Wednesday, December 8, 2021
Homeతెలుగు Newsసినిమాpuri jagannadh birthday: Charmme Kaur: చేతిలో మందు గ్లాసుతో పూరికి బ‌ర్త్ డే విషెష్...

puri jagannadh birthday: Charmme Kaur: చేతిలో మందు గ్లాసుతో పూరికి బ‌ర్త్ డే విషెష్ చెప్పిన ఛార్మి – charmme kaur birthday wishes to director puri jagannadh


ప్రధానాంశాలు:

  • డైరెక్టర్ పూరీకి ఛార్మి బర్త్ డే విషెష్
  • పూరీతో కలిసి సినిమాలు నిర్మిస్తోన్న ఛార్మి
  • ప్రస్తుతం పూరి, ఛార్మి కలిసిలైగర్ సినిమాను రూపొందిస్తున్నారు.

సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చే హీరోలు మాస్ ఇమేజ్ కావాల‌ని కోరుకుంటారు. అలాంటి మాస్ ఇమేజ్‌ను పెంచుతూ సినిమాల‌ను తెరకెక్కించే ద‌ర్శ‌కుల్లో పూరీ జ‌గ‌న్నాథ్ ముందు వ‌రుస‌లో ఉంటారు. బాలకృష్ణ‌, నాగార్జున స‌హా ఇప్ప‌టి త‌రంలోని అగ్ర హీరోలంద‌రూ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేసిన‌వారే. అలాంటి ఇమేజ్ సంపాదించుకున్న డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు ఈరోజు(సెప్టెంబ‌ర్ 28). ఆయ‌న‌కు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ చేస్తున్నారు. అయితే ఆయ‌న‌తో క‌లిసి సినిమాల‌ను నిర్మిస్తోన్న ఛార్మి ముందుగా ఆయ‌నకు చెప్పిన బ‌ర్త్ డే విషెష్ వైరల్ అవుతుంది. అందుకు కార‌ణం, చేతిలో మందు గ్లాసుతో ఛార్మి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డ‌మే అందుకు కార‌ణం.

‘‘నాకెంతో ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు ధ‌న్య‌వాదాలు. మీరు గ‌ర్వ‌ప‌డేలా ఆ న‌మ్మ‌కాన్ని నేను ఎప్పుడూ నిల‌బెట్టుకుంటూనే ఉన్నాను’’ అంటూ చేతిలో మందుగ్లాసు ప‌ట్టుకుని త‌న ముందుకు కుర్చిలో కూర్చున్న పూరికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఛార్మి ఇప్పుడు నిర్మాత‌గా మారారు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమాల‌కు ఆయ‌న‌తో పాటు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. సిన ఇండ‌స్ట్రీకి సంబంధించి ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్‌, యాడ్ ఫిలింస్‌, మార్కెటింగ్ డిజైనింగ్ చేస్తూ పూరీ క‌నెక్ట్స్ పేరుతో ఓ సంస్థ‌ను స్థాపించారు.

ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ సినిమాకు ఆయ‌న‌తో పాటు ఛార్మి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతుంది.Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds