మాత్రమే కొనాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ పోరస్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. నీటితో నిండినవి, ఘనీభవించడంతో ఇవి విచ్ఛిన్నమవుతాయి. ఇది రుచి, ఆకృతిని నాశనం చేస్తాయి. అదనపు ద్రవంతో నిండి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాల్షియం క్లోరైడ్, కాల్షియం లాక్టేట్, కాల్షియం ఆస్కార్బేట్, కాల్షియం ప్రోపియోనేట్ వంటి ప్రిజర్వేటివ్స్ స్ట్రాబెర్రీల షెల్ఫ్ లైఫ్‌, రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు.

మూలికలు..

అంటే, కొత్తిమీర, పుదీనా వంటివి అన్నమాట. ఇవి తాజా సువాసన కలిగి భోజనానికి మరింత రుచిని జోడించగలవు. మనలో చాలా మంది వీటిని క్లీన్ చేసి, కట్ చేసేంత ఓపిక లేదని వీటిని తీసుకుంటారు. కానీ, ఇవి గడ్డకట్ట క్రమంలో వీటి సామర్థ్యాన్ని, రుచిని కోల్పోతాయి. కలిపి ప్యాక్ చేయడం వల్ల త్వరగా లోపల కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. వీటి షెల్ఫ్ జీవితాన్ని కాపాడేందుకు గడ్డకట్టిన కూరలను కొనడం కంటే వాటిని తాజాగా పెంచుకోవడం మంచిది.

బర్గర్ ప్యాటీస్..

బర్గర్ ప్యాటీలు, కోల్డ్ చైన్ స్టోర్ నుండి నగ్గెట్స్ కొనడం ఇంట్లో బర్గర్ చేసేందుకు మాంచి ఆప్షన్ అనుకోవచ్చు. కానీ, అవి చేసిన పిండి పదార్థాలు, ఎమల్సిఫైయర్‌ల వంటి సంకలితాలతో నిండి ఉన్నాయని తెలిస్తే మీరు షాక్ అవుతారు. అంతేకాకుండా ఓవర్ ఫ్రీజింగ్ కారణంగా రుచిని తగ్గిస్తుంది. నిజమైన ఆకృతిని కోల్పోతుంది.

frozen foods

ఫ్రోజెన్ ఫుడ్స్

పుట్టగొడుగులు..

సూపర్ మార్కెట్ నుండి క్లీన్ ఫ్రోజెన్ ప్యాక్ పుట్టగొడుగులు కొనడం ఈజీనే కానీ, వీటిని ఫ్రోజెన్ చేసిప్పుడు అవి మెత్తగా, తడిగా మారుతుంటాయి. వీటిని తినడం అంత మంచిదికాదు.

ఏవైనా సరే మనం కొంటున్నప్పుడు అవి తాజాగా ఉండడం మంచిది. అయితే సూపర్ మార్కెట్లో లభించే ఈ ఫ్రోజెన్ ఫుడ్స్ చాలా రోజులుగా ఉండి వాటి తాజాదనాన్ని కోల్పోతాయి. వీటిని కొనడం వల్ల తాజా ఫుడ్స్‌లో లభించే పోషకాలు లభించవు. అందుకే వీటి బదులు తాజా పదార్తాలు తీసుకోవడం ఉత్తమం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here