how to use spirometer: స్పైరో మీటర్ వాడితే శ్వాస సమస్యలు తగ్గుతాయా.. – what is spirometer and how to use it know here all in telugu

0
10
how to use spirometer: స్పైరో మీటర్ వాడితే శ్వాస సమస్యలు తగ్గుతాయా.. – what is spirometer and how to use it know here all in telugu


ప్రధానాంశాలు:

  • శ్వాస సమస్యలని దూరం చేసే స్పైరోమీటర్
  • స్పైరో మీటర్‌ వాడేందుకు కొన్ని టిప్స్

శ్వాససమస్యలు ఎక్కువ అవ్వడంతో తల్లాడిపోతున్నారు. ఇటువంటి సమయంలో చిన్న చిన్న చిట్కాలను పాటించడం, పరిస్థితి విషమించకుండా మెరుగైన చికిత్స తీసుకోవడం లాంటివి చేయాలి. అదే విధంగా ఇక్కడ నిపుణులు కొన్ని విషయాలు చెప్పారు. ఇలా పాటించినా కూడా మీరు ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది.
telugu samayamనేసల్ వాషెస్ వాడుతున్నారా.. మీకోసమే.
డాక్టర్లు ఈరోజు మన కోసం ఆసక్తికరమైన విషయాలు ఎన్నో పంచుకున్నారు. వాటిని ఈ రోజు మనం చూద్దాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూడండి. దీంతో మీకు తెలియని అనేక విషయాలు తెలుస్తాయి. ఎన్నో సందేహాలు కూడా మీరు ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. 30 నుండి 50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళలో శ్వాస సంబంధిత సమస్యలు మరియు నిమోనియా వస్తున్నాయని డాక్టర్లు కొనుక్కోవడం జరిగింది.

ఊపిరితిత్తుల ఫంక్షన్ సరిగా జరగాలంటే ఆస్పత్రిలో సాధారణంగా స్పైరో మీటర్‌ని ఉపయోగించి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఎలా వుంది అనేది చెక్ చేస్తారు. ఇప్పుడు ఆన్ లైన్‌లో మనకి హ్యాండ్హెల్డ్ ఇన్సెంటివ్ స్పైరో మీటర్స్ దొరుకుతున్నాయి.
telugu samayamపామాయిల్ వాడుతున్నారా.. అయితే మీకోసమే..
వీటిని మనం కొనుగోలు చేసి ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజు ఇన్సెంటివ్ స్పైరో మీటర్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. దీనితో మనకి అవి ఎటువంటి సమయంలో సహాయ పడతాయి అని తెలుస్తాయి.

నిజంగా ఈ విషయాలు అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇవి మనకి ఈ సమయంలో చాలా ఉపయోగకరం. పైగా ప్రతి చిన్న దానికి ఇప్పుడు ఆస్పత్రికి వెళ్లడం కూడా అంత సురక్షితం కాదు. ఇంటి పట్టునే ఉండి మెరుగైన చికిత్స తీసుకోవడం ముఖ్యం. చాలా మంది హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారు.

దీనితో వైరస్ రాకుండా ఉండడానికి బాగుంటుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

స్పైరో మీటర్ అంటే ఏమిటి…?

మొదటిగా ఈ రోజు మనం స్పైరో మీటర్ అంటే ఏమిటో చూద్దాం. ఇది ఒక డివైస్ దీని కారణంగా సమస్య తర్వాత ఊపిరితిత్తులు రికవర్ అవ్వడానికి వీలవుతుంది. శ్వాస ఎలా ఆడుతోంది తీసుకున్న గాలి ఆధారంగా శ్వాస తీసుకోవడం, శ్వాసని వదలడం ద్వారా ఇది కనుక్కుంటుంది దీని వల్ల ఊపిరితిత్తులు ఆక్టివ్‌గా ఉంటాయి మరియు ఫ్లూయిడ్ లేకుండా ఫ్రీ గా ఉంటాయి.

