Thursday, December 2, 2021
Homeతెలుగు NewsసినిమాJr Ntr: Samantha: ఎన్టీఆర్‌పై సమంత సీరియస్.. విడాకుల తర్వాత తొలిసారి ఇలా..! ఆ కోపానికి...

Jr Ntr: Samantha: ఎన్టీఆర్‌పై సమంత సీరియస్.. విడాకుల తర్వాత తొలిసారి ఇలా..! ఆ కోపానికి అసలు కారణమిదే.. – evaru meelo koteeswarulu: samantha serious comments on jr ntr


గత కొన్ని నెలలుగా సమంతకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని కుటుంబంతో సామ్ తెగదెంపులకు కారణాలు మొదలుకొని ఇకపై ఆమె నివాసం, భరణం, ప్రెగ్నన్సీ ఇలా ఎన్నో విషయాలపై చర్చలు నడుస్తున్నాయి. దీనిపై సమంత పూర్తి వివరణ ఇవ్వలేదు గానీ.. జనాల్లో హాట్ టాపిక్ అవుతున్న విషయాల్లో వాస్తవాలు లేవన్నట్లుగా హింట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో విడాకుల ప్రకటన తర్వాత తొలిసారి కెమెరా ముందుకొచ్చిన సమంత.. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై సీరియస్ కావడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు‘ ప్రోగ్రాం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ టీఆర్ఫీ సాధిస్తూ దూసుకుపోతున్న ఈ షోలో అప్పుడుడప్పుడు సెలబ్రిటీలు తళుక్కున మెరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హాట్ సీట్లో కూర్చుంది సమంత. ఎన్టీఆర్ అడిగే ప్రశ్నలకు జవాబులిస్తూ తన అభిమానులను ఫిదా చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వీడియో రిలీజ్ చేయగా.. అందులో ఎన్టీఆర్‌తో సమంత మాట్లాడిన తీరు పలువురిని అట్రాక్ట్ చేస్తోంది.
telugu samayamMahesh Babu: ట్విస్ట్ అంటే ఇదే.. తొలిసారి మహేష్ బాబు అలా! వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్
ఇక్కడ కూర్చుంటే భయంగా ఉంది అని సమంత చెప్పడం.. అది హాట్ సీట్ కాబట్టి అలాగే ఉంటుందని తారక్ బదులివ్వడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇక డబ్బు విషయంలో.. నాకు డబ్బు వద్దులే అని ఒకసారి.. లేదు లేదు కావాలి అని మరోసారి సమంత అనడం హైలైట్ అవుతోంది. క్విట్ అయిపోతారా అని ఎన్టీఆర్ అడగడం.. దానికి అసహనంతో ”మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా” అంటూ ఎన్టీఆర్‌పై సమంత కోపం ప్రదర్శించడం చూపిస్తూ ఈ వీడియో ఎండ్ చేశారు. అయితే విడాకుల తర్వాత తొలిసారి సమంత ఇలా కనిపించడంతో ఈ వీడియో యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Google is testing a new location for the Google App’s search bar

The Google app comes pre-installed on every Android device out there. So, if you’re using an Android phone, there’s a good chance you...