Homeతెలుగు NewsవంటPushpa: Allu Arjun: షాకిస్తున్న పుష్ప థియేటర్స్ కౌంట్! తగ్గేదే లే.. మాస్ జాతరకు ఇదే...

Pushpa: Allu Arjun: షాకిస్తున్న పుష్ప థియేటర్స్ కౌంట్! తగ్గేదే లే.. మాస్ జాతరకు ఇదే పునాది!! – allu arjun pushpa world wide theaters count here


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సక్సెస్‌ఫుల్ కాంబోలో వస్తున్న పుష్ప మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్ర తొలి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఏకంగా 3000 పైగా థియేటర్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తుండటం ఆసక్తికర అంశం.

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1150 వరకు థియేటర్స్‌లో ‘పుష్ప’ మూవీ రిలీజ్ కాబోతోందట. ఇందులో నైజాంలో 375 ప్లస్ థియేటర్స్, సీడెడ్ 260 ప్లస్ థియేటర్స్, ఆంధ్ర 515 ప్లస్ థియేటర్స్ ఉన్నాయని సమాచారం. ఇక ఇతర రాష్ట్రాలైన కర్ణాటకలో 140, తమిళనాడులో 280, కేరళ 200, హిందీ, రెస్టాఫ్ ఇండియా కలిపి 600, ఓవర్సీస్‌లో మరో 600 థియేటర్స్ పుష్ప కోసం కేటాయించబడ్డాయని, మొత్తంగా చూస్తే 3000 పైగా థియేటర్స్‌లో పుష్ప రిలీజ్ కానుందని అంటున్నారు. ఈ లెక్కన అల్లు అర్జున్ మాస్ జాతర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
మరోసారి ఓయో రూములో విష్ణు ప్రియ.. నిరాశకు చోటే లేదంటూ మెసేజ్! హాట్ యాంకర్ బెస్ట్ ఆఫర్
మైత్రి మూవీ మేకర్స్ భారీ రేంజ్‌లో రూపొందించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించగా సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మోవీపావు బన్నీ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను మాటల్లో చెప్పలేం. సో.. చూడాలి మరి విడుదల తర్వాత ఈ సినిమా హంగామా ఎలా ఉంటుందనేది!.



Source link

Mr.Mario
Mr.Mario
I am a tech enthusiast, cinema lover, and news follower. and i loved to be stay updated with the latest tech trends and developments. With a passion for cyber security, I continuously seeks new knowledge and enjoys learning new things.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read