ఇలా స్పైరో మీటర్ ఉపయోగ పడుతుంది. ఒకవేళ ఎవరికైనా సిఓపిడి లేదా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫ్లమేటరీ లాంటివి ఏమైనా ఉన్నా… శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నా ఇది బాగా సహాయ పడుతుంది. దీని కోసం ఇన్సెంటివ్ స్పైరో మీటర్‌ని మనం ఉపయోగించడం జరుగుతుంది.

ఈ స్పైరో మీటర్‌ని ఎలా ఉపయోగించాలి…?

దీని వల్ల కలిగే ఉపయోగం గురించి చూసాము కదా. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలి అది కూడా చూద్దాం. ఇది కూడా మీకు చాలా బాగా సహాయ పడుతుంది కాబట్టి దీని కోసం కూడా మీరు ఒక లుక్ వెయ్యండి.

ముందుగా దీని కోసం మౌత్ పీస్‌ని నోట్లో పెట్టుకోండి. ఇప్పుడు పెదవులు రెండు గట్టిగా మూయాలి. నాలికతో ఎట్టి పరిస్థితిలోనూ మీరు దానిని మూయకండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఇప్పుడు ఇండికేటర్ రైస్ అవుతుంది. ఇప్పుడు గోల్ మార్కర్ ఆధారంగా మీరు శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక వేళ మీరు అంత కంటే ఎక్కువగా శ్వాస తీసుకో లేకపోతే దాన్ని తొలగించి మూడు సెకన్ల పాటు మీ శ్వాసని ఆపండి. ఇలా స్పైరో మీటర్‌ని ఉపయోగించాలి. నిజంగా ఇది చాల మంచిగా పని చేస్తుంది.

ఇంక మీరు స్పైరో మీటర్‌ని ఉపయోగించి నార్మల్ గానే ఉండండి:

డాక్టర్లు చెప్పిన విధంగా మీరు శ్వాస తీసుకుంటూ ఉండండి. మీరు ఒక వేళ కనుక అక్కడ ఉన్నంత హైయెస్ట్ లెవెల్‌కి క్రమంగా మీరు వెళ్తే మీకు సమస్య తగ్గుతోందని అర్థమవుతుంది మీరు తీసుకొని గాలి, వదిలే గాలి ఆధారంగా ఇది లెక్కిస్తుంది. ఈ విధంగా శ్వాసను బట్టి ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయన్నది కనుక్కోవడం జరుగుతుంది.

ఇలా మీరు జాగ్రత్తగా స్పైరో మీటర్‌ని ఉపయోగించవచ్చు ఒకవేళ మీకు అలుపు గా ఉన్నా లేదా శ్వాస స్పైరో మీటర్ ద్వారా తీసుకోవడం కష్టంగా ఉన్నా… మీరు కాసేపు దాన్ని తొలగించి మామూలుగా శ్వాస తీసుకుంటూ ఉండండి అని డాక్టర్లు చెబుతున్నారు.

కనుక మీరు ఈ విధంగా అనుసరించడం మంచిది. దీనితో మీరు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవడం వీలవుతుంది. అదే విధంగా మీరు కావాలంటే స్పైరో మీటర్‌ని కొనుగోలు చేయవచ్చు దీంతో మీరు ఇంట్లో ఉండే ఉపయోగించొచ్చు ఇలా స్పైరో మీటర్ బాగా సహాయ పడుతుంది.
telugu samayamవివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే..

ఇలా మీరు స్పైరో మీటర్ ని ఉపయోగించి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. పైగా ఇందులో చెక్ చేసుకోవడం కూడా చాలా సులువు. మీరు ఏ మాత్రం కష్ట పడక్కర్లేదు సులభంగా దీనిని కొనుగోలు చేసి సులువుగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్పైడర్ మీటర్ పని చేస్తుంది మరియు అనేక ప్రయోజనాలను ఇస్తుంది. కాబట్టి అవసరమైతే ఒక సుపీరో మీటర్‌ని వాడండి అదే విధంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు మంచి డాక్టర్ ని కన్సల్ట్ చేయడం కూడా ముఖ్యమే. ప్రతి ఒక్కరు కూడా బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేసి మంచి డైట్ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి. ఈ మహమ్మారి సమయంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామాలు చేయడం ఉత్తమం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here