Wednesday, December 1, 2021
Homeతెలుగు Newsసినిమాposani krishna murali: ప్రేమ, గర్భం, అబార్షన్.. పూనమ్ కౌర్‌ను మధ్యలోకి లాగేసిన పోసాని! పవన్...

posani krishna murali: ప్రేమ, గర్భం, అబార్షన్.. పూనమ్ కౌర్‌ను మధ్యలోకి లాగేసిన పోసాని! పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ – posani krishna murali satires on pawan kalyan and poonam kaur


ప్రధానాంశాలు:

  • రిపబ్లిక్ ఈవెంట్ రచ్చ
  • పవన్ కళ్యాణ్ మాటల వేడి
  • పోసాని కృష్ణ మురళీ కౌంటర్లు

పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు ఇంకా కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం, మంత్రులను తిట్లతో చీల్చి చెండాడిన పవన్ కళ్యాణ్‌కు అంతే స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఏపీ మంత్రులు పవన్ కళ్యాణ్‌ను ఏకిపారేశారు. అయితే తాజాగా చిత్ర పరిశ్రమను పోసాని కృష్ణ మురళీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్‌ను దారుణంగా విమర్శించాడు. నిజాయితీ ఉంటే.. నిజంగా పవర్ స్టార్ అయితే ఓ అమ్మాయికి న్యాయం చేయ్.. అంటూ పంజాబీ అమ్మాయి అంటూ పరోక్షంగా పూనమ్ కౌర్ విషయాన్ని మధ్యలోకి లాగేశాడు పోసాని.

‘రిపబ్లిక్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ వచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పైకి రాలేదు. అతను చాలా మంచివాడు. నన్ను తండ్రి సమానుడిగా చూస్తాడు. చిత్రలహరి సినిమాలో తండ్రి వేషం వేశాను. అతని దురదృష్టమో ఏమో గానీ ప్రమాదం జరిగింది. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఆయన సినిమా ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ వెళ్లాడు. అక్కడ మాట్లాడాల్సిన మాటలు ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు ఏంటి?

ఓరేయ్ సన్నాసుల్లారా. వెధవల్లారా? అంటూ ముఖ్యమంత్రి, మంత్రులను తిడతాడా? లక్షల కోట్లు మీరే సంపాదించుకోవాలా? అని అంటాడు. దిల్ రాజు రెడ్డి.. మీరు రెడ్డి ఆయన రెడ్డి.. మీరు మీరు మాట్లాడుకోండి అని అంటారా? ఇది ఎవరు మాట్లాడాల్సిన మాటలు.. ఆయనకు కులపిచ్చి ఉందని ఎవ్వరైనా నిరుపిస్తారా?. ఆయనతో ఎప్పటికీ పోల్చుకోకు. పులివెందులకు వెళ్లకపోయినా ఆయన గెలుస్తారు. నువ్ అలా ఏదైనా నియోజకవర్గానికి వెళ్లకుండా గెలుస్తావా? గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయావ్ కదా?.

సరే గెలుపు అనేది నిజాయితీకి కొలమానం కాదు అని అనుకుందాం? నీ నిజాయితీని జనాలు గుర్తించడం లేదు అనుకుందాం. నేను ఓ సమస్య చెబుతాను.. చిత్రపరిశ్రమలో ఓ అమ్మాయికి జరిగిన అన్యాయం చెబుతాను.. నీకు ఆడవాళ్లు అంటే గౌరవం కదా? నీకు నిజాయితీ ఉంటే.. దాన్ని పరిష్కరించండి.. ఆడవాళ్ల జోలికి వస్తే తాటతీస్తా అని సినిమాల్లో డైలాగులు చెప్పారు కదా. మీకు ఆడవారంటే చాలా గౌరవం ఉందని తెలుస్తోంది. పదహారేళ్లప్పుడే కొన్ని వందల కలలతో ఓ పంజాబీ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చింది.. తెలుగువాళ్లు మంచివారు, పరిశ్రమ మంచిది అని అవకాశాలు ఇస్తారు అని నమ్మి వచ్చింది. అలా సినిమాల కోసం ట్రై చేస్తే.. ఓ ప్రముఖుడు వేషం ఇప్పిస్తా.. బాగున్నావ్ అంటే నమ్మింది.

చేరదీస్తా అని చెప్పి.. మోసం చేసి.. కడుపు చేశాడు. చివరకు అబార్షన్ చేసుకోమన్నాడు. ప్రేమన్నారు.. పెళ్లన్నారు కదా? అని ఆ అమ్మాయి అంటే నోరుమూసుకో అని బెదిరించాడు. అబార్షన్ చేసుకో.. కావాలంటే ఎప్పుడైనా రా.. వేషం ఇస్తా.. ఇది బయటపెడితే నిన్ను లేకుండా చేస్తా.. అంతు చూస్తా అన్నాడట.. అది నేను విన్నాను.. హైద్రాబాద్ ఆస్పత్రిలో తీసుకెళ్లి అబార్షన్ చేయించాడట.

చివరకు ఐదు కోట్లు ఇచ్చి నోరు మూసుకోండి.. అని బెదిరించాడట. నాకు తెలిసింది చెప్పాను..ఇక చేసేదేం లేక.. గతి లేక.. ఇంతపెద్దాయన.. పవర్ఫుల్ మనిషి అని ఏడుస్తూ కూర్చుండిపోయింది. మానసిక రోగంతో సన్నగా మారిపోయి.. పిచ్చిది అయిందిది.. ఏడుస్తూ ఉంది. మీరు పవర్ స్టార్ కదా? ప్రశ్నించే గుణం ఉంది కదా? మీరు ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఆ తరువాత ఎవ్వరి గురించైనా మాట్లాడండి’ అని పోసాని సంచలన కామెంట్స్ చేశాడు.

ఇక ఆ పంజాబీ అమ్మాయి ఎవరో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కత్తి మహేష్ కూడా ఇదే అంశాలను పైకి లేవనెత్తాడు. పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అంటూ కత్తి మహేష్ ఎన్నో విషయాలను బయటపెట్టేశారు. ఇక పూనమ్ కౌర్ కూడా మధ్యమధ్యలో గురూజి అని ట్వీట్లు వేసింది. పవన్ కళ్యాణ్‌ను నాశనం చేస్తోంది కూడా ఆయనే అంటూ ఎన్నెన్నో ట్వీట్లు వేసింది. తాను ఓ దర్శకుడి చేతిలో మోసపోయాను అని కూడా చెప్పిన సంగతి తెలిసిందే. డిప్రెషన్‌లోకి వెళ్లాను అని.. తాను చచ్చిపోయినా కూడా ఏం పర్లేదు అన్నాడంటూ పూనమ్ కౌర్ ఆ మధ్య ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. మొత్తానికి పోసాని కామెంట్లతో మరోసారి పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Samsung Galaxy S22 (Plus): An optical zoom like in the S21 Ultra?

The Samsung Galaxy S22 and Galaxy S22 Plus had their specs allegedly leaked indicating that even the base model could have a telephoto...