Monday, November 29, 2021
Homeతెలుగు Newsసినిమాraj kundra: నీలి చిత్రాలు తీసేందుకు రాజ్ కుంద్రాను ఆమె పురికొల్పింది.. నటి గెహనా సంచలన...

raj kundra: నీలి చిత్రాలు తీసేందుకు రాజ్ కుంద్రాను ఆమె పురికొల్పింది.. నటి గెహనా సంచలన వ్యాఖ్యలు – sherlyn chopra forced raj kundra to make pornographic films


సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ వ్యవహారం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. శృంగార చిత్రాలను నిర్మించి, వాటిని ఇంటర్నెట్ యాప్స్‌లో పబ్లిష్ చేస్తున్నారనే అభియోగంతో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో చాలా మంచి హీరోయిన్లు.. పలు సంచలన విషయాలు బయటపెట్టారు. అందులో నటి గెహనా వాశిస్ట్ కూడా ఉంది. పోర్నోగ్రాఫీ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో గెహనాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను 133 రోజులు కస్టడీలో ఉంచిన పోలీసులు ఆపై బెయిల్‌ రావడంతో వదిలేశారు.

తాజాగా రాజ్ కుంద్రాకు కూడా ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తొలుత రెండు సార్లు రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. కొద్ది రోజుల క్రితం ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే రాజ్ కుంద్రా కేసులో సంచలన వ్యాఖ్యలు చేసిన వారిలో నటి షెర్లిన్ చోప్రా కూడా ఉంది. రాజ్ కుంద్రా, ఆయన అసిస్టెంట్లు నీలి చిత్రాల్లో నటించాలని తనపై ఒత్తిడి చేశారని.. అంతేకాక.. తనతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం తనకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు అంటూ ఆమె పేర్కొంది. కొద్ది రోజుల క్రితం శిల్పా శెట్టి చేసిన కామెంట్స్‌పై కూడా షెర్లిన్ స్పందించింది. అయితే తాజాగా షెర్లిన్‌కు గెహనా షాక్ ఇచ్చింది.

అసలు రాజ్ కుంద్రా నీలి చిత్రాలు తీసేందుకు పురిగొల్పింది షెర్లినే అని గెహనా పేర్కొంది. మీడియా దృష్టిని ఆకర్షించి, నిత్యం వార్తల్లో నిలిచేందుకే షెర్లిన్‌ చోప్రా, శిల్పా శెట్టి దంపతుల పరువు భంగం కలిగేలా మాట్లాడుతుందని ఆమె తెలిపింది. ‘షెర్లిన్‌కు కోట్లాది రూపాయిల లాభం వచ్చేందుకు రాజ్ కుంద్రా ఎంతో ఉపయోపడ్డారు. ఆయన క్రియేట్‌ చేసిన ఆర్మ్‌స్ప్రైమ్ యాప్ ద్వారా ఈ స్థాయికి వచ్చిన ఆమె కుంద్రాకి రుణపడి ఉండాలి. అయితే ఆమెను ఆయన్ను ఊబిలోకి లాగింది. నిజానికి షెర్లిన్ 2012 నుంచి బోల్డ్ కంటెంట్ ఉన్న వీడియోలు చేస్తుంది. కానీ, రాజ్ కుంద్రాతో ఆమెకు ఉన్న పరిచయం మాత్రం రెండున్నర సంవత్సరాలే’ అంటూ గెహనా సంచలన వ్యాఖ్యలు చేసింది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds