Rakshasudu2: తెరపైకి రాక్షసుడు- 2.. అగ్ర హీరోతో ‘ఖిలాడీ’ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్! – director ramesh varma announced rakshasudu-2

0
14
Rakshasudu2: తెరపైకి రాక్షసుడు- 2.. అగ్ర హీరోతో ‘ఖిలాడీ’ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్! – director ramesh varma announced rakshasudu-2


గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వల్స్ రావడం అనేది తరచుగా చూస్తున్నాం. ప్రేక్షకుల నాడిని పట్టేసి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలకు సీక్వల్స్ ప్లాన్ చేసి అంతకుమించిన రెస్పాన్స్ తెచ్చుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇదే బాటలో వెళ్ళబోతున్నారు డైరెక్టర్ రమేష్ వర్మ. ‘రాక్షసుడు’ మూవీకి సీక్వల్ ప్లాన్ చేసిన ఆయన ఇందుకోసం పక్కాగా స్కెచ్చేస్తున్నారు.

2019 సంవత్సరంలో ‘రాక్షసుడు’ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు రమేష్ వర్మ. బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వల్‌గా ‘రాక్షసుడు- 2‘ రూపొందించనున్నట్లు తాజాగా రమేష్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

‘రాక్షసుడు- 2’ కోసం ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథను సిద్ధం చేసిన డైరెక్టర్ రమేష్ వర్మ.. ఈ సినిమాలో అగ్ర హీరోను భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారట. ఇందుకోసం ఆయన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఉంచుకున్నారని సమాచారం. ‘రాక్షసుడు- 2’ ప్రకటిస్తూ.. ఈ సారి మరింత థ్రిల్‌ కలుగుతుందని, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుంది అని పేర్కొన్న రమేష్ వర్మ.. సాంకేతిక బృందంలో ఏ మార్పు లేకపోయినా చిత్ర తారాగణంలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.
telugu samayamవెండితెరపై వంటలక్క.. యంగ్ హీరో సినిమాలో ప్రేమి విశ్వనాథ్‌! అతని ఎనర్జీకి ఆమె తోడైతే ఇక రచ్చే..
ఇకపోతే ప్రస్తుతం రవితేజ హీరోగా ‘ఖిలాడి’ సినిమా తెరకెక్కిస్తున్నారు రమేష్ వర్మ. స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌. డా. జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ సార్జా, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో కనిపించనుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here