Homeతెలుగు Newsఆరోగ్యంmental benefits of cooking: Cooking Benefits : వంట ఇలా చేస్తే చాలా మంచిదట.....

mental benefits of cooking: Cooking Benefits : వంట ఇలా చేస్తే చాలా మంచిదట.. – health and surprising benefits of cooking at home know here all


ప్రస్తుత జీవన విధానం మారడంతో ఇంట్లో మగవాళ్లు కాదు కదా ఆడవాళ్లు కూడా వంట చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. వంట చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇక వంటింటికే పరిమితం అవుతారు. మీ మనసు ఖరాబు అయినప్పుడు ఓ సారి వంటింట్లోకి వెళ్లి కూరగాయలు తరిగి నచ్చిన వంటను మహారుచిగా చేసి ఆనందంగా ఆరగిస్తే.. ఎంతటి ఒత్తిడి అయినా ఎగిరిపోతుందని అమెరికాలోని ఎడిత్‌ కోవాన్‌ యూనివర్సిటీ (ఈసీయూ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
Weight Loss : పరగడుపునే ఈ డ్రింక్ తాగితే బరువు తగ్గుతారట..
ఒక్కసారి కిచెన్‌లోకి అడుగుపెడితే.. ఎంతటి ఒత్తిడి అయినా పటాపంచలై పోవాల్సిందేనని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. స్వయంగా వంట చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 2016 నుంచి 2018 మధ్య 657 మందిపై ఆరునెలల పాటు ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వంట చేయడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని, చేయాల్సిన పనిపై శ్రద్ధ పెరుగుతుందని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అబ్బుతాయని, మొత్తంగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తమ పరిశోధనలో తేలినట్లు సైంటిస్టులు స్పష్టం చేశారు. కోపాన్ని, బాధలను మర్చిపోయేందుకు వంటిల్లు సరైన చోటు అని వాళ్లు సూచిస్తున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఊబకాయం, అధిక బరువు కలిగిన వారు కూడా ఉన్నారు. వాళ్లు కూడా వంట చేయడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధనలో స్పష్టమైంది.

అయితే వంట చేయడం అత్యంత లింగభేదంతో కూడుకున్న పని అని కూడా అధ్యయనం వెల్లడించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో తొలుత 77 శాతం మంది ఆడవాళ్లు మాత్రమే పాల్గొనేవారు అని.. వాళ్లు తమ వంట పట్ల విశ్వాసంతో ఉండేవాళ్లు అని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే వంట చేయడంలో పురుషులు 23 శాతం మాత్రమే ఉన్నారన్నారు. కానీ ఈ సర్వే ముగింపు దశకు వచ్చేసరికి మహిళలు, పురుషులలో వంట చేయడంపై తమ విశ్వాసం, నైపుణ్యాలు రెండు సమాన స్థాయిలో ఉన్నాయని వారు పేర్కొన్నారు.

పరిశోధనలో పాల్గొన్న తర్వాత కూడా వాళ్ల ఆహారపు అలవాట్లు మారలేదని.. అయినా వంట చేయడం వల్ల వాళ్లు ఆరోగ్యంగా ఉన్నారని పరిశోధకులు తెలిపారు. ఎందుకంటే వంట చేయడం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి ఎలాంటి పనినైనా జయిస్తాడని.. అదే వాళ్ల ఆరోగ్య రహస్యమని చెప్తున్నారు. మంచి వంటతో కలిగే సంతృప్తి, ఆనందంతో పాటు సామర్థ్యం కూడా బయటపడుతుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ వంట నేర్చుకుని మన వంట మనమే మనకు నచ్చేలా చేసుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా ఉంటుందని.. బయట ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మానేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వంట చేయడం వల్ల కలిగే ఇబ్బందులేంటి?

ఆధునిక జీవనశైలి మనకు సౌకర్యాలను కల్పించింది. దాంతో పాటే వ్యాధులకు కూడా తీసుకువచ్చింది. ప్రస్తుత కాలంలో మిక్సీలు, గ్రైండర్లు, ఫ్రీజర్లు, ఓవెన్‌లు వంటి ఆధునిక సౌకర్యాలు వంటగదిలో ఉన్నప్పటికీ వంట చేసే ప్రక్రియ మహిళల ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది. ముఖ్యంగా నేటి మహిళలు నిలుచుని వంట చేయడం వారి వెన్నుపూసపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్యాక్ పెయిన్ కారణాలలో ఇది కూడా ఒకటి అని నిపుణులు అంటున్నారు.
Protein Food : వీటిని తింటే బీపి, గుండె సమస్యలు దూరమవుతాయట..
ఆధునిక వంటగది ప్రతికూలతలు

మనం నిలబడి పని చేసినప్పుడు మన శరీరం బరువు మొత్తం వెనుక ప్రాంతం, చీలమండల మీద పడిపోతుంది. ఈ శరీర భాగాలలో నొప్పికి సంబంధించిన ఫిర్యాదులు పెరుగుతాయి. దీనితో పాటు, ఇప్పటి వంటగది ఎత్తు రెండున్నర నుండి మూడు అడుగులు ఎత్తు ఉంటోంది. అలాగే, స్టవ్, పాత్రల ఎత్తు భిన్నంగా ఉంటాయి. ఈ స్థితిలో పని చేయడం వల్ల మహిళలు భుజం నొప్పి, వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో మహిళలు ఫోన్ మాట్లాడుకుంటూ వంట చేసుకుంటూ చెవికి భుజానికి మధ్య ఫోన్ పెట్టుకుని పని చేస్తున్నారు. ఇది వారి శరీర కదలికను మరింత దిగజార్చుతుంది. మెడపై ఒత్తిడి కారణంగా మెడ సమస్య పెరుగుతుంది. అయితే నిలబడి వంట చేయలేని వారు కూర్చుని వంట చేస్తే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదని.. అందుకే పాతకాలంలో కట్టెల పొయ్యిలు వాడేవాళ్లు అని నిపుణులు సలహా ఇస్తున్నారు.

వంటతో లాభాలు


కూర్చుని వంట చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

మన అమ్మమ్మలు సంప్రదాయ వంటగదిలో పీటపై కూర్చొని ఆహారం వండేవారు. ఇలా కూర్చొని ఆహారాన్ని వండడం ఒక రకమైన స్ట్రెచింగ్ యాక్టివిటీ అని, దీని వల్ల స్త్రీల పొత్తికడుపు, వెన్ను, తుంటి కండరాలపై ఒత్తిడి ఏర్పడి అవి కదలికలో ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. రోజుకు మూడు నాలుగు సార్లు ఆహారం, స్నాక్స్ తయారుచేసేటప్పుడు, మహిళలు ఈ స్థితిలో ఉంటారు. దీనివల్ల వారి కడుపు పెరగదు, స్థూలకాయం పెరగదు. వెన్నుముక బాధ లేదు. అంతే కాకుండా పాత్రలు, బట్టలు, చీపుర్లు, తుడవడం వంటి పనులు కూడా మహిళలు కూర్చొని చేసేవారు. దీనివల్ల చాలా వ్యాయామం చేసి శరీరం స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండేవారు.
Healthy Food : ఉసిరి తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా..
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read