Thursday, December 2, 2021
Homeతెలుగు Newsసినిమాpriyanka chopra: Priyanka Chopra : సేమ్ టు సేమ్‌.. స‌మంత‌లాగే ప్రియాంక చోప్రా భ‌ర్త...

priyanka chopra: Priyanka Chopra : సేమ్ టు సేమ్‌.. స‌మంత‌లాగే ప్రియాంక చోప్రా భ‌ర్త నుంచి విడిపోనుందా? ఇదేనా ప్రూఫ్! – priyanka chopra dropped jonas name from her insta account


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత.. నాగ‌చైత‌న్య నుంచి విడిపోయినప్పుడు ఎలాగైతే జ‌రిగిందో అదే రూట్‌లోనే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ట్రావెల్ చేస్తుందా? త‌న భ‌ర్త నిక్ జోన‌స్ నుంచి ప్రియాంక చోప్రా విడిపోనుందా! అంటే అవున‌నే గుస‌గుస‌లాడుతున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు. నాగ‌చైత‌న్య‌తో విడిపోయే ముందు స‌మంత ఎలా బిహేవ్ చేసిందో అలాగే ఇప్పుడు ప్రియాకం చోప్రా ప్ర‌వ‌ర్తిస్తుంది. చైతుతో స‌మంత కొత్త ఇంట్లోకి వెళ్లాల‌నుకున్నారు. త‌ర్వాత వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చాయి. ఇద్ద‌రూ విడిపోవాల‌నుకున్న త‌ర్వాత ముందు స‌మంత సోష‌ల్ మీడియాలో త‌న పేరులో ఉండే అక్కినేని అనే పేరుని తొల‌గించి పాత పేరు స‌మంత రూత్ ప్ర‌భు అని పెట్టుకుంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా సేమ్ టు సేమ్ అలాగే చేస్తుంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా త‌న భ‌ర్త పేరును త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తొల‌గించింది. రీసెంట్‌గా ఆమె త‌న భ‌ర్త నిక్ జోన‌స్‌తో క‌లిసి లాస్ ఏంజిల్స్‌లోని కొత్త ఇంటికి మకాం మార్చింది. అలా మార్చిందో లేదో ఇన్‌స్టాలో త‌న భ‌ర్త పేరుని లేపేసింది. ఈ చ‌ర్య‌లు బాలీవుడ్ వ‌ర్గాల‌కు అనుమానాల‌ను రేకెత్తిస్తున్నాయి. నిక్ నుంచి ప్రియాంక విడిపోనుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

2018లో అమెరిక‌న్ సింగ‌ర్‌, కంపోజ‌ర్ నిక్ జోన‌స్‌ను ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంది. దాదాపు త‌న‌కంటే 12 ఏళ్లు చిన్న‌వాడైన నిక్‌ను ప్రియాంక పెళ్లి చేసుకుంటుంద‌ని తెలిసి అంద‌రూ షాక‌య్యారు. స‌రే! ల‌వ్ మ్యారేజ్ క‌దా! అని కొంద‌రూ స‌ర్ది చెప్పుకుంటే, కామెంట్స్ చేసిన వారు కూడా ఉన్నారు. అయితే ఇవేమీ ప‌ట్టించుకోకుండా నిక్ జోన‌స్‌, ప్రియాంక చోప్రా 2018లో క్రిస్ట‌య‌న్ ప‌ద్ధ‌తిలో, హిందూ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన త‌ర్వాత ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న పేరుని ప్రియాంక జోన‌స్‌గా మార్చుకుంది. ఈ రెండేళ్ల పాటు ఇద్ద‌రూ క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. ఇద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త‌ను చూసి కుళ్లుకున్న‌వాళ్లున్నారు. సంతోషించిన‌వారున్నారు. అయితే ఏమైందో ఏమో.. ఇద్ద‌రు మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చాయేమో తెలియ‌దు కానీ. ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి జోన‌స్ అనే పేరుని తొల‌గించేసింది. అంతే కాదండోయ్ త‌న ఇన్‌స్టాలో ప్ర‌తిదానికి మొద‌లంటూ ఒక‌టుంటుంది అంటూ క్యాప్ష‌న్ కూడా పెట్టుకుంది.

ప్రియాంక చోప్రా


రీసెంట్‌గా లాస్ ఏంజిల్స్‌లోని కొత్త ప్రియాంక చోప్రా, నిక్ జోన‌స్‌లు ఈ ఏడాది దీపావ‌ళి పండుగ‌ను కూడా సెల‌బ్రేట్ చేసుకున్నారు. యాదృచ్చికంగా జ‌రిగినా, స‌మంత‌..ప్రియాంక చోప్రా జీవితాల్లో కొన్ని ప‌రిణామాలు పెళ్లి త‌ర్వాత ఒకేలా జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Notable Indian Celebrities who died in 2021

Notable Indian Celebrities who died in 2021 The Indian film and television industry lost some of its gems in 2021 Sirivennela Seetharamasastry, Chandrasekhar Srivastava, Dilp Kumar,...