Homeతెలుగు NewsసినిమాJr Ntr: టీడీపీ Vs ఎన్టీఆర్ వార్: ఎంటరైన బాలకృష్ణ చిన్నల్లుడు.. అదే కరెక్ట్ అంటూ...

Jr Ntr: టీడీపీ Vs ఎన్టీఆర్ వార్: ఎంటరైన బాలకృష్ణ చిన్నల్లుడు.. అదే కరెక్ట్ అంటూ షాకింగ్ కామెంట్స్ – tdp vs ntr issue: balakrishna son in law bharath comments on jr ntr


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాని సందర్భమే ఉండదు. సినిమా హీరోగా రాణిస్తున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ అధికారపక్షం, ప్రతిపక్షం ఇలా ఎక్కడోచోట ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా చంద్రబాబు విషయంలో జరిగిన ఇష్యూలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన అనేది మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ ఇష్యూలోకి బాలయ్య బాబు చిన్నల్లుడు భరత్ ఎంటరై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణి, స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు.. ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వెక్కివెక్కి ఏడ్చిన ఘటన పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే ఈ ఇష్యూపై పలువురు టీడీపీ నేతలు ఎన్టీఆర్ స్పందించాలని కోరడంతో ఆయన రియాక్ట్ అయ్యారు.

రాజకీయాల్లో విమర్శలు అర్థవంతంగా ఉండాలే తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదని.. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం మన సంస్కృతి కాదని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశారు ఎన్టీఆర్. అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ ఇలా స్పందించారో అప్పటినుంచి సీన్ మారిపోయింది. టీడీపీ Vs ఎన్టీఆర్ వార్ అన్నట్లుగా ఇష్యూ డైవర్ట్ అయింది. టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఎన్టీఆర్ మాటలను తప్పుబట్టారు. ఎన్టీఆర్ పిరికి ధోరణిలో మాట్లాడారని, సింహంలా గర్జిస్తాడనుకుంటే చాగంటి కోటేశ్వరరావులా ప్రవచనాలు పలికారంటూ కామెంట్స్ చేశారు.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. పక్కాగా స్కెచ్చేసి రంగంలోకి దూకుతున్న సుకుమార్
మరోవైపు ఇంకొందరు టీడీపీ నేతలు కూడా ఎన్టీఆర్ రియాక్షన్‌ని తప్పుబట్టారు. దీంతో నెట్టింట టీడీపీ Vs ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ ముదిరింది. ఈ నేపథ్యంలో ఎంటరైన బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. ఎన్టీఆర్‌ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఒకరకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ చాలా పరిణతితో కూడిన వాదన వినిపించారని, ఆయన స్పందించిన విధానం పూర్తిగా స్వాగతించ దగినదని పేర్కొన్నారు. దీని గురించి చర్చించడం సరికాదని చెబుతూ ఈ ఘటనపై స్పందించినందుకు జూనియర్ ఎన్టీఆర్‌‌ను అభినందించాలని భరత్ అన్నారు.



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read