Induvadana Teaser: రొమాంటిక్ సన్నివేశాల నడుమ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. రెచ్చిపోయిన హీరోహీరోయిన్స్

0
17
Induvadana Teaser: రొమాంటిక్ సన్నివేశాల నడుమ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. రెచ్చిపోయిన హీరోహీరోయిన్స్



photo 85032850

యంగ్ హీరో కొత్త సినిమా ” టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ అంచనాలు నెలకొల్పగా, వాటిని రెట్టింపు చేసేలా టీజర్ కట్ చేసి వదిలారు. ఒక నిమిషం 12 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో హీరోహీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్ అయ్యాయి. లవ్ కమ్ థిల్లర్ జానర్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు తెలిపారు మేకర్స్.

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య, సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో MSR దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకానొక సమయంలో వెండితెరపై ఆకట్టుకొని చాలా ఏళ్ళ తర్వాత ఈ ‘ఇందువదన’ సినిమాతో రీ- ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్.. మూవీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట.

ఇటీవల ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఇందు’ పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ పోస్టర్ చాలా కళాత్మకంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షించింది. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఎక్స్‌పోజింగ్ డోస్ పెంచేసి చాలా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఇప్పటిదాకా విడుదలైన అప్‌డేట్స్ చెబుతున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్ ‘వాసు’ పాత్రలో వరుణ్ నటన ఇందులో హైలైట్ కానుందని సమాచారం. అతి త్వరలో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here