Homeతెలుగు NewsసినిమాGenelia D'Souza: నీకు మాటిస్తున్నా.. నువ్వు ఒంటరివి కావు!! అతనితో దిగిన ఫొటో షేర్ చేస్తూ...

Genelia D’Souza: నీకు మాటిస్తున్నా.. నువ్వు ఒంటరివి కావు!! అతనితో దిగిన ఫొటో షేర్ చేస్తూ జెనీలియా ఎమోషనల్‌ పోస్ట్‌ – genelia d’souza latest post abhou her child riaan deshmukh


తెలుగుతో పాటు ఇతర దక్షిణ ఇండస్ట్రీలో నటించి ఎంతో మందిని అలరించింది జెనిలియా. ‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా ఆమె నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు. పక్కింటి అమ్మాయిలా ఆమె చూపిన ఎక్స్‌ప్రెషన్స్ ఇండస్ట్రీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయని చెపుకోవచ్చు. అయితే ఆ తర్వాత బాలీవుడ్‌ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ.. అప్పటినుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. సిల్వర్ స్క్రీన్‌పై అలరించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులను పలకరిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా జెనీలియా షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 2012 ఫిబ్రవరిలో రితేష్‌ని పెళ్లాడిన ఈ బ్యూటీకి ఇద్దరు సంతానం. ఆ ఇద్దరు బిడ్డల ఫొటోలు, వీడియోలను నెటిజన్లతో పంచుకునే ఆమె తాజాగా తన పెద్ద కుమారుడు రియాన్‌ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నీకు మాటిస్తున్నా’ అంటూ కుమారుడిపై ప్రేమ కురిపిస్తూ ఆమె పోస్ట్ చేసిన సందేశం వైరల్‌గా మారింది.

”మై డియరెస్ట్ బాయ్ రియాన్‌.. నీ పుట్టినరోజు సందర్భంగా ఓ మాటిస్తున్నా. నీ చిట్టి బుర్రలో ఉన్న ఎన్నో కోరికలు, ఆశలు నెరవేరేలా నీకు సహకరిస్తా. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కలను కాలేను కానీ.. ఆ రెక్కల కింద గాలినవుతా. అన్ని విషయాల్లోనూ నువ్వు మొదటి స్థానంలో ఉండాలని నేను కోరుకోను.. కానీ చివరి స్థానంలో ఉన్నా నీవెంటో, నీ ప్రత్యేకతలేంటో నేను గుర్తిస్తా. నిరాశ చెందను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటాను. ఎప్పుడూ నువ్వు ఒంటరివి కాకుండా చూస్తా. పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్‌” అని పేర్కొంటూ రియాన్‌తో దిగిన పిక్ షేర్ చేసింది జెనీలియా.
తెలంగాణలో మగాళ్లు అలా చేసినా ఆడవాళ్లు మాత్రం!.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్
తన ముద్దుల తనయుడిపై జెనీలియా ప్రేమను అంతా స్వాగతిస్తున్నారు. ఆ కుర్రాడికి స్పెషల్ విషెస్ చెబుతూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ లాంటి సెలబ్రిటీలు సైతం ఈ పోస్టుపై రియాక్ట్ అవుతూ రియాన్‌కు బర్త్‌ డే విషెస్‌ చెప్పడం విశేషం.





Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read