Homeతెలుగు Newsఆరోగ్యంhow to sleep fast, Tips for Sleep : ఇలా చేస్తే క్షణాల్లో నిద్రపోతారట.....

how to sleep fast, Tips for Sleep : ఇలా చేస్తే క్షణాల్లో నిద్రపోతారట.. – proven tips to sleep better at night know here


Tips for Sleep : నిజానికి చాలా మంది నిద్ర విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎప్పుడు కూడా సరిగ్గా నిద్ర పట్టక పోవడం పదే పదే భయంకరమైన ఆలోచనలు రావడం తీవ్రమైన ఒత్తిడి తో సతమతం అవ్వడం లేదంటే గజిబిజిగా ఉండటం ప్రశాంతత లేక పోవడం వంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అలానే ఒత్తిడి లేకుండా ఆనందంగా నిద్ర పోతే చక్కగా ఆనందంగా మనం ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి అలా ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది పైగా మంచి నిద్రని కూడా పొందలేము.ఇటువంటి సమస్యలు కలిగి ఉన్న వాళ్ళు చక్కటి పద్ధతిని అనుసరిస్తే మంచి బయట పడొచ్చు ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఇలా ఇబ్బంది పడే వాళ్లు స్పిరిచ్యువల్ లీడర్ ఫౌండర్ ఆఫ్ ఏ ఐ ఆర్ ఇన్స్టిట్యూట్ అఫ్ రియలైజేషన్ రవి కొన్ని టిప్స్ చెప్పారు మరి ఆయన చెప్పిన టిప్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.
Hair care : బెండకాయతో ఇలా చేస్తే జుట్టు సిల్కీగా, పొడుగ్గా పెరుగుతుందట..
వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే హ్యాపీ గా ఉండడానికి అవుతుంది దానితో పాటుగా చక్కటి నిద్రని కూడా పొందొచ్చు. ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు. అలానే నాణ్యమైన నిద్రని కూడా పొందడానికి అవుతుంది. అయితే మరి ఈ టిప్స్ ని ఫాలో అవ్వాలి కష్టంగా ఉంటాయా అని మీరు ఆలోచించొద్దు ఇవి చాలా సులభంగా ఉన్నాయి. పైగా ఎవరైనా సరే వీటిని ఫాలో అవ్వొచ్చు.

ప్రతీ రోజు మెడిటేషన్:

చాలా సార్లు మీరు ఈ విషయాన్ని వినే వుంటారు. మెడిటేషన్ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని. నిజంగా మెడిటేషన్ వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను మనం పొందొచ్చు. ప్రతి రోజూ మెడిటేషన్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. మెదడుకు ఎంతో నిశబ్దంగా మారుతుంది సాధారణంగా మన మెదడు 50 ఆలోచనలను ప్రొడ్యూస్ చేస్తుంది అది కూడా ఒక నిమిషంలో. అంటే రోజుకి 50 వేల ఆలోచనలు వరకు మనకు వస్తూ ఉంటాయి. కోతి లాగ మన యొక్క ఆలోచనలు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ఉరుకుతూ ఉంటాయి. మన మెదడు కనుక ఇలా పని చేస్తూ ఉంటే మనకు నిద్ర పట్టదు. అయితే ఎప్పుడైతే మెంటల్ థాట్ రేట్‌ని తగ్గించుకుంటారో అప్పుడు చక్కగా ప్రశాంతంగా ఉండడానికి అవుతుంది. యాభై ఆలోచనల నుంచి ఒక ఆలోచన కి తీసుకు వస్తే చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు మంచిగా మెడిటేషన్ చేయడం వల్ల రిలాక్స్‌గా ఉండొచ్చు. అలానే నిద్రలేమి సమస్య నుండి కూడా బయట పడొచ్చు.

ఇతర లాభాలు:

  • ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ సహాయ పడుతుంది.
  • అదే విధంగా మీ యొక్క ఏకాగ్రతను కూడా పెంపొందించుకోవడానికి అవుతుంది.
  • ఆందోళన తగ్గి మీరు కుదుట పడవచ్చు.
  • మెడిటేషన్ తో స్వచ్ఛమైన స్థితిని అనుభవించడానికి కూడా అవుతుంది. ప్రశాంతంగా మీ మనసు ఉంటుంది.
  • అలానే కమ్యూనికేషన్ కూడా బాగా జరిగేటట్టు చేస్తుంది మెడిటేషన్.

