Tuesday, July 27, 2021
Homeతెలుగు Newsసినిమాram lakshman masters: మేం కూడా గాడిద రక్తం తాగుతాం.. Krack ఫైట్ ఇలా వచ్చిందే:...

ram lakshman masters: మేం కూడా గాడిద రక్తం తాగుతాం.. Krack ఫైట్ ఇలా వచ్చిందే: రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ – ram lakshman fight masters about krack movie beach fight


దర్శకుడు చెప్పే కథలో నుంచే కొత్తదనం పుట్టుకొస్తుందని.. అలా వచ్చిందే క్రాక్ సినిమాలోని గాడిద రక్తం ఫైట్ అని అంటున్నారు టాలీవుడ్ నెంబర్ 1 ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు. మారిన పరిస్థితులు.. టెక్నాలజీతో తాము కూడా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నామని.. ఫైట్స్ కంపోజ్‌లో కూడా మార్పులు వస్తున్నాయని అంటున్నారు రామ్ లక్ష్మణ్‌ మాస్టర్లు.

క్రాక్ సినిమా ఫైట్స్‌కి మంచి పేరు రావడంతో పాటు ఆ సినిమాలోని బీచ్ ఫైట్ అంత బాగా వచ్చిందంటే.. అందులో తమ పర్సనల్ అనుభవాలు ఉండటం వల్లే అని అంటున్నారు.

దీనిపై మాట్లాడుతూ.. ‘భరత్ అనే నేను’ సినిమాలో ఓ సీఎం ఫైట్ చేయాలి.. షర్ట్ నలగకుండా ఫైట్ చేస్తేనే అక్కడ బాగుంటుంది.. కిందా మీద పడిపోయి ఫైట్ చేస్తే కళ కట్టదు. ఆడియన్స్ కూడా ఇలాంటి వాటిని కోరుకోరు. కథ డిమాండ్ చేస్తే హీరోని కూడా కొట్టిస్తాం.. రంగస్థలం సినిమాలో హీరోని కొట్టించాం.. నేచురల్‌గానే వెళ్తున్నాం..

క్రాక్ సినిమాలో మీరు చూసే ఉంటారు.. ఒక బీచ్ పక్కన ఉండే ఒక మూర్ఖపు బ్యాచ్‌ని ఎంత క్రూరంగా చూపించాలో అంత క్రూరంగా చూపించాం. వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ని పర్ఫెక్ట్‌గా పట్టుకున్నాం. ఈ ఫైట్‌కి ప్రేరణ ఉంది. చీరాలలో మేం కూడా గాడిద రక్తం తాగి పరుగుపెట్టేవాళ్లం. ఫైటర్స్‌గా ఉన్నప్పుడు గాడిద రక్తం తాగేవాళ్లం. ఇంటికి మంచిదని గాడిద రక్తం తాగుతుంటారు. ఇప్పుడు కూడా అది ఉంది.. చీరాలలో తాగుతుంటారు. స్టువర్ట్ పురం అనే ఒక ఏరియా ఉండేది.. ఆ ఏరియాలో ఎక్కువగా దొంగతనాలు జరిగేవి. పోలీసులు వాళ్లని గట్టిగా కొట్టేవారు. అందుకు ఆ దొంగలు గాడిద రక్తం తాగి.. గాడిద సమురు పూసుకుని పరుగుపెట్టేవారు. ఎందుకంటే పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల వచ్చే నొప్పులు పోతాయని. అలా వాళ్లు మళ్లీ ఒకటి రెండు నెలల్లో మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టేవారు.

ఇలా మాకు గాడిద రక్తంతో రియల్ అనుభవం ఉంది కాబట్టి.. క్రాక్ సినిమాలో ఫైట్స్ చాలా రియల్‌గా వచ్చాయి. ఆ ఫైట్ సీక్వెన్స్ నేచురల్‌గా ఉండదు. కావాలనే అలా డిజైన్ చేశాం. ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేశారు ఆ ఫైట్‌ని అంటూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు రామ్ లక్ష్మణ్‌ మాస్టర్స్.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Today's feeds

Hospital sources says Yashika Aanand is in Critical Care – தமிழ் News

நடிகை யாஷிகா ஆனந்த் நேற்று நள்ளிரவு மகாபலிபுரம் சாலையில் ஏற்பட்ட கார் விபத்தில் படுகாயமடைந்த நிலையில் தற்போது அவரது நிலைமை கவலைக்கிடமாக இருப்பதாக மருத்துவமனை வட்டாரங்கள் கூறியிருப்பது பெரும் பரபரப்பை ஏற்படுத்தி...

Today's news

Latest offer's