Homeతెలుగు Newsఫిట్‌నెస్Hula Hoop Health benefits: రోజూ ఈ రింగ్‌తో ఆడితే.. కొవ్వు ఈజీగా కరుగుతుంది..! -...

Hula Hoop Health benefits: రోజూ ఈ రింగ్‌తో ఆడితే.. కొవ్వు ఈజీగా కరుగుతుంది..! – know the health benefits of hula hoop daily

Hula Hoop Health benefits: మనం హెల్తీగా, యాక్టివ్‌గా ఉండాలంటే.. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. కొంతమంది హెల్తీ డైట్‌ తీసుకుంటారు తప్ప, ఎక్స్‌అర్‌సైజ్ చేయడానికి అంత ఇంట్రస్ట్‌ చూపించరు. కానీ, మనం తీసుకున్న ఆహారానికి తగ్గట్టు వ్యాయామం చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. చాలామందికి ఉదయం లేచి జిమ్‌కు, వాకింగ్‌ వెళ్లాలంటే ఎక్కడలేని బద్ధకం వస్తుంది. అసలే శీతాకాలం ఈ చలిలో బయటకు వెళ్లడం ఇంకా కష్టం. ఇలాంటి వారు చక్కగా ఆడుకున్నట్లుగా చేయగలిగే ఫిట్‌నెస్‌ ఎక్విప్మెంట్‌ హులాహూప్‌. హులాహుప్‌ చేయడం సరదాగా ఉండటమే కాదు.. శారీరక శ్రమనూ ఇస్తుంది. హూలాహుప్‌ చేస్తే.. పెద్దపెద్ద సాధానాలు లేకుండా.. ఇంట్లోనే‌ వర్క‌వుట్‌ పూర్తవుతుంది. ప్రతి రోజూ హులాహూప్‌ చేస్తే బరువు తగ్గడంతో పాటు.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

గుండెకు మంచిది..

హులాహుప్‌ మంచి కార్డియో ఎక్సర్‌సైజ్‌‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. రోజు హులాహుప్‌ ప్రాక్టిస్‌ చేస్తే.. గుండె, ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపడుతుంది. దీనివల్ల గుండెజబ్బులు, డయాబెటిక్స్, కొలెస్ట్రాల్‌ పెరుగుదల వంటి సమస్యలు ముప్పు తగ్గుతుంది. హూలాహూప్‌ని ఉపయోగించి 8 నిమిషాల పాటు వర్కవుట్ చేస్తే కార్డియో ఎక్సర్‌సైజ్‌కి సమానమని నిపుణులు అంటున్నారు. హూప్‌ వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

కొవ్వు కరుగుతుంది..

మన శరీరంలో నడుమూ, పిరుదుల భాగంలో ఫ్యాట్‌ ఎక్కువగా పేరుకుంటుంది. ఈ కొవ్వును తగ్గించడానికి చాలా కష్టపడతాం. హులాహుప్‌ రోజూ చేస్తే.. ఇక్కడి కొవ్వు ఫాస్ట్‌గా కరుగుతుంది. ఒక గంటపాటు హూలాహూప్‌ని తిప్పడం ద్వారా దాదాపు 400 క్యాలరీలు కరిగే అవకాశం ఉంది. ఈ రింగ్‌ తిప్పే స్పీడ్‌ బట్టి క్యాలరీ లాస్‌ ఆధారపడి ఉంటుంది.

కండరాలు స్ట్రాంగ్‌ అవుతాయి..

హూలాహూప్‌ చేస్తే‌.. కండరాలు స్ట్రాంగ్‌ అవుతాయి. ముఖ్యంగా హార్ట్‌ మజిల్స్‌కు ఈ వర్కవుట్‌ చాలా మంచిది. హులూహుప్‌ చేయడం వల్ల స్పైయినల్‌ కాడ్‌ కూడా స్ట్రాంగ్‌ అవుతుంది. వెన్ను సమస్యలు దూరం అవుతాయి.

హ్యాపీగా ఉంటారు..

హూలాహూప్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మనం సంతోషంగా ఉండటానికి సహాయపడతాయి. హూలాహుప్‌ చేస్తే మీ హ్యాపీగా ఉంటారు, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. హూలాహూప్‌ వల్ల మన ఒంట్లో స్టామినా పెరుగుతుంది. బద్ధకం పోతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read