Homeతెలుగు Newsఆరోగ్యంhypertension controlling tips: Hypertension : టమాట తింటే బీపి కంట్రోల్ అవుతుందా.. - effect...

hypertension controlling tips: Hypertension : టమాట తింటే బీపి కంట్రోల్ అవుతుందా.. – effect of tomato nutrient complex on hyper tension know here


వయసుతో సంబంధం లేకుండా నేడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అలాంటి వాటిలో ఒకేట హై బ్లడ్ ప్రెజర్. ఇవే కారణాలు అని ఈ సమస్యకి వేటిని ప్రత్యేకంగా చెప్పలేం కానీ, చాలా కారణాల వల్ల ఈ సమస్య మనల్ని చుట్టుముడుతుంది. అలాంటప్పుడు దీనిని రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకుంటే.. ఇది ఒక్కసారి మన శరీరంలోకి వచ్చి చేరిన తర్వాత దీనికి తోడుగా మరిన్నీ ఆరోగ్య సమస్యలు వచ్చి చేరతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఒక్కోసారి పరిస్థితి మన అదుపులో ఉండక సమస్య వచ్చి చేరుతుంది. అలాంటప్పుడు కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఉప్పుని తగ్గించాలని చెప్పాలని, అదే విధంగా స్పైసీ, ఆయిలీ ఫుడ్‌ తగ్గించాలని చెబుతున్నారు డా. ప్రణీత్. ఈయన హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్‌గా చేస్తున్నారు.

టమాట తింటే..

అదే విధంగా.. ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టమాటా తింటే బీపి తగ్గుతుందనేది ఒకటి. ఇది నిజమేనా అని ఆరా తీస్తే సగం నిజం ఉందని చెబుతున్నారు డా.ప్రణీత్ ఎందుకంటే బీపి పేషెంట్స్‌కి పొటాషియం రిచ్ ఫుడ్స్ హెల్ప్ చేస్తుందని ఆయన అంటున్నారు. అందుకే పొటాషియం కలిగిన టమాట బీపి పేషెంట్స్‌కి మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే, ఇది బీపి మాములుగా కాకుండా కాస్తా ఎక్కువగా ఉన్నవారికే. మరి హైబీపి ఉన్నవారికి ఎన్ని టమాటాలు తిన్నా ఫలితం కొద్దిగా మాత్రమే ఉంటుంది. అదే విధంగా కేవలం టమాటా మాత్రమే తిని మిగతా విషయాలు పట్టించుకోకుండా ఉండి బీపి కంట్రోల్ అవుతుందనుకోవడం కూడా కరెక్ట్ కాదని, ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుని హెల్దీ లైఫ్‌స్టైల్, మంచి నిద్ర, సరైన వ్యాయామం, చక్కని డైట్ పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి చిట్కాలు పాటిస్తేనే ఫలితం ఉంటుందని డా. ప్రణీత్ చెబుతున్నారు.

బీపి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అందుకే హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే ముందునుంచి సరైన జీవన విధానం పాటించడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హైపర్ టెన్షన్ సమస్య ఉన్నప్పుడు రక్తనాళాల పై ఒత్తిడి పడుతుంది. బ్లడ్ పంప్ చేసే క్రమం లో ఈ ఒత్తిడి కలుగుతుంది దీంతో గుండె జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. హైపర్ టెన్షన్ సమస్య తో బాధపడే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం. హఠాత్తుగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లి తగిన చికిత్స చేయించుకుంటూ ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఒక బిలియన్ మంది ఈ సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. యుఎస్ లో అయితే ప్రతి ముగ్గురి లో ఒకరు హైబీపీ తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది బీపీ తో సతమతమవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడడం చాలా అవసరం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds