Monday, November 29, 2021
Homeతెలుగు NewsసినిమాKajal Aggarwal: గర్భం దాల్చిన కాజల్! అందుకే అలా నిర్ణయం తీసుకుందంటూ జోరుగా చర్చలు.. ఇదీ...

Kajal Aggarwal: గర్భం దాల్చిన కాజల్! అందుకే అలా నిర్ణయం తీసుకుందంటూ జోరుగా చర్చలు.. ఇదీ మ్యాటర్ – kajal aggarwal pregnancy news viral on social media


సినీ పరిశ్రమలో ఉన్న హీరోహీరోయిన్స్ విషయంలో గాసిప్స్ పుట్టుకురావడం కామన్. మరీ ముఖ్యంగా యంగ్ హీరో హీరోయిన్స్ వ్యక్తిగత విషయాల్లో ఓ రేంజ్ పుకార్లు పుట్టుకొస్తుంటాయి. ఏ చిన్న హింట్ దొరికినా వాళ్ళను అస్సలు వదిలిపెట్టరు గాసిప్ రాయుళ్లు. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న కాజల్ గర్భం దాల్చిందంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

ఇటీవల తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన కాజల్.. మ్యారేజ్ చేసుకున్నాక కూడా కెరీర్ పరంగా దూసుకుపోతోంది. భర్త అంగీకారంతో ఇప్పటికే కమిటైన సినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. నాగార్జునతో మరో సినిమా ఓకే చేసిందని విన్నాం. నాగ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ది ఘోస్ట్’ అనే సినిమాలో కాజల్‌ని హీరోయిన్‌గా తీసుకోగా ఉన్నట్టుండి ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందని తెలుస్తోంది.
telugu samayamఅదే జరిగితే పవన్ కళ్యాణ్‌కి గుడి కడతా.. అప్పుడు మీ ముందు జగన్! భగ్గుమన్న పోసాని కృష్ణమురళి
ఈ సినిమాలో కాజల్‌ రా ఏజెంట్‌గా కనిపించనుందని, ఈ క్యారెక్టర్ కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుందని అంతకుముందు వార్తలు రాగా.. ఉన్నట్టుండి ఇలా తప్పుకోవడం వెనుక రీజన్ ఏంటనే అన్వేషణ మొదలైంది. ఈ నేపథ్యంలోనే కాజల్ గర్భం దాల్చిందని, అందుకే అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చిందనే టాక్ మొదలైంది. దీంతో ఇండస్ట్రీలో ఈ రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ‘ది ఘోస్ట్’ మూవీలో కాజల్ స్థానంలో ఇలియానా లేదా త్రిషని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds