Home తెలుగు News ఆరోగ్యం Krishna Tulasi Benefits: కృష్ణ తులసి ఆకులతో.. ఈ అనారోగ్యాలు మాయం అవుతాయి..! – know the health benefits of having krishna tulasi leaves and its medical values

Krishna Tulasi Benefits: కృష్ణ తులసి ఆకులతో.. ఈ అనారోగ్యాలు మాయం అవుతాయి..! – know the health benefits of having krishna tulasi leaves and its medical values

0
Krishna Tulasi Benefits: కృష్ణ తులసి ఆకులతో.. ఈ అనారోగ్యాలు మాయం అవుతాయి..! – know the health benefits of having krishna tulasi leaves and its medical values

Krishna Tulasi Benefits: భారతీయ జీవనశైలిలో తులసి మొక్క ఒక భాగం. దాదాపు అందరి ఇళ్లల్లోనూ తులసి మొక్క ఉంటుంది. తులసిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తూ ఉంటారు. ఇక ఆయుర్వేదంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఆనేక వ్యాధులను నయం చేయడానికి తులసిని వాడుతూ ఉంటారు. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. అందుకే దీన్ని ‘క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్‌స్‌’ అంటారు. దీనిలో ‘ఎ, సి’ విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, క్లోరోఫిల్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని చాలా మందికి తెలుసు. మరి మీరూ కృష్ణ తులసి గురించి ఎప్పుడైనా విన్నారా? తులసిలో చాలా రకాలు ఉంటాయి, వాటిలో కృష్ణ తులసి ఒకటి. దీని ఆకుల నుంచి మూలాల వరకు అద్భతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద డాక్టర్‌ రేఖ అన్నారు. కృష్ణ తులసి మనస్సు, శరీరానికి టానిక్‌లా పనిచేస్తుంద్నారు. కృష్ణ తులసిని తీసుకుంటే.. అనేక అనారోగ్యాలు దూరం అవుతాయని డాక్టర్‌ రేఖ సూచించారు.

కృష్ణ తులసి

ఎలా గుర్తించాలి..

కృష్ణ తులసిని.. అనేక ప్రాంతాల్లో శ్యామ తులసి అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే దీని రంగు కృష్ణుడు మాదిరిగా ఉంటుంది అంటే ఊదా (purple) కలర్‌లో ఉంటాయి. కృష్ణ తులసి ఆకులు, కాండం, గింజలు కూడా ఊదా రంగులో ఉంటాయి. కృష్ణ తులసిని ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో వినియోగిస్తూ ఉంటారు. దీని ఆకులతో పాటు గింజలు, వేరులో కూడా అద్భుతమైన ఔషధగుణాలు ఉన్నాయి.

డయాబెటిస్‌కు చెక్..

కృష్ణ తులసి టైప్ 2 డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ చికిత్సలో సహాయపడుతుంది. హెల్త్‌లైన్ ప్రకారం, కృష్ణ తులసి ఆకులు తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు.. తరచు కృష్ణ తులసి ఆకులు తింటే.. మధుమేహం వచ్చే ముప్పు తొలగిపోతుంది.

కొలెస్ట్రాల్‌ కరుగుతుంది..

హెల్త్‌లైన్ ప్రకారంహెల్త్‌లైన్ ప్రకారం, కృష్ణతులసి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ కరుగుతుందని జంతువులపై చేసిన అధ్యయనంలో తేలింది. చెడు కొలెస్ట్రాల్‌ కారణంగా హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు, స్ట్రోక్‌ ముప్పు పెరుగుతుంది. ప్రతి రోజూ ఉదయం రెండు కృష్ణ తులసి ఆకులు నమిలితే.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

స్ట్రెస్‌ మాయం అవుతుంది..

ఈ రోజుల్లో స్ట్రెస్‌ పెద్ద సమస్యగా మారింది. బీజీలైఫ్‌ స్టైల్‌ కారణంగా చాలా మంది స్ట్రెస్‌తో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి కృష్ణ తులసి మంచి ఔషధంలా పనిచేస్తుంది. దీని ఆకుల్లో అడాప్టోజెన్‌లు ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి. రోజు కృష్ణ తులసి ఆకులు నమిలితే.. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. తులసిలోని ఔషధ గుణాలు ఒత్తిడిని తగ్గిస్తాయి.

దగ్గుకు మందులా పని చేస్తుంది..

శీతాకాలం జలుబు, దగ్గు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. మీకు పొడి దగ్గు, శ్లేష్మంతో దగ్గు ఉంటే కృష్ణ తులసితే దగ్గు సిరప్‌ తయారు చేసుకోవచ్చని ఆయుర్వేద డాక్టర్‌ రేఖ చెప్పారు. ఈ సిరప్‌ జలుబు, దగ్గుకు ఔషధంలా పనిచేస్తుంది. ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది.

ఎలా చేసుకోవాలి..?

ముందు 2,3 కృష్ణ తులసి ఆకుల నుంచి రసం తీసుకోండి. తర్వాత దానికి 2 టీస్పూన్ల తేనె, చిటికెడు పసుపు, పావు చిటికెడు నల్ల మిరయాల పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు రెండు టీస్పూన్ల చొప్పున తీసుకోండి.

ఈ లాభాలు ఉంటాయి..

  • కృష్ణ తులసి ఆకులు బ్రాంకైటిస్‌ను నయం చేస్తాయి.
  • మలేరియా జ్వరాన్ని తగ్గిస్తాయి.
  • ఎగ్జిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సలో వీటిని వాడతారు.
  • కంటి సమస్యలు, కడుపులో పుండ్లను నయం చేస్తుంది.
  • అతిసారం, వికారం, వాంతులకు గొప్ప ఔషధంలా పనిచేస్తుంది.
  • కృష్ణ తులసిని తీసుకోవడం వల్ల శరీరం డీటాక్స్‌ అవుతుంది.
  • కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
  • జీర్ణక్రియకు మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here