Homeతెలుగు Newsసినిమాmanchu vishnu: Vishnu Manchu: నేనేంటో నిరూపిస్తా.. రాజీనామాలు చేసినా షో విల్ ఆన్‌: విష్ణు...

manchu vishnu: Vishnu Manchu: నేనేంటో నిరూపిస్తా.. రాజీనామాలు చేసినా షో విల్ ఆన్‌: విష్ణు మంచు – vishnu manchu speech in maa oath taking ceremony


ప్రధానాంశాలు:

  • ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
  • అందరి సలహాలు తీసుకుంటానన్న విష్ణు
  • సంక్షేమ కార్యక్రమాల వివరాలను కూడా తెలియజేస్తానన్న విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(‘మా’) అధ్యక్షుడిగా విష్ణు మంచు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుక‌కి తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విష్ణు మంచు అండ్ టీమ్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున త‌మ వంతు స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ‘‘మోహ‌న్‌బాబుగారి అబ్బాయి అని న‌న్ను ఓటు వేసి గెలిపించారు. ఆ న‌మ్మ‌కాన్ని నేను నిల‌బెట్టుకుంటాను. ఈ రెండేళ్ల‌లో నేనేంటో నిరూపిస్తాను. గెలుపు త‌ర్వాత అంద‌రూ నాకు ఫోన్ చేసి అభినందించారు. వారంద‌రికీ థాంక్స్‌.

గేమ్ అన్నాక.. రెండు టీమ్స్ ఆడితే ఒక‌రు గెలుస్తారు. మ‌రొక‌రు ర‌న్న‌ర‌ప్‌గా నిలుస్తారు. ఈ ఆట‌లో మేం గెలిచాం. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన మా ఆపోజిట్ టీమ్ స‌భ్యుల స‌ల‌హాలు కూడా తీసుకుని మా అబివృద్ధికి పాటు ప‌డ‌తాను. కొంద‌రు రిజైన్ చేశారు. అది దుర‌దృష్ట‌క‌రం. అయితే షో విల్ గో ఆన్‌.. ఉయ్ విల్ గో ఆన్‌. మా అసోసియేష‌న్ ఇంకా స్ట్రాంగ్‌గా త‌యార‌వుతుంది. మీ అంద‌రి ఆశీస్సులు కావాలి. భ‌విష్య‌త్తులో నేను కానీ, నా టీమ్ కానీ.. మా గురించి ఛానెల్స్‌కు వెళ్లం. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే ప‌ని గురించే మాట్లాడుతాను. అయిపోయిన విష‌యం గురించి మాట్లాడ‌ను. మేం చేసే ప్ర‌తి ప‌నికి సంబంధించిన స‌మాచారాన్ని క్లియ‌ర్‌గా అందిస్తాం. మీ ఆశీర్వాదాలు మాకు కావాలి’’ అన్నారు.

విష్ణుకి మా క్ర‌మ శిక్ష‌ణా సంఘం ఛైర్మ‌న్ కృష్ణంరాజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ నుంచి మోహ‌న్‌లాల్ కూడా అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ వీడియో విడుద‌ల చేశారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మా మాజీ అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేశ్‌.. విష్ణుకి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు అన్న‌య్య‌లా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని తెలిపారు.



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read