Wednesday, July 28, 2021
Homeతెలుగు Newsసినిమాpragathi: వర్కవుట్స్ చేసేది అందుకోసమే.. సన్నగా కావడం కాదు మ్యాటర్! అసలు సీక్రెట్ చెప్పేసిన ప్రగతి...

pragathi: వర్కవుట్స్ చేసేది అందుకోసమే.. సన్నగా కావడం కాదు మ్యాటర్! అసలు సీక్రెట్ చెప్పేసిన ప్రగతి – actress pragathi says the reason behind pragathi workouts


సోషల్ మీడియాలో సీనియర్ నటి ప్రగతి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డాన్స్ వీడియోలతో ఆకట్టుకుంటూనే హాట్ హాట్ వర్కవుట్స్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్‌నెస్‌తో ఆశ్చర్య పరుస్తుంటుంది. వెండితెరపై తల్లిగా, అక్కగా, వదినగా అలరిస్తూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ప్రగతి.. నిజ జీవితంలో మాత్రం యమ హాట్‌గా కనిపిస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కిస్తుంటుంది. అయితే ఇదే విషయమై తాజాగా ఓ నెటిజన్ వేసిన ప్రశ్నపై ఆసక్తికరంగా బదులిచ్చింది ప్రగతి.

తాను ఇంట్లో, జిమ్ముల్లో చేస్తున్న వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం హ్యాబీగా పెట్టుకున్న ప్రగతి.. రీసెంట్‌గా తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. యంగ్ హీరోయిన్లు సైతం బిత్తరపోయేలా ఫుల్ ఎనర్జీతో ఈ వీడియోలో కనిపించింది ప్రగతి. దీంతో ఈ క్లిప్ నెట్టింట వైరల్ అయింది. ఇక ఈ వీడియోపై ‘కొన్నిసార్లు మీరు వంతెన తెంచేసి మరీ ఈత నేర్చుకోవాలి. వర్కవుట్స్ అనేవి మనలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి’ అని ట్యాగ్ చేసింది ప్రగతి.
telugu samayamకూతురు మరణంపై అన్నపూర్ణ షాకింగ్ కామెంట్స్.. తెల్లారేసరికి అలా! ఆమె చావుకు కారణం అదేనంటూ ఓపెన్
సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్న ఈ వీడియోపై నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ వయసులో కూడా వాట్ ఏ ఎనర్జీ అంటూ కితాబిస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం ‘మీరు ఇంత కష్టపడుతున్నా సన్నబడటం లేదేంటి మేడం?’ అని ప్రశ్నించడంతో దానిపై ప్రగతి రియాక్ట్ అయింది. వర్కవుట్స్ అనేవి సన్నబడటం కోసం కాదు.. శారీరకంగా, మానసికంగా దృఢంగా కావడానికి అంటూ బదులిచ్చింది. ఇదిలా ఉంటే, మరోవైపు ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో ప్రగతి హంగామా ఉండనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.





Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Today's news

Latest offer's