ఈ మధ్య కాలంలో ఎక్కువమంది ఒత్తిడి తో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారు ప్రతి రోజు మెడిటేషన్ చేయడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. అయితే మెడిటేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. వీటిని ఫాలో అయితే మంచిగా మెడిటేషన్ చేయడానికి అవుతుంది.
Raksha Bandhan : ఇంట్లోనే ఈ రాఖీలు తయారు చేయండిలా..

  • మెడిటేషన్ చేసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయని చోట కూర్చోండి. అప్పుడు మీరు ఏకాగ్రత పెట్టడానికి అవుతుంది.
  • అలానే మీ పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ప్రశాంతతనిచ్చేలా ఉండాలి.
  • ఉదయం మరియు సూర్యాస్తమయం అయ్యే సమయం మెడిటేషన్ చేయడానికి మంచిది అలానే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కంఫర్ట్ గా కూర్చోవాలి. అప్పుడే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఏకాగ్రత పూర్తిగా పెట్టడానికి అవుతుంది.
  • మెడిటేషన్ చేసే ముందు ఏమీ తినకండి అప్పుడు మెడిటేషన్ బాగా చేయొచ్చు.
  • మొదట మెడిటేషన్ చేసేటప్పుడు మీరు ఈజీగా ఉండే వ్యాయామాలతో స్టార్ట్ చేయండి మెడిటేషన్ చేసేటప్పుడు ఆనందంగా నవ్వుతూ చేయండి ఇలా ఈ చిట్కాలను ఫాలో అయ్యారంటే కచ్చితంగా బాగా మెడిటేషన్ చేయడానికి అవుతుంది.
Meditation for sleep disorders

ధ్యానంతో లాభాలు

పాజిటివ్ ఎమోషన్స్ :

ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎమోషన్స్‌ని కలిగి ఉండండి. ఇవి కూడా మిమ్మల్ని ఆనందంగా ప్రశాంతంగా ఉంచుతాయి. పాజిటివ్ ఎమోషన్స్ అయినటు వంటి ప్రేమ, ధైర్యం, నమ్మకం, విశ్వాసం ఇలాంటి వాటిని కలిగి ఉండడం వల్ల చక్కగా మీరు పాజిటివ్ ఆలోచనల తో ఉంటారు అలానే ప్రశాంతంగా కూడా ఇవి మిమ్మల్ని ఉంచుతాయి. ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎమోషన్స్ వచ్చాయంటే వాటిని మీరు పాజిటివ్ ఎమోషన్స్‌తో మార్చుకోండి. నెగిటివ్ ఆలోచనలు మరియు ఎమోషన్స్‌ని పాజిటివ్ ఆలోచనలు మరియు ఎమోషన్స్‌తో రీప్లేస్ చేస్తే చక్కటి ఫలితాన్ని మీరు పొందొచ్చు.

ఒక సారి కావాలంటే మీరు ఇలా ప్రయత్నించి చూడండి. పైగా ఎప్పుడైనా సరే మంచి ఆలోచనలతో ఆనందదాయకమైన ఆలోచనలతో ఉంటే చక్కటి నిద్రని పొందొచ్చు. అంతే కాదండి యాంగ్జైటీ, ఒత్తిడి నుంచి దూరంగా ఉండి మంచి నిద్రను పొందడానికి అవుతుంది చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎప్పుడూ కూడా చికాకుగా కోపంగా నిద్రపోతూ ఉంటారు. దాని వల్ల అస్సలు నిద్ర పట్టదు. పైగా మంచి ఎమోషన్స్ మంచి ఆలోచనలు కలిగి ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. ఎంతటి బ్యాడ్ మూడ్ అయినా సరే వెంటనే మారి పోతుంది. అందుకని కచ్చితంగా ఇలా ప్రయత్నం చేసి చూడండి. అప్పుడు మంచి నిద్ర పొందొచ్చు. అలానే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. శారీరకంగా మానసికంగా కూడా ఎన్నో లాభాలను మీరు దీని వల్ల పొందొచ్చు.

రెగ్యులర్‌గా యోగా:

చాలా మందికి యోగా అంటే ఎంతో భయం. యోగాలో వివిధ భంగిమలు ఉంటాయని వాటిని చేయడం కష్టమని అనుకుంటారు. అయితే యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు. శారీరక వ్యాయామంతో పాటుగా ప్రాణాయామం, బ్రీతింగ్ టెక్నిక్స్ వంటివి కూడా ఉంటాయి. నిజానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మరియు ఆసనాలు మిమ్మల్ని బాగా నిద్ర పోవడానికి సహాయ పడతాయి. అయితే నిజానికి ఈ యోగా గురించి భయ పడే వాళ్ళు ఆ భయాన్ని వదిలేసి దీన్ని ఫాలో అయ్యారంటే మంచి నిద్రను పొందడానికి అవుతుంది. ధ్యాన యోగ, భక్తి యోగ, కర్మ యోగ, జ్ఞాన యోగ లేదా ప్రేమ యోగ ద్వారా మనం మొదలు పెట్టొచ్చు. దైవానికి కనెక్ట్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చు. అలానే ఆనందం కూడా వస్తుంది ఇలా యోగ ద్వారా కూడా చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఒత్తిడి నుండి దూరంగా ఉండొచ్చు. శారీరకంగా మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక మంచి నిద్ర పొందాలనుకునే వాళ్ళు మంచి ఆలోచనల తో ప్రశాంతంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఒత్తిడి నుండి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళు యోగాని కూడా ప్రయత్నం చేసి చూడొచ్చు. దీని ద్వారా చక్కటి లాభాలను పొందవచ్చు.

నిజానికి ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లో పనులు, ఆఫీసు లో పనులు వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడిలో కూరుకుపోవడం వల్ల ఆనందమే ఉండడం లేదు. అలాంటి ఇబ్బందులు ఏమీ కలగకుండా ఉండాలంటే వీటిని అనుసరించటం మంచిది.

నిజాన్ని తెలుసుకోవడం :

రియలైజేషన్ ఆఫ్ ట్రూత్ అనేది ఎంతో ముఖ్యమైనది మనం మన గురించి నిజం తెలుసుకోవాలి అలానే మన ఆత్మ ఇం మోర్టల్ పవర్ ఇటువంటివి తెలుసుకుని ఉండాలి. ఒక సారి నిజంగా మనకి మనం ఏమిటి అనేది తెలిస్తే ఖచ్చితంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది. చూశారు కదా మంచి నిద్రని ఎలా పొందాలి, మంచి మూడ్ ఎలా తీసుకు రావాలి , ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలి, యాంగ్జైటీ ని ఎలా దూరం చేసుకో వచ్చు అనేది. మరి ఈ చిట్కాలు ఫాలో అయ్యి ఆనందంగా ఉండండి అలానే వీటిని అనుసరించడం వల్ల ఒత్తిడి ఉండదు. మంచి నిద్రని కూడా పొందొచ్చు.

చివరగా…

యోగా, మెడిటేషన్, పాజిటివ్ ఆలోచనలు ఇవన్నీ కూడా మనల్ని మంచిగా మారుస్తాయి. చెడు ఆలోచనలు దూరమవ్వడం మొదలు మానసిక ప్రశాంతత వరకు ప్రతి ఒక్కరు పొందడానికి అవుతుంది. కనుక తప్పని సరిగా వీటి కోసం మీ యొక్క సమయాన్ని కేటాయించండి దాంతో ఆనందంగా ఉండడానికి అవుతుంది. అలానే మంచి నిద్రను పొండమే కాక శారీరకంగా మానసికంగా కూడా అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ఈ చిన్న చిన్న మార్పులు మీ యొక్క జీవన విధానంలో మార్చుకుంటే సమస్యలు ఉండవు అందుకని ఎంత బిజీ లైఫ్‌లో ఉన్నా సరే వీటి కోసం కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే అద్భుతమైన మార్పును మీ జీవితంలో చూడొచ్చు.

Also Read : Vitamin C : విటమిన్ సి ఎక్కువైతే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read