Thursday, October 28, 2021
Homeతెలుగు NewsసినిమాRaj Kundra Bail: పోర్న్ రాకెట్ కేసు: రాజ్ కుంద్రాకు బెయిల్.. ఆయన భార్య శిల్పా...

Raj Kundra Bail: పోర్న్ రాకెట్ కేసు: రాజ్ కుంద్రాకు బెయిల్.. ఆయన భార్య శిల్పా శెట్టి ఫస్ట్ రియాక్షన్ వైరల్ – raj kundra pornography: shilpa shetty first reaction on her husband bail


సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలు షూట్ చేసి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలల పాటు పోలీసుల కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాపై కొందరు నటీమణుల నుంచి తీవ్ర ఆలోపణలు చేశారు. తమ అశ్లీల చిత్రాలు హాట్‌షాట్స్‌ యాప్‌లో విడుదల చేశారని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కేసు విషయమై ఎన్నో కీలక విషయాపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఈ ఇష్యూ బాలీవుడ్ వర్గాలను కుదిపేసింది.

అయితే ఇటీవలే తన భర్త చేస్తున్న వ్యాపారాల గురించి తనకు తెలియదని, తన షూటింగుల్లో తాను బిజీగా ఉంటానని పోలీసులకు చెప్పింది శిల్పా శెట్టి. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకాలం పోలీసుల అదుపులో ఉన్న రాజ్‌కుంద్రాకు ముంబై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచికత్తుతో ఆయనకు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదల ఆయనను చేశారు.

Raj Kundra Bail


”చెడు తుఫాను అనంతరం అందమైన విషయాలు జరుగుతాయని నిరూపించడానికే ఇంద్రధనస్సు వస్తుంది” అనే కొటేషన్‌ షేర్ చేస్తూ భర్తపై పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది శిల్పా శెట్టి. 2009 సంవత్సరంలో రాజ్ కుంద్రాను పెళ్లాడిన శిల్పా శెట్టి అప్పటి నుంచి అతనితో జాలీ లైఫ్ గడుపుతోంది. అయితే రీసెంట్‌గా రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు బయటపడటంతో వీరిద్దరి వివాహ బంధంపై రూమర్స్ తెగ షికారు చేశాయి. ఈ పరిస్థితుల నడుమ తన భర్తకు బెయిల్ వచ్చాక శిల్పా ఇలా రియాక్ట్ కావడం ఆసక్తికర పరిణామం.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Why DMK surrendered to BJP? Naam Tamil Party Seeman criticize ruling party |...

சென்னை: மத்திய அரசிடம் மாநில அரசும், ஆளும் கட்சியான திராவிட முன்னேற்றக் கழகமும் அடிபணிந்துவிட்டதாக நாம் தமிழர் கட்சித் தலைவர் சீமான் காட்டமான விமர்சனங்களை முன் வைத்துள்ளார். அறிஞர் அண்ணாவின் வழியில்...