Monday, July 26, 2021
Homeతెలుగు NewsసినిమాManchu Vishnu: ఊచలు లెక్కపెట్టాల్సిన ఎంతో మంది మా వాళ్లే బయటున్నారు: మంచు విష్ణు -...

Manchu Vishnu: ఊచలు లెక్కపెట్టాల్సిన ఎంతో మంది మా వాళ్లే బయటున్నారు: మంచు విష్ణు – i have helped so many people to rescue from police station


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై ఎక్కడ చూసిన చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికలు మంచి వేడి మీద ఉన్నాయి. అధ్యక్ష బరిలో ఓవైపు ప్రకాష్ రాజ్, మరోవైపు మంచు విష్ణు పోటీ చేయడం.. వీరితో పాటు జీవితా రాజశేఖర్‌, హేమా, సీవీఎల్‌ నరసింహారావు కూడా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. పోలింగ్ జరగడానికి ఇంకా రెండు నెలల వ్యవధి ఉన్నప్పటికీ.. అభ్యర్థులు మాత్రం ఇప్పటికే ప్రచారం వేగవంతం చేశారు. ఎవరికి తోచిన స్టైల్‌లో వాళ్లు ఓటర్లను ఆకర్షించేలా పావులు కదుపుతున్నారు.

ప్రకాష్ రాజ్ కొద్ది రోజుల క్రితం తన మద్దతు దారులతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన ఎజెండాను ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కి ఈ విషయంపై ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేవలం ‘మా’ బిల్డింగ్ మాత్రమే తన ఎజెండా కాదని.. ఇక్కడ ఇంాకా చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించడం కూడా తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ‘మా’ బిల్డింగ్ కోసం సాయం చేసేందుకు ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణకి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. బాలకృష్ణ తన తండ్రి సమానుడు అని అలాంటి వ్యక్తి చెప్పిన పనిని తప్పకుండా చేస్తానని ఆయన అన్నారు.

ఇక కరోనా వచ్చిన సమయంలో ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు నరేష్ సినీ కార్మికులకు ఎంతో సహాయం చేశారని విష్ణు పేర్కొన్నారు. కష్ట సమయంలో సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని.. కానీ, దాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని విష్ణు పేర్కొన్నారు. ఎవరైనా ఎదుటి వాళ్లకి ఆదర్శంగా ఉండాలి అని.. మనల్ని నమ్ముకున్న వాళ్లకి ఎలా అండగా ఉండాలి అనేదే తన ఎజెండా అని ఆయన అన్నారు.

ఇక ఇండస్ట్రీలో పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కపెట్టాల్సిన చాలా మంది తాను చేసిన సాయం వల్లే ఇప్పుడు బయట తిరుగుతున్నారని విష్ణు స్పష్టం చేశారు. ‘ఇండస్ట్రీలో ఎంతమంది సహాయం చేశాను అనే విషయాన్ని నేను చెప్పును. కొంతమంది ఊచలు లెక్కపెట్టకుండా ఉన్నారు అంటే ఎవరివల్లా అనే ప్రశ్న వాళ్లనే అడగాలి. అండర్‌వేర్లతో పోలీస్ స్టేషన్‌లో కూర్చొబెడితే.. తెల్లారి 4.30 గంటలకు వెళ్లి సర్ది చెప్పి బయటకు తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్లు కొంచం శృతి మించారంటే.. వాళ్ల పేర్లు బయటపెట్టాల్సి వస్తుంది’ అంటూ మంచు విష్ణు పేర్కొన్నారు.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

ஓலா எலெக்ட்ரிக் ஸ்கூட்டர் பற்றிய முக்கிய தகவல் வெளியானது… என்னனு தெரிஞ்சா உடனே புக் பண்ணீருவீங்க!

<!----> இந்திய வாடிக்கையாளர்கள் மத்தியில் பெரும் எதிர்பார்ப்பை ஏற்படுத்தியுள்ள ஓலா எலெக்ட்ரிக் ஸ்கூட்டர் விற்பனைக்கு அறிமுகம் செய்யப்படும் தேதி குறித்த அதிகாரப்பூர்வ தகவல் இன்னும் வெளியாகவில்லை. ஆனால்...

Today's news

Latest offer's