Monday, November 29, 2021
Homeతెలుగు NewsసినిమాJohan Abraham : అంద‌రూ చూస్తుండ‌గా క‌న్నీళ్లు పెట్టుకున్న జాన్ అబ్ర‌హం.. షాకైన అమితాబ్

Johan Abraham : అంద‌రూ చూస్తుండ‌గా క‌న్నీళ్లు పెట్టుకున్న జాన్ అబ్ర‌హం.. షాకైన అమితాబ్



photo 87927193

మనమెంతో అభిమానించే మన స్టార్ హీరోలు కెమెరా ముందు ధైర్యంగా ఉంటారు. కెమెరా ముందు విలన్స్ ఎముక‌లు విర‌గ్గొడ‌తారు. ఎన్ని క‌ష్టాలు ఎదురైనా కంట నీరు రానీయ‌రు. కానీ రియ‌ల్ లైఫ్ అందుకు పూర్తి భిన్న‌మైన‌ది. వారు ఆస్థాయికి రావ‌డానికి ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను ఫేస్ చేస్తారు. కొంద‌రు తామెదుర్కున్న క‌ష్టాల‌ను బ‌య‌ట‌కు చెప్పుకుంటారు. కొంద‌రు వాటిని చెప్పుకోరంతే. ప్ర‌తి దానికి ఓ హ‌ద్దు ఉంటుంది. దాన్నిదాటిన‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తి బ‌ర‌స్ట్ అవుతాడు. అది స్టార్ అయినా, సాధార‌ణ వ్య‌క్తికైనా ఒక‌టే. అంద‌రికీ ఎమోష‌న్స్ ఉంటాయి. దీనికి నేనేం అతీతుడ్ని కాన‌ని అన్నారు బాలీవుడ్ స్టార్ జాన్ అబ్ర‌హం. రీసెంట్‌గా ఈయ‌న అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి సీజ‌న్ 13లో పాల్గొన్నారు. స‌త్య‌మేవ జ‌య‌తే 2 సినిమా న‌వంబ‌ర్ 25న విడుద‌లైంది. ఈ మూవీ రిలీజ్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కేబీసీ 13 సెల‌బ్రిటీ షోలో జాన్ అబ్ర‌హం హీరోయిన్ దివ్యా ఖోస్లా కుమార్‌తో క‌లిసి పాల్గొన్నారు.

ఇందులో ఆయ‌న చేతిపై బాస్కెట్ బాల్‌ను తిప్ప‌డం వంటి ప‌నులు చేసి అమితాబ్‌ను ఆశ‌ర్య‌ప‌రిచారు. అలాగే త‌న సిక్స్‌ ప్యాక్ దేహాన్ని కూడా ఓపెన్‌గా అంద‌రి ముందు చూపించారు. అంద‌రూ గ‌ట్టిగా అరిచిన‌ప్పుడు అంద‌రూ అమ్మాయిలే అరుస్తున్నారు అంటూ అమితాబ్ చ‌మ‌త్క‌రించారు. అలాగే ధూమ్ సినిమా స‌మ‌యంలో బైక్ వేసుకుని అమితాబ్ ఇంటికి వెళ్లిప్పుడు.. ఈ బైక్ విష‌యాల్లో అభిషేక్‌ను ఎంక‌రేజ్ చేయ‌కు అంటూ అమితాబ్ జాన్ అబ్ర‌హంతో చెబుతున్న స‌మ‌యంలో అభిషేక్ కింద‌కు వచ్చి బైక్ చాలా బావుంద‌న‌డం, అప్పుడు అమితాబ్ మాట మార్చేయ‌డం .. వంటి విష‌యాల‌ను జాన్ అబ్ర‌హం అమితాబ్‌కు గుర్తు చేయ‌గా ఆయ‌న న‌వ్వుకున్నారు. త‌ర్వాత ఏదో విష‌యాన్ని చెబుతున్న స‌మ‌యంలో జాన్ అబ్ర‌హం స్టేజ్‌పై క‌న్నీళ్లు పెట్టుకున్నారు. అస‌లు జాన్ అబ్ర‌హం ఎందుకు క‌న్నీళ్లు పెట్టుకున్నార‌నే సంగ‌తి తెలియాలంటే శుక్ర‌వారం రాత్రి ప్ర‌సార‌మ‌య్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ‘’ నవంబర్ 25న విడుదలైంది. సమస్యలపై పోరాడే రైతు కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు. దివ్యా ఖోస్లా కుమార్ హీరోయిన్‌గా నటించింది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

வில்லனுக்கு ‘தனுஷ்கோடி’ எனப் பெயர் வைத்தது ஏன்? – வெங்கட் பிரபு சுவாரஸ்ய பதில் | Venkat...

‘மாநாடு’ படத்தில் ‘தனுஷ்கோடி’ என்று பெயர் வைத்ததற்கான காரணம் குறித்து இயக்குநர் வெங்கட் பிரபு விளக்கம் அளித்துள்ளார். வெங்கட் பிரபு இயக்கத்தில் சிலம்பரசன் நடிப்பில் வெளியாகியுள்ள படம் 'மாநாடு'. இதில் எஸ்.ஏ.சி